Latest Govt Jobs

వృద్ధులతో నిండిపోతున్న చైనా! భవిష్యత్ అంతా చీకటే!

[ad_1]

<![CDATA[ప్రస్తుతం ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన చైనా, మరో నాలుగేళ్లలో 140 కోట్లకు చేరుకుంటుందని గణాంకాలు సూచిస్తున్నాయి. కానీ 2100 నాటికి సగానికి సగం అంటే 73.2 కోట్లకు పడిపోతుందని అంచనా వేస్తున్నారు. అప్పటికి భారత్ ప్రథమస్థానంలోకి వచ్చే అవకాశం ఉంది. 2100 నాటికి భారతదేశ జనాభా 109 కోట్లు ఉంటుందని అంచనా.

ఇలా జరగటానికి కారణం చైనా అనుసరించిన ‘కఠినతర జనాభా నియంత్రణ’ అదే దాని కొంప ముంచింది. దేశంలో వృద్ధుల సంఖ్య వేగంగా వృద్ధిచెందుతుంది.  దీంతో ప్రభుత్వం జనాభా నియంత్రణ నిబంధనలను సడలించింది. “పిల్లల్ని కనండి! బహుమతులు, ప్రోత్సాహకాలు పంచుకొండి!” అని మొత్తుకునే పరిస్థితి వచ్చింది.

1970 వ దశకం నాటికి చైనాలో జనాభా విపరీతంగా పెరిగిపోయిన వేళ అక్కడి ప్రభుత్వం “వన్ కపుల్ – వన్ చైల్డ్”  (ఒక పాప మాత్రమే ముద్దు) అనే విధానం తీసుకొచ్చింది. అప్పట్నుంచి అందరూ ఒక్కరికే జన్మనివ్వటానికి అలవాటు పడ్డారు. యువత సంఖ్య తగ్గిపోయింది. పలితంగా ఇప్పుడు ఆ దేశంలో వృద్ధులు ఎక్కువైపోయారు.

ఏ  దేశానికైనా “నేటి బాలలే రేపటి పౌరులు” వారే దేశానికి భవిష్యత్.  అయితే చైనా విధానంతో పిల్లలు పుట్టడం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఆ దేశంలో వృద్ధులు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే 2016 లో  చైనా నిబంధనలను కొంత మేర సడలించింది. ఇద్దరు పిల్లలను కనేందుకు అనుమతిచ్చింది. ఒక్కర్ని కనేందుకు అలవాటు పడ్ద ఆ దేశ ప్రజలు పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు ఇద్దరు పిల్లలను కనాలంటూ ఆ దేశం ఘోష పెడుతుంది. బహుశ కొద్దిరోజుల్లో ఇద్దర్ని కనలేని వాళ్ళకు శిక్షలు కూడా విదిస్తుందేమో! చూడాలి.

2020 లో చైనాలో 10.04 మిలియన్ల జననాలు నమోదై, 2019 సంవత్సరంతో పోలిస్తే జననాల సంఖ్య 30%  పడిపోయింది. ఇప్పుడు పిల్లలకు జన్మనివ్వగలిగే వాళ్ళకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. దశాబ్ధాలుగా ఒక్కరిని మాత్రమే కనేందుకు ఆ దేశం లోని యువత మానసికంగా అలవాటుపడ్డారు.  ఇద్దరు పిల్లలను కనడం లేదు. అంతేకాక చైనాలో జీవన వ్యయం కూడా విపరీతంగా పెరిగిపోయింది.

యువత క్రమంగా తరిగి పోవుతుండటంతో ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. దేశానికి ఎంతో ప్రమాదకరమని భావిస్తున్నది. వృద్ధుల సంఖ్య పెరిగి యువకుల సంఖ్య తగ్గడం ఆందోళన చెందాల్సిన విషయమే కదా!

ఒక అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా  అయిదేళ్లలోపు పిల్లల సంఖ్య 2017 నుంచీ 2100 నాటికి 681 మిలియన్ల నుంచీ 401 మిలియన్లకు పడిపోతుంది. 80 యేళ్లు దాటిన వారి సంఖ్య 2017 నుంచీ 2100కి 141 నుంచీ 866 మిలియన్లకు పెరుగుతుంది.


“ఇది మొత్తం ప్రపంచ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. “నాకిప్పుడు 8 యేళ్ల కూతురు ఉంది. తను పెద్దయ్యేటప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళనగా ఉంది” అని ఒక ప్రొఫెసర్ అన్నారు.

వృద్ధులు అధికంగా ఉన్న వ్యవస్థలో ఎవరు ఎక్కువ పన్నులు  కడతారు? అన్ని రంగాల్లో ఉత్పత్తి సామర్ధ్యం తగ్గుతుంది. అప్పుడు ఆర్ధిక అభివృద్ధి ఏలా ముందుకు సాగుతుంది? దేశ జనాభాలో అధికమైన వృద్ధుల పోషణభారం, బాధ్యత ఎవరు తీసుకుంటారు? వారి ఆరోగ్యం సంగతేమిటి? ఉద్యోగం చేస్తున్న వారు ఎప్పటికైనా రిటైర్ అయ్యే అవకాశం ఉంటుందా?  ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయి? అన్న అంశాలపై ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది.]]>

[ad_2]

Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close