General Knowledge

Telugu General Knowledge | తెలుగు జనరల్ కనౌలెడ్జి | 22/12/2019 | సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీచేసే రిట్లు

» హెబియస్ కార్పస్: ఈ రిట్ ప్రకారం నిర్బంధించిన వ్యక్తిని 24 గంటల్లో కోర్టుకు హాజరుపరచాలి. 
» మాండమస్: ‘మేము ఆజ్ఞాపిస్తున్నాం’ అని దీని అర్థం. ఏ అధికారి అయినా ప్రజాసంబంధ, చట్టబద్ధమైన బాధ్యతలను నిర్వర్తించడానికి నిరాకరించినప్పుడు వాటిని నిర్వర్తించమని కోర్టులు జారీ చేసే రిట్.సుప్రీంకోర్టు
» ప్రొహిబిషన్: దిగువ కోర్టు తన అధికార పరిధిలో లేని విషయాన్ని గురించి విచారిస్తున్నప్పుడు దాన్ని నిలిపివేయమని ఈ రిట్‌ను జారీ చేస్తారు.
» సెర్షియోరరి: కింది కోర్టులు లేదా ట్రైబ్యునళ్లు తమ అధికార పరిధిలో ఉండేలా చూడటం ఈ రిట్ ఉద్దేశం. కింది కోర్టులు లేదా ట్రైబ్యునళ్లు వెలువరించిన ఉత్తర్వులను రద్దు చేయడానికి ఈ రిట్‌ను జారీ చేస్తారు.
» కోవారంటో: ‘ఏ అధికారంతో’ అని దీని అర్థం. ఏ అధికారంతో పదవిలో కొనసాగుతున్నారో ఆధారాలు చూపమని కోర్టులు జారీ చేసే రిట్.
* రిట్ అంటే ‘ఆజ్ఞ’ అని అర్థం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close