Blog

నేడు అకాశంలో అద్భుతం.. 19 ఏళ్ల తర్వాతే ఇటువంటి అరుదైన దృశ్యం


ఆకాశంలో నేడు మరో అద్భుతం సాక్షాత్కరించనుంది. చంద్రుడు సాధారణం కంటే మరింత పెద్దగా, ప్రకాశవంతంగా దర్శనమివ్వనున్నాడు. దీనినే బ్లూమూన్‌గా వ్యవహరిస్తారు. ఈ బ్లూమూన్ పేరు వెనుక ఆసక్తికర విషయం దాగి ఉంది. 1883లో ఇండోనేషియాలోని క్రాకాటోవా అగ్ని పర్వతం బద్దలై దాని బూడిద పెద్ద ఎత్తున ఆకాశానికి ఎగసింది. ఈ బూడిద కారణంగా మేఘాలలోని కణాల రంగుమారడంతో చంద్రుడు నీలం రంగులో దర్శనమిచ్చాడు. దీనిని అరుదైన ఘటనగా పేర్కొన్న అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆ నాటి చంద్రుడిని ‘బ్లూ మూన్’గా పిలుస్తోంది.

అలాగే, పౌర్ణమి ఏర్పడడానికి 29.5 రోజులు పడుతుంది. అంటే ఏడాదికి 12 పౌర్ణమిలు ఏర్పడటానికి 354 రోజులు పడుతుంది. ఫలితంగా అవిపోను ఏడాదిలో మిగితా రోజులను రెండున్నరేళ్లకు ఒకసారి కలుపుతారు. అలా కలిపిన రోజుల కారణంగా ఓ సంవత్సరం 13 పౌర్ణమిలు వస్తాయి. అదనంగా వచ్చే ఆ పౌర్ణమిని ‘బ్లూ మూన్’గా వ్యవహరించడం పరిపాటి. సాధారణ పౌర్ణమి రోజు కంటే చంద్రుడు ఏడు రెట్లు ప్రకాశవంతంగా కనిపిస్తాడు.

అయితే, బ్లూ మూన్ అనగానే చంద్రుడు నీలం రంగులో కనిపిస్తాడని కాదు కానీ.. ఆరోజున అత్యంత ప్రకాశవంతంగా ఉంటాడు. శనివారం రాత్రి 8.15 గంటల తర్వాత చంద్రుడు పూర్తి ప్రకాశవంతంగా దర్శనమిస్తాడు. అలాగే చంద్రుడి పక్కనే అంగారక గ్రహం కూడా ప్రకాశిస్తుంది. ఈ అరుదైన దృశ్యం 2001 అక్టోబరు 1 తర్వాత సరిగ్గా 19 ఏళ్లకు మళ్లీ కనువిందు చేయనుంది. ఇటువంటి హాలోవీన్ మూన్‌ను చూడాలంటే 2039 వరకు ఆగాల్సిందే!

ఈ ఏడాది మూడు సూపర్ మూన్స్, నాలుగు చంద్ర గ్రహణాలు, ఓ బ్లూన్ మూన్ దర్శనిమిస్తున్నాయి. మార్చి, ఏప్రిల్, మేలో సూపర్ మూన్స్ ఏర్పడ్డాయి. ఏడాదిలో మిగతా ఖగోళ సంఘటనలు నవంబర్ 30, డిసెంబర్ 29న సంభవించనున్నాయి. నవంబర్‌లో బీవర్ లేదా ఫ్రాస్టీ మూన్, పూర్తిచంద్ర గ్రహణం, డిసెంబరు 20 కోల్డ్ మూన్ ఏర్పడతాయి. ఉష్ణోగ్రతలు తీవ్రంగా తగ్గిపోవడంతో డిసెంబరులో ఏర్పడే పౌర్ణమిని కోల్డ్ మూన్‌గా పిలుస్తారు.


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close