MoviesTelugu song Lyrics
Thattukoledhey Song Lyrics in telugu | ఐతట్టుకోలేదే తట్టుకోలేదే… |
Thattukoledhey Song Lyrics in telugu: తట్టుకోలేదే తట్టుకోలేదే… అనే పాట ’ఆల్బం’ లోని పాట, దీనిని సింధూజ శ్రీనివాసన్ , విజయ్ బుల్గేనిం పాడారు, ఈ పాటకి రచయిత సురేష్ బానిసెట్టి ఈ పాటకి సంగీతాన్ని ఇచ్చింది విజయ్ బుల్గేనిం
Thattukoledhey Song Lyrics in telugu:
గానం: సింధూజ శ్రీనివాసన్ , విజయ్ బుల్గేనిం
రచయిత: సురేష్ బానిసెట్టి
సంగీతం: విజయ్ బుల్గేనిం.
నా చెయ్యే పట్టుకోవా నన్నొచ్చి చుట్టుకోవా
నాతోనే ఉండిపోవా కన్నుల్లో నిండిపోవా
గుండెల్లో పొంగిపోవా నిలువెల్లా ఇంకిపోవా
ఓ చెలీ కోపంగా చూడకే చూడకే
ఓ చెలీ దూరంగా వెళ్ళకే వెళ్ళకే
నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే
పట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమనీ
నా ప్రాణమే తప్పుకోలేదే తప్పుకోలేదే
అంతలాగా కప్పుకున్నాదే నీ ఊహానే
నాలో పండగంటే ఏమిటంటే నిన్ను చూస్తూ ఉండడం
నాలో హాయి అంటే ఏమిటంటే నీతో నడవడం
నాలో భారమంటే ఏమిటంటే నువ్వు లేకపోవడం
నాలో మరణమంటే ఏమిటంటే నిన్ను మరవడం
ఓ చందమామా చందమామా ఒక్కసారీ రావా
నా జీవితాన మాయమైన వెన్నెలంత తేవా
మనవి కాస్త ఆలకించి ముడిపడవా
నీ చూపులే అగ్గిరవ్వలై అగ్గిరవ్వలై
బగ్గుమంటు దూకుతున్నయే నా మీదకి
నా ఊపిరే అందులో పడి కాలుతున్నదే
కొద్దిగైనా కబురుపెట్టు నువ్వు మేఘానికి
నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే
పట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమనీ
నా ప్రాణమే తప్పుకోలేదే తప్పుకోలేదే
అంతలాగా కప్పుకున్నాదే నీ ఊహానే
నే నిన్ను చూడకుండ నీ నీడ తాకకుండ
రోజూల నవ్వగలనా
నీపేరు పలకకుండ కాసేపు తలవకుండ
కాలాన్ని దాటగలనా
గుండెల్లో ఏముందో కళ్ళలో చూడవా
నిన్నలా నాతోనే ఉండవా
నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే
పట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమనీ
నా ప్రాణమే తప్పుకోలేదే తప్పుకోలేదే
అంతలాగా కప్పుకున్నావే నా దారిని
వెళ్లిపోవద్దే వద్దే వద్దే
వెళ్లిపోవద్దే వద్దేవద్దే
వెళ్లిపోవద్దే వద్దేవద్దే
వెళ్లిపోవద్దే వెళ్లిపోవద్దే