General Knowledge

Telugu General Knowledge | తెలుగు జనరల్ కనౌలెడ్జి | 17/12/2019 | పంచాయతీ వ్యవస్థ

పంచాయతీ వ్యవస్థను మొదటిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం రాజస్థాన్ (అక్టోబర్ 2, 1959).
» పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ (నవంబర్ 1, 1959).
» మూడంచెల పంచాయతీ వ్యవస్థను సూచించిన కమిటీ బల్వంతరాయ్ మెహతా కమిటీ (1957).
» రెండంచెల పంచాయతీ వ్యవస్థను సూచించిన కమిటీ అశోక్ మెహతా కమిటీ (1977).
» పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి సూచించిన కమిటీ ఎం.ఎం.సింఘ్వి కమిటీ (1986).
» 73వ రాజ్యాంగ సవరణ పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించింది.
» పంచాయతీ నిర్మాణం రాజ్యాంగంలోని 9వ భాగంలో ప్రకరణ 243 (ఎ) నుంచి 243 (ఒ) వరకు ఉంది.
» 11వ షెడ్యూల్‌లో పంచాయతీలకు 29 విధులను కేటాయించారు.
»ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం (1994) 3 అంచెల వ్యవస్థను సూచించింది.
(1) మొదటి అంచె – గ్రామ పంచాయతీ
(2) రెండో అంచె – మండల పరిషత్
(3) మూడో అంచె – జిల్లా పరిషత్
» గ్రామ పంచాయతీకి రాజకీయ అధిపతి సర్పంచ్.
» సర్పంచ్ పంచాయతీ సమావేశాలకు (గ్రామసభ) అధ్యక్షత వహిస్తాడు.
» గ్రామ పంచాయతీకి ప్రభుత్వ అధికారి కార్యదర్శి.
» సర్పంచ్ పదవీ కాలం 5 సంవత్సరాలు.
» సర్పంచ్‌గా పోటీ చేయడానికి కావాల్సిన కనీస వయసు 21 సంవత్సరాలు.
» సర్పంచ్‌కు ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తుంది.
» మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌కు రూ.1000 గౌరవ వేతనం ఇస్తారు.
(ప్రభుత్వం రూ. 500 చెల్లిస్తుంది. గ్రామపంచాయతీ జనరల్ ఫండ్ నుంచి రూ.500 చెల్లిస్తారు)
» మైనర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌కు రూ.600 గౌరవ వేతం ఇస్తారు.
(ప్రభుత్వం రూ. 300 ఇస్తుంది. గ్రామపంచాయతీ జనరల్ ఫండ్ నుంచి రూ.300 చెల్లిస్తారు)
» సర్పంచ్ లేని సమయంలో ఉపసర్పంచ్ బాధ్యతలను నిర్వర్తిస్తారు.
» క్రమానుసారంగా పంచాయతీ ఖాతాలను ఆడిట్ చేయించని సర్పంచ్, ఉప సర్పంచ్ తమ పదవులను కోల్పోతారు.
» ఎన్నికలకు సంబంధించిన వివాదాల్లో ఒక వ్యక్తికి శిక్ష పడితే, పంచాయతీరాజ్ చట్టంలోని 233వ సెక్షన్ ప్రకారం… శిక్ష పడిన రోజు నుంచి 6 సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేయకూడదు.
» సర్పంచ్ తన రాజీనామాను గ్రామపంచాయతీకి పంపాలి.
» అన్ని రాష్ట్రాల్లోనూ పంచాయతీ సభ్యులను ప్రత్యక్ష పద్ధతి ద్వారానే ఎన్నుకుంటారు.
» వార్డు సభ్యులకు ఎలాంటి వేతనాలు చెల్లించరు.
» సమావేశాలు నిర్వహించినప్పుడు వార్డు సభ్యులకు రూ.75 చెల్లిస్తారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close