General Knowledge

Telugu General Knowledge | తెలుగు జనరల్ కనౌలెడ్జి | 07/12/2019

పీఎస్‌ఎల్‌వీ-సీ47 ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ47 ప్రయోగం విజయవంతమైంది.

Current Affairs

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి 2019, నవంబర్ 27న ఈ ప్రయోగాన్ని  చేపట్టారు. కార్టోశాట్-3తో పాటు అమెరికాకు చెందిన మరో 13 నానో ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సీ47 రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. వివిధ దశల్లో 26.50 నిమిషాల వ్యవధిలో 14 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ఇది ప్రవేశపెట్టింది. నిర్దేశిత కక్ష్యలోకి ఒక్కొక్కటిగా ఉపగ్రహాలు చేరాయి. పీఎస్‌ఎల్‌వీ-సీ47 సంకేతాలను అంటార్కిటకలోని ఇస్రో కేంద్రం అందుకుంది. పీఎస్‌ఎల్‌వీ-సీ47 ప్రయోగానికి నవంబర్ 26న ఉదయం 7.28 గంటలకు మొదలైన కౌంట్‌డౌన్ ప్రక్రియ 26 గంటలపాటు సాగింది.

కార్టోశాట్-3 విశేషాలు

  • మూడోతరం హైరెజల్యూషన్ ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహం అయిన కార్టోశాట్-3 బరువు 1,625 కిలోలు.
  • జీవిత కాలం ఐదేళ్లు.
  • పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది.
  • కార్టోశాట్-3 దేశంలోకి చొరబడే ఉగ్రవాదులను పసిగట్టడంతోపాటు వారి కదలికలు, స్థావరాలపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారమందిస్తూ నిఘా నేత్రంలా పనిచేయనుంది.
  • సైనిక అవసరాలకే కాకుండా ప్రకృతి విపత్తుల సమయాల్లోనూ ఈ ఉపగ్రహం సేవలందించనుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రణాళికలు, తీరప్రాంత నిర్వహణ, రహదారుల నెట్‌వర్క్ పరిశీలన, నీటి సరఫరాపై అధ్యయనానికి దీన్ని వినియోగించుకోవచ్చు.
  • కార్టోశాట్-3లోని కెమెరాకు 0.25 మీటర్ల కంటే మెరుగైన రిజల్యూషన్ చిత్రాల్ని తీసే సామర్థ్యముంది.
  • ఈ ఉపగ్రహ తయారీకి ఇస్రో రూ.350 కోట్లకు పైగా ఖర్చు చేసింది.
  • చంద్రయాన్-2 తర్వాత ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇదే.
  • పీఎస్‌ఎల్‌వీ సీరీస్ లో ఇది 49వ ప్రయోగం కాగా.. షార్ నుంచి 74వ రాకెట్ ప్రయోగం.
  • పీఎస్‌ఎల్వీ సీ-47 ను ఎక్స్‌ఎల్(XL) తరహాలో రూపొందించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 పీఎస్‌ఎల్‌వీ-సీ47 ప్రయోగం విజయవంతం
ఎప్పుడు : 2019, నవంబర్ 27
ఎవరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)
ఎక్కడ : సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : సైనిక అవసరాల కోసం

సౌర కుటుంబం అంచులు దాటిన వాయేజర్-2

అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన వాయేజర్-2 అంతరిక్ష నౌక సౌర కుటుంబం అంచులు దాటి వెళ్లింది.

Current Affairs

సూర్యుడి ప్రభావం లేని, నక్షత్ర మండలంలోకి (ఇంటర్‌స్టెల్లార్ స్పేస్ మీడియం-ఐఎస్‌ఎంకు) 2018 నవంబర్ 5వ తేదీన చేరుకుంది. ఈ విషయాలను నాసా 2019, నవంబర్ 6న వెల్లడించింది. దీంతో ఆ ఘనతను సాధించిన రెండో వ్యోమనౌకగా వాయేజర్-2 నిలిచింది. అంతకుముందు నాసాకి చెందిన వాయేజర్-1 2012లో సౌర కుటుంబాన్ని దాటి వెళ్లింది.

వాయేజర్-2 విశేషాలు

  • అంతరిక్షంలో ప్రయాణించిన కాలం : 41 ఏళ్లు
  • వేగం /గంటకు మైళ్లలో : 34,191
  • సూర్యుడి నుంచి వాయేజర్ -2 ఉన్న దూరం : 1,770 కోట్ల కిలోమీటర్లు…
  • ప్రయాణించిన మొత్తం దూరం : 3,000 కోట్ల కిలోమీటర్లు
  • సందర్శించిన గ్రహాల సంఖ్య : 4 (గురు, శని, వరుణ, నెప్ట్యూన్)
  • సూర్య కిరణాలు వాయేజర్‌ను చేరేందుకు పట్టే సమయం : 16 గంటల 36 నిమిషాలు
  • వాయేజర్-2 నుంచి భూమికి సమాచారం అందడానికి పడుతున్న సమయం : 19 గంటలు
  • గ్రహాంతర వాసుల కోసం ఒక సందేశాన్ని ముద్రించిన బంగారు ఫలకం వాయేజర్-2 ఉంది. ఈ ఫలకంపై 14 ప్రత్యేక నక్షత్రాల సాయంతో సూర్యుడిని ఎక్కడ గుర్తించవచ్చు?, హైడ్రోజన్ పరమాణవు చిత్రంతోపాటు మరికొన్ని సంకేతాలు ఉన్నాయి.
  • 1977లో కొన్ని వారాల వ్యవధిలో నాసా వాయేజర్-1, వాయేజర్-2లను ప్రయోగించింది. రెండు అంతరిక్ష నౌకలూ సూర్యుడి ప్రభావం నుంచి దాదాపు ఒకే దూరం తరువాత బయటపడ్డాయి. దీన్ని బట్టి సౌరకుటుంబం ఆకారం గోళాకారంగానే ఉంటుందని అర్థమైందని ఐయోవా యూనివర్సిటీ శాస్త్రవేత్త బిల్‌కుర్త్ తెలిపారు.

అంతరిక్ష పరిశోధన కేంద్రాలు- ముఖ్య ప్రదేశాలు

Current Affairs
1. డెహ్రాడూన్ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్
2. షాద్‌నగర్ (హైదరాబాద్)నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ
3. గాందంకి (తిరుపతి)నేషనల్ మెసోస్పియర్/ స్ట్రాటోస్పియర్/టోపోస్పియర్ రాడార్ ఫెసిలిటీ
4. తిరువనంతపురం (కేరళ)విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్
5. హసన్ (కర్ణాటక)ఇన్‌శాట్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ
6. అహ్మదాబాద్ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ
7. ఉదయ్‌పూర్సోలార్ అబ్జర్వేటరీ
8. బాలాసోర్ (ఒడాశా)అంతరిక్ష ప్రయోగ కేంద్రం
9. బెంగళూర్ఇండియన్ సైంటిఫిక్ శాటిలైట్ ప్రాజెక్ట్
10. బెంగళూర్ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
11. అహ్మదాబాద్ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ
12. తిరువనంతపురంప్రొపెల్లింగ్ ప్యూయల్ కాంప్లెక్స్
13. తిరువనంతపురంశాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రాజెక్ట్
14. అహ్మదాబాద్స్పేస్ అప్లికేషన్ సెంటర్
15. బెంగళూర్స్పేస్ కమిషన్
16. శ్రీహరికోట (ఆంధ్రప్రదేశ్)సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం
17. తుంబా (తిరువనంతపురం)తుంబా ఈక్వెటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్
18. హైదరాబాద్న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్
19. తిరుపతి (ఆంధ్రప్రదేశ్)నేషనల్ అట్మాస్పెరిక్ రీసెర్చ్ లాబొరేటరీ
20. చండీగఢ్సెమీ- కండక్టర్ లాబొరేటరీ
21. న్యూ ఢిల్లీడాస్ బ్రాంచ్ సెక్రటేరియట్
22. న్యూ ఢిల్లీఇస్రో బ్రాంచ్ ఆఫీస్
23. న్యూ ఢిల్లీఢిల్లీ ఎర్త్ సెక్షన్
24. బెంగళూర్డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ అండ్ ఇస్రో హెడ్‌క్వార్టర్స్
25. బెంగళూర్ఇన్‌శాట్ ప్రోగ్రామ్ ఆఫీస్
26. బెంగళూర్ఎన్‌ఎన్‌ఆర్‌ఎమ్‌ఎస్ సెక్రటేరియట్
27. బెంగళూర్సివిల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఆఫీస్
28. బెంగళూర్ఏన్‌ట్రిక్స్ కార్పొరేషన్
29. బెంగళూర్ఇస్రో శాటిలైట్ సెంటర్ (ఐఎస్‌ఏసీ)
30. బెంగళూర్లాబొరేటరీ ఫర్ ఎలక్ట్రో- ఆప్టికల్ సిస్టమ్స్
31. బెంగళూర్ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్
32. బెంగళూర్లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్
33. పోర్ట్‌బ్లెయర్డౌన్ రేంజ్ స్టేషన్
34. అహ్మదాబాద్డెవలప్‌మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ కమ్యుమనికేషన్ యూనిట్
35. అలువ (కేరళ)అమ్మోనియం పెర్‌క్టోరేట్ ఎక్స్‌పరిమెంటల్ ప్లాంట్
36. తిరువనంతపురంలిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్
37. తిరువనంతపురంఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నోలజీ
38. భోపాల్మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ- బి
39. నాగ్‌పూర్సెంట్రల్ ఆర్‌ఆర్‌ఎస్‌సీ
40. షిల్లాంగ్నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్
41. హైదరాబాద్నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్
42. లక్నోఇస్‌ట్రాక్ గౌండ్ స్టేషన్
43. డెహ్రాడూన్సెంటర్ ఫర్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ
ఎడ్యుకేషన్ ఇన్ ఏషియా- పసిఫిక్
44. మహేంద్రగిరిలిక్విడ్ ప్రొపల్షన్ టెస్ట్ ఫెసిలిటీస్

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close