Telugu News

ప్రజలకు మరో టాస్క్ ఇచ్చిన ప్రధాని మోదీ.. ఈసారి ఏం చేయాలంటే..

దేశంలో కరోనావైరస్‌ వ్యాప్తి కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఎన్నో చర్యలు చేపడుతోంది. కోవిడ్-19 మహమ్మారి సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడేందుకు ప్రధాని మోదీ ఎంతో కృషిచేస్తున్నారు. అధికారులు, రాష్ట్రాల సీఎంలతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ.. విపక్షాలు సలహాలు తీసుకుంటూ.. కరోనాపై పోరాటం చేస్తున్నారు. ఐతే ఈ క్రమంలో కరోనాపై యుద్ధం చేస్తున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులను అభినందించేందుకు.. మార్చి 22న సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు మోదీ. జనాలు పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పివేసి దీపాలు, కొవ్వొత్తులు, టార్చ్‌లైట్లు వెలిగించాలని విజ్ఞప్తిచేశారు. దేశ సమైక్యతను చాటిచెప్పేందుకు మోదీ పిలుపునివ్వగా.. దాన్ని కూడా దేశ ప్రజలు విజయవంతం చేశారు.

ఐతే కరోనాను కట్టడి కోసం ఎంతో శ్రమిస్తున్న ప్రధాని మోదీకి ప్రజలంతా కృతజ్ఞత చెప్పాలంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఐదు నిమిషాల పాటు ప్రజంతా ఇంటి బాల్కనీల్లో నిలబడి ప్రధాని మోదీకి సెల్యూట్ చేయాలని కొందరు అభిమానులు పిలుపునిచ్చారు. దానికి కూడా నెటిజన్లు నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. అలాగే చేస్తామంటూ కామెంట్లు పెడుతున్నారు. ఐతే ఈ విషయం ప్రధాని మోదీ దృష్టికి వెళ్లింది. దానిపై స్పందించిన ప్రధానమంత్రి… తనను నిజంగా ప్రేమించేవారు ఒక పేద కుటుంబాన్ని దత్తత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రధాని కోసం 5 నిమిషాలు నిల‌బ‌డి సెల్యూట్ చేయాలన్న ప్ర‌చారం నా దృష్టికి వ‌చ్చింది. న‌న్ను వివాదంలోకి లాగ‌డానికి కొందరు అల్ల‌రి మూక‌లు చేసిన ప‌నిగా మొదట భావించాను. కొందరు సదుద్దేశంతో చేసినప్పటికీ వారికి ఒక్కటి చెబుతున్నా. నిజంగా నాపై మీకు అంత ప్రేమ‌, గౌర‌వం ఉన్న‌ట్లైతే నాకోసం ఈ పనిచేయండి. క‌రోనా సంక్షోభం ముగిసేవ‌ర‌కు ఒక పేద కుటుంబాన్ని ద‌త్త‌త తీసుకోవాలి. నాకు ఇంతకు మించిన గౌరవం మరొకటి ఉండదు.

— ప్రధాని మోదీ

Source: https://telugu.news18.com/

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close