Latest Govt Jobs

నిండు పున్నమి రాత్రి నిద్దుర తక్కువేగా? శాస్త్రవేత్తలేమంటున్నారు?

[ad_1]

<![CDATA[

చల్లని వెలుగులు చిందించే పున్నమి రాత్రుల చందమామ అందం వేరు, ఆకర్షణ వేరు. పిండారబోసిన వెన్నెల్లో ఆరుబయట నింగిలోకి చూస్తూ పరవసించే వేళ మనం తక్కువ నిదురేపోతాం. అది మనోరంజకం. అయితే ఖగోళ శాస్త్రవేత్తల ఆలోచనలు శాస్త్రీయంగా ఉంటాయి కదా!

పౌర్ణమి వేళ జనం చాలా తక్కువ సమయమే నిద్రిస్తారని, దీనికి చంద్రుడు నిండుగా కాంతి వంతంగా ప్రకాశించడమే ప్రధాన కారణమని తాజా అధ్యయనంలో తేలింది. కాగా, ఈ అధ్యయన ఫలితాలను “సైన్స్ అడ్వాన్సెస్‌ జర్నల్” లో ప్రచురించారు. ఈ అద్భుతమైన విషయాన్ని పౌర్ణమి రోజు గమనించవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

ఖగోళంలో జరిగే అద్భుతాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు ఆహరాహరం సహస్ర నయనాలను విప్పార్చి చూడటానికి సతతం నిరీక్షిస్తుంటారు. ఏ చిన్న మార్పు కనిపించినా భూమిపై ఎలాంటి ప్రభావం, పరిణామం ఉంటుందనే దానిపై పరిశోధనలు జరుపుతారు. చంద్రుడిపై శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో ఒక నవ్యాతి నవ్యమైన అంశం వారి దృష్టిలోకి వచ్చింది.

అదేమంటే: పౌర్ణమి నాడు చంద్రుడు సాధారణం కంటే 14 శాతం ఎక్కువ పరిమాణంలో పెద్దదిగా ఉంటుందని, రోజుటి కంటే 30 శాతం అధిక ప్రకాశవంతంగా ఉంటుందని వారు చెప్పారు. చంద్రుడు భూమికి మరింత దగ్గరకు వస్తున్నందు వలన ఈ నిండు చంద్రుడు దర్శనమిస్తాడని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. తద్వారా, పౌర్ణమినాడు చందమామ ముదురు నారింజ వర్ణంలోకి మారి చూపరులకు  కనివిందు చేస్తుందని పేర్కొంటున్నారు.


మనుషులు పౌర్ణమి ముందు రాత్రులతో పోలిస్తే పౌర్ణమి తర్వాత రాత్రుల్లో 50నిమిషాలు తక్కువ నిద్రపోయారని “సీటెల్‌” లోని “వాషింగ్టన్ విశ్వవిద్యాలయం” జీవ శాస్త్ర ప్రొఫెసర్ ‘కో-అథోర్ హోరాసియో డి లా ఇగ్లేసియా’ చెప్పారు. కాగా, అర్జెంటీనాలో నివసించే టోబా, కోమ్ తెగలకు చెందిన 98 మందిపై ఈ అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారి నిద్ర షెడ్యూల్‌ను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు వారి మణికట్టుపై స్లీప్ మానిటర్‌ను అమర్చారు. పౌర్ణమి రోజు వారి నిద్రస్థితిని పరిశీలించగా, వారు చాలా తక్కువ సమయం నిద్రపోయారని తేలింది.

దీనికి గల కారణాన్ని అన్వేషించగా వారికి ఆసక్తికర విషయం తెలిసింది. పౌర్ణమి రోజుల్లో సూర్యాస్తమయం తరువాత వచ్చే చంద్రుడు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడని, అందువల్లే ఈ సమయంలో మనుషులు తక్కువ సమయం నిద్రపోయారని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో పనిచేసే జీవశాస్త్ర నిపుణుడు స్టడీ కోథర్ లియాండ్రో కాసిరాఘి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ “పౌర్ణమి సమయంలో వెలుతురు ఎక్కువగా ఉంటుంది. రాత్రి సమయంలోనూ ఎక్కువ వెలుతురు ఉండటంతో మనుషులు ఆలస్యంగా నిద్రపోతారు. అంతేకాక, చాలా తక్కువ సమయం పడుకొని ఉదయాన్నే నిద్రకు ఉపక్రమిస్తారు.’’ అని అన్నారు.

ఈ అధ్యయనంలో పాల్గొన్న పట్టణ ప్రాంతాల వారు, గ్రామీణ ప్రాంతాల వారి కంటే తక్కువ సేపు నిద్రపోయారు. సహజంగా, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు మాత్రమే చంద్ర దశల ద్వారా ప్రభావితమవుతారని అందరూ భావిస్తుంటారు. కానీ దానికి భిన్నంగా పట్టణ ప్రాంతాల వారు దీనికి ఎక్కువ ప్రభావిత మవ్వడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని జీవశాస్త్ర నిపుణుడు కాసిరాఘి చెప్పారు.


]]>

[ad_2]

Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close