News

TCS iON: గుడ్ న్యూస్… టీసీఎస్ నుంచి ఉచితంగా స్కిల్ ట్రైనింగ్

ఉద్యోగాలు కోరుకునేవారికి, పలు కెరీర్ ఆప్షన్స్ ఎంచుకునేవారికి, ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఉచితంగా స్కిల్ ట్రైనింగ్ ఇచ్చేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు చెందిన టీసీఎస్ అయాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ కెరీర్ సర్వీస్-NCS. అభ్యర్థులు ఉచితంగానే ఆన్‌లైన్‌లో ట్రైనింగ్ పొందొచ్చు. కెరీర్ స్కిల్స్ ట్రైనింగ్ పేరుతో పలు అంశాల్లో ఆన్‌లైన్ ట్రైనింగ్ అందించనుంది. ఇంగ్లీష్ లేదా హిందీ భాషలో ఈ కోర్సులు చేయొచ్చు. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా జాబ్ మార్కెట్‌లో కూడా సంక్షోభం ఏర్పడ్డ సంగతి తెలిసిందే. అయితే మంచి స్కిల్స్ ఉన్నవారికి మాత్రం డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఉద్యోగులు, ఉద్యోగాలు కోరుకునేవారు స్కిల్స్ పెంచుకోవడానికి ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుంది.

భారత కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ కెరీర్ సర్వీస్‌ జాబ్ సెర్చ్, జాబ్ మ్యాచింగ్, కెరీర్ కౌన్సెలింగ్, వొకేషనల్ గైడెన్స్ లాంటి సేవల్ని అందిస్తోంది. కోటి మందికి పైగా ఈ పోర్టల్‌లో రిజిస్టర్ అయ్యారు. వీరికి ఉద్యోగాలను ఆఫర్ చేసేందుకు 54,000 ఎంప్లాయర్స్ ఉన్నారు. ప్రస్తుతం నేషనల్ కెరీర్ సర్వీస్‌ పోర్టల్‌ ద్వారా 73 లక్షల ఖాళీల భర్తీ జరిగింది. దేశవ్యాప్తంగా 1,000 పైగా ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌ఛేంజ్‌లు, 200 మోడల్ కెరీర్ సెంటర్లు నేషనల్ కెరీర్ సర్వీస్‌‌కు అనుసంధానమయ్యాయి. కరోనా వైరస్ కారణంగా సంక్షోభం ఏర్పడటంతో నేషనల్ కెరీర్ సర్వీస్‌ ఉద్యోగులకు సేవలు అందించేందుకు చర్యలు మొదలుపెట్టింది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close