General Knowledge
Telugu General Knowledge | తెలుగు జనరల్ కనౌలెడ్జి | 18/12/2019 | లోక్‌సభ, రాజ్యసభ
లోక్‌సభ |
» 1954లో లోక్‌సభ స్పీకర్ జి.వి.మౌలాంకర్ హౌస్ ఆఫ్ పీపుల్‌కు ‘లోక్‌సభ’ అని నామకరణం చేశారు. |
» దీన్ని ప్రజాప్రతినిధుల సభ, ప్రజల సభ, దిగువ సభ అని కూడా వ్యవహరిస్తారు. |
» ఇది తాత్కాలిక సభ. |
» లోక్‌సభలో మొత్తం గరిష్ఠ సభ్యుల సంఖ్య 552. (రాష్ట్రాల నుంచి 530 స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 20 స్థానాలు, ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు) |
» ప్రస్తుతం లోక్‌సభలో మొత్తం సభ్యులు 545. (530 మంది సభ్యులు రాష్ట్రాల నుంచి, 13 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఉంటే ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు ఉన్నారు) |
» ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. |
» లోక్‌సభకు పోటీ చేయడానికి ఉండాల్సిన కనీస వయసు 25 సంవత్సరాలు. |
» లోక్‌సభ సభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాలు. |
» లోక్‌సభలో ఒక పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలంటే 10% స్థానాలు కైవసం చేసుకోవాలి. |
» లోక్‌సభలో తొలి ప్రతిపక్ష నాయకుడు వై.బి.చవాన్. |
» లోక్‌సభ సభ్యులను వయోజన ఓటుహక్కుతో ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. |
» లోక్‌సభ రెండు సమావేశాల మధ్య కాల వ్యవధి 6 నెలలకు మించకూడదు. |
» 5వ లోక్‌సభ 6 సంవత్సరాలు పనిచేసింది. |
» అవిశ్వాస తీర్మానం ద్వారా మంత్రిమండలిని తొలగించే అధికారం లోక్‌సభకు ఉంది. |
రాజ్యసభ |
» రాజ్యసభను రాష్ట్రాల మండలి అంటారు. |
» 1954లో రాజ్యసభగా నామకరణం చేశారు. |
» రాజ్యసభను పెద్దల సభ, ఎగువ సభ, మేధావుల సభగా వ్యవహరిస్తారు. |
» ఇది శాశ్వత సభ. |
» సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. |
» ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3వ వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. వారి స్థానంలో కొత్తవారు ఎన్నికవుతారు. |
» రాజ్యసభలో గరిష్ఠ సభ్యుల సంఖ్య 250. |
» వీరిలో 238 మంది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికవుతారు. |
» సాహిత్యం, శాస్త్రం, కళలు, సామాజిక సేవల్లో ప్రసిద్ధులైన 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. |
» ప్రస్తుత రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245. |
» వీరిలో 233 మంది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికవుతారు. |
» రాజ్యసభలో అధిక స్థానాలు కలిగి ఉన్న రాష్ట్రాలు వరుసగా ఉత్తర్‌ప్రదేశ్ (31), మహారాష్ట్ర (19) తమిళనాడు (18). |
» తెలంగాణకు 7 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. |
» ఆంధ్రప్రదేశ్‌కు 11 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. |
» కేంద్రపాలిత ప్రాంతాల్లో దిల్లీకి 3 స్థానాలు, పాండిచ్చేరికి ఒక స్థానం ఉన్నాయి. మిగిలిన ప్రాంతాలకు రాజ్యసభ స్థానాలు లేవు. |
» రాజ్యసభలో తొలి ప్రతిపక్ష నాయకుడు కమలాభాయ్ త్రిపాఠి. |
» రాజ్యసభ సభ్యురాలిగా చేసిన తొలి నటి జయప్రద. |
» రాజ్యసభకు పోటీ చేయడానికి ఉండాల్సిన కనీస వయసు 30 సంవత్సరాలు. |
» రాజ్యసభ సభ్యులను ఆయా రాష్ట్రాల శాసనసభ్యులు పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. |
» అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేసే అధికారం కేవలం రాజ్యసభకు మాత్రమే ఉంది. |
» ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని కేవలం రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. |
» రాజ్యసభకు ఉపరాష్ట్రపతి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. |
» రాజ్యసభ ఆర్థిక బిల్లును 14 రోజుల వరకు నిలుపుదల చేయవచ్చు. |
మరిన్ని విషయాలు… |
» ద్రవ్య సంబంధమైన బిల్లులను లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. |
» ఆర్థిక బిల్లులను తిరస్కరించే అధికారం రాజ్యసభకు లేదు. 14 రోజుల లోపు రాజ్యసభకు పంపాలి. |
» ప్రస్తుత లోక్‌సభ 16వది. |
» లోక్‌సభలో అత్యధిక స్థానాలు ఉన్న రాష్ట్రాలు వరుసగా ఉత్తర్‌ప్రదేశ్ (80), మహారాష్ట్ర (48), పశ్చిమ్‌బంగ (42). |
» అతి ఎక్కువ మంది మహిళలు ఎన్నికైన లోక్‌సభ 16వది. |
» 16వ లోక్‌సభలో మహిళల సంఖ్య 62. |
» 16వ లోక్‌సభ తర్వాత అతి ఎక్కువ మంది మహిళలు ఎన్నికైన సభ 15వది. |
» 15వ లోక్‌సభలో మహిళల సంఖ్య 59. |
» ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఎక్కువమంది మహిళా ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. |
» ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు మహిళా ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. (కె.గీత, బి.రేణుక) |
» తెలంగాణ రాష్ట్రం నుంచి ఒకే ఒక్క మహిళా ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.(కె.కవిత) |
» కేంద్రపాలిత ప్రాంతాల్లో దిల్లీ అత్యధిక లోక్‌సభ స్థానాలను కలిగి ఉంది. |
» మిగిలిన 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఒక్కో లోక్‌సభ స్థానాన్ని మాత్రమే కలిగి ఉన్నాయి. |
» ఒక్కో లోక్‌సభ స్థానం మాత్రమే కలిగి ఉన్న రాష్ట్రాలు నాగాలాండ్, సిక్కిం, మిజోరాం. |