Telugu News

ఆ కోతికి జీవిత ఖైదు శిక్ష

ఉత్తరప్రదేశ్ అధికారులు ఓ కోతికి జీవిత ఖైదు శిక్ష విధించారు. అది బయటకు రాకుండా జైలును తలపించే భారీ బోనులో బంధించారు. కోతికి శిక్ష ఏంటి, బంధించడం ఏంటి అని షాక్ కు గురవుతున్నారా? అయితే ఈ వింత కోతి కథ చదవండి. ఆరేళ్ల కిందట మిర్జాపూర్ జిల్లాలో కల్వా అనే కోతి జన్మించింది. దాన్ని ఓ వ్యక్తి పెంచుకున్నాడు. దానికి మద్యం అలవాటు చేశాడు. ఈ క్రమంలో ఆ కోతి మద్యానికి బానిసగా మారింది. అతను ఎప్పుడు మద్యం తెచ్చుకున్నా… పక్కనే వచ్చి కూర్చొని… తనకెప్పుడు సోడా కలిపి ఇస్తాడా అని ఎదురుచూసేది. మంచింగ్ కోసం మంచి ఆహారం కూడా అందించేవాడు.

ఈ క్రమంలో అతను అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో ఆ కోతికి ప్రేమతో మందు పోసే వారు కరువయ్యారు. ఒక్కసారిగా మద్యం లేకపోయేసరికి ఆ కోతి వింతవింతగా ప్రవర్తించడం ప్రారంభించింది. కోపంతో ఎవరు కనిపిస్తే వాళ్లపై దూకడం, దాడి చేయడం, కొరకడం మొదలుపెట్టింది. ఇలా 250 మందిని అది కరిచింది. అందులో ఒకరు చనిపోయారు. దీంతో మీర్జాపూర్ జిల్లాలో కలకలం రేగింది. స్థానికులు ఈ కోతి గురించి చెబితేనే వణికే పరిస్థితి తలెత్తింది. విషయం జూ అధికారుల వరకూ వెళ్లింది. వాళ్తను ముప్పుతిప్పులు పెట్టిన కోతి ఎట్టకేలకు దొరికింది. దీంతో అధికారులు ఆ కోతిని బంధించారు. ఆ కోతిని బోనులో నుంచి బయటికి రాకుండా అధికారులు జీవిత ఖైదు విధించారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close