TelanganaTelugu News

తెలుగు రాష్ట్రాలలో ఇంటర్ ఎక్సమ్ షెడ్యూల్ రెడీ

  • 70 శాతం సిలబస్ పైనే వార్షిక పరీక్షలు నిర్వహిస్తమన్న ప్రభుత్వం
  • ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ తప్పనిసరిగా నిర్వహించాలన్న ప్రభుత్వం.
  • ప్రథమ సంవత్సరంలో తప్పిన విద్యార్థులకు గుడ్ న్యూస్.
ts-inter-schedule-2021

తెలంగాణ ఇంటర్ ‌మీడియట్‌ వార్షిక పరీక్షలు మే నెల 3 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలుఉన్నాయని సమాచారం తెలుస్తుంది. ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు మే నెల 19వ తేదీనుండి 24వ తేదీవరకు పూర్తిచేయాలని ఇంటర్‌ బోర్డు అనుకుంటుంది . ఈ మేరకు అధికారులు టైమ్ టేబుల్ ను రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఏప్రిల్‌ నెలలో పరీక్షలు ప్రారంభించి మే రెండో వారానికి పూర్తి చేయాలని గతంలో నిర్ణయించారు. అయితే ఏప్రిల్‌ 27 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్‌ మూడో విడత పరీక్షలు.. మే 24 నుంచి చివరి విడత జేఈఈ మెయిన్‌ ఉన్నందున ఇంటర్‌ పరీక్షలను మే 3న ప్రారంభించి 24వ తేదీకి పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు 19వ తేదీకి పూర్తవుతాయని సమాచారం తెలిసింది.

అకాడమిక్‌ క్యాలెండర్‌లో ఈ మేరకు జరిగే మార్పులతో ఫిబ్రవరి 1 నుంచి మొత్తం 68 రోజులపాటు ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు వీలుపడనుంది. ఈ 68 రోజుల్లోనే సిలబస్‌, రివిజన్‌ పూర్తిచేయడానికి అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అనుమతి రాగానే రెండుమూడు రోజుల్లో తేదీలు ఖరారవుతాయని సమాచారంతెలిసింది.షిఫ్టు విధానం కాకుండా ఒక రోజు ప్రథమ సంవత్సరం, మరుసటి రోజు రెండో సంవత్సరం విద్యార్థులకు తరగతులు జరపాలని తాజాగా ప్రభుత్వం సూచించింది. ఇది అమలైతే ఒక్కో ఏడాది విద్యార్థులకు 34 రోజులు మాత్రమే తరగతి గది బోధన అందుతుంది. ఈ విధానాన్ని ప్రభుత్వ కళాశాలలకే వర్తింపజేస్తారా? ప్రైవేట్‌లోనూ అమలు చేస్తారా? అనే విషయం పై ఇంకా స్పష్టత తెలియలేదు.

అయితే సబ్జెక్టుల్లో 70 శాతం సిలబస్‌పైనే వార్షిక పరీక్షలుంటాయి. మిగిలిన 30 శాతం నుంచి అసైన్‌మెంట్లు ఇస్తారు. ఆ సిలబస్‌మీద ఒకటి రెండు పరీక్షలు జరుపుతారు. వాటికి ఇంటి వద్ద సమాధానాలు రాసి సమర్పించాలి. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాక్టికల్‌ పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లో మినహాయించేది లేదని అధికారులు తెలియజేశారు.

ప్రథమ సంవత్సరంలో తప్పిన 1.92 లక్షల మంది విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే అవకాశం లేదని, కనీస మార్కులు ఇచ్చి ఉత్తీర్ణులను చేసేదిశగా ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు తెలిసింది. ఎక్కువ మార్కులు కావాలంటే వారు మళ్లీ మే పరీక్షల్లో రాసుకునే అవకాశం ఉందని తెలిపారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close