Blog

Vyommitra గగన్‌యాన్: మానవసహిత అంతరిక్ష యాత్రకు మహిళా రోబో!


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంతరిక్షంలోని మానవులను పంపే ‘గగన్‌యాన్‌’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ ద్వారా 2022 నాటికి వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఛైర్మన్‌‌ కె.శివన్‌ ఇటీవల వెల్లడించారు. అయితే, ఈ ప్రయోగానికి ముందే తొలుత రోబో‌ను అంతరిక్షంలోని పంపాలని ఇస్రో నిర్ణయించింది. ద్వారా నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోని పంపుతుండగా, ఈ బృందంలో మహిళలకు మాత్రం చోటులేదు. ఆ లోటును భర్తీచేయడానికి మహిళా రోబోను తొలుత పంపనున్నారు.

అంతరిక్ష యాత్రకు ‘వ్యోమ్‌మిత్రా’పేరుతో మహిళ రోబోను ఇస్రో సిద్ధంచేసింది. రెండో భాషల్లో మాట్లాడిగలిగే ఈ రోబోకు వివిధ పనులు చేయగలిగే సామర్ధ్యం ఉంది. ఇక, గగన్‌యాన్‌ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపితే.. మనుషులను పంపిన నాలుగో దేశంగా భారత్‌ ఘనత దక్కించుకోనుంది. గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ గగన్‌యాన్‌ ప్రాజెక్టుపై ప్రకటన చేశారు. 2022 నాటికి మానవసహిత అంతరిక్ష యాత్రకు ప్రణాళిక రచిస్తున్నట్టు ఆయన తెలిపారు.

గగన్‌యాన్‌తో ఇస్రో సామర్థ్యం మరింత వెలుగులోకి వస్తుందని, వ్యోమగాములను అంతరిక్షం నుంచి సురక్షితంగా తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని ఇస్రో ఛైర్మన్ వ్యాఖ్యానించారు. తాము రూపొందించిన వ్యోమ్‌మిత్రా రోబో అచ్చం మనిషిలాగే అన్ని పనులను నిర్వహించగలదని వివరించారు. గగన్‌యాన్‌లో భాగంగా ఇస్రో పంపే తొలి వ్యోమనౌకను ఖాళీగా పంపకుండా, వీలైనంత వరకూ సద్వినియోగం చేసుకుంటామని, అందుకు రోబోను వినియోగిస్తామని అన్నారు.

గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు రష్యా సహాకారం అందజేస్తోంది. వ్యోమగాములకు తొలుత భారత్‌లో, తర్వాత రష్యాలో శిక్షణ ఇస్తారు. ఇప్పటికే నలుగురిని ఇస్రో ఎంపికచేసింది. గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు కేంద్రం రూ.10వేల కోట్లు కేటాయించింది. ముగ్గురు వ్యోమగాములను వారం పాటు అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రష్యా, ఫ్రాన్స్‌లతో భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు, ‘చంద్రయాన్‌-3’ను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close