NewsTelugu News
తెలంగాణ లోని స్కూల్ పిల్లలకి కేసిఆర్ శుభవార్త
- ఏడాది మే 17 నుంచి 26 వరకు టెన్త్ పరీక్షలు
- కోవిడ్ కారణంగా 11 ప్రశ్నపత్రా లకు బదులు ఈసారి 6 ప్రశ్నపత్రాలతోనే పరీక్షలను నిర్వహించనుంది.
- మిగిలిన తరగతుల వారిని ప్రమోట్ చేసే అవకాశం..?
పదో తరగతి విద్యార్థులకు అలర్ట్. ఈ ఏడాది మే 17 నుంచి 26 వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ పాఠశాల విద్యా శాఖ అకడమిక్ షెడ్యూల్ నిర్ణయించింది. మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించేలా ప్లాన్ చేసింది. కోవిడ్ కారణంగా 11 ప్రశ్నపత్రా లకు బదులు ఈసారి కేవలం 6 ప్రశ్నపత్రాలతోనే పరీక్షలను నిర్వహించనుంది అని నిర్దారించింది.
ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధనను ప్రారంభించా బోతున్నారు ,పరీక్షలకు సంబందించిన షెడ్యూల్ తదితర అం శాలతో ప్రతిపాదిత క్యాలెండర్‌ను తెలంగాణ సర్కార్ ఆమోదం కోసం పంపించింది.ప్రభుత్వం ఈ కొన్ని రోజుల్లో ఆమోద ముద్ర వేసే అవకాశం ఉందని సమాచారం తెలుస్తుంది.
మిగిలిన తరగతుల వారిని ప్రమోట్ చేసే అవకాశం..?
అయితే అకడమిక్ షెడ్యూల్‌లో 9, 10 తరగతులకు మాత్రమే ప్రకటించింది . మిగతా తరగతుల విషయాన్నితీయ లేదు. ఆయా తరగతులకు ప్రత్యక్ష బోధన నిర్వహిస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ 1 నుంచి 8 తరగతు లకు ప్రత్యక్ష బోధన కుదరకపోతే విద్యార్థులకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం ఫిబ్రవరి తరువాత 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధనను ప్రారంభించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ అంశాలన్నింటిపై ప్రభుత్వం ముందు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.