News
మానవ తప్పిదం వల్లే ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం: ఎన్జీటీకి నివేదిక
అమరావతి: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై రిటైర్డ్ జడ్జి శేషశయనా రెడ్డి కమిటీ తన నివేదికను ఎన్జీటీకి సమర్పించింది. సంస్థ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ)లో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నివేదిక రూపంలో రిటైర్డ్ జడ్జి శేషశయనా రెడ్డి కమిటీ సమర్పించారు. మానవ తప్పిదం, భద్రతా వైఫల్యం, సంస్థ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో తెలిపారు.
విచారణ కమిటీ నివేదికపై అభ్యంతరాలుంటే 24 గంటల్లో తెలపాలని ఎల్జీ పాలిమర్స్‌కు ఎన్జీటీ స్పష్టం చేసింది. నివేదిక పరిశీలించి లిఖితపూర్వక ఆదేశాలు ఇస్తామని ఎన్జీటీ అధికారుల వెల్లడించిరు. నేడో, రేపో ఎన్జీటీ తదుపరి ఆదేశాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
- తిరుపతి: నింగిలోకి దూసుకెళ్లిన PSLV C53.. విదేశీ ఉపగ్రహాలు కక్ష్యలోకి
- Super moon నేటి రాత్రికి ఆకాశంలో అద్భుతం.. స్ట్రాబెర్రీ మూన్’గా పున్నమి చంద్రుడు
- IBPS RRB Recruitment 2022 – ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ విడుదల
- ECIL Recruitment 2022 – ఈసీఐఎల్, హైదరాబాద్‌లో 40 పోస్టులు
- Indian Airforce AFCAT Recruitment 2022 – ఇండియన్ ఎయిర్స్ ఫోర్స్- ఏఫ్‌క్యాట్ 2022 నోటిఫికేషన్ విడుదల.. అవివాహిత యువతకు అవకాశం!