General Knowledge

Telugu General Knowledge | తెలుగు జనరల్ కనౌలెడ్జి | 15/12/2019

పులుల గణన నివేదిక విడుదల

దేశవ్యాప్తంగా ఉన్న పులుల గణన నివేదిక ‘అఖిల భారత పులుల సంఖ్య అంచనా-2018’ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ పులుల దినోత్సవమైన జూలై 29న విడుదల చేశారు.

Current Affairs

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ), జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్‌టీసీఏ) కలిసి సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి.

నివేదిక ప్రకారం పులుల సంఖ్య సంవత్సరాల వారీగా…

2006201020142018
1,4111,7062,2262,967

పులులు అధికంగా ఉన్న రాష్ట్రాలు

1. మధ్యప్రదేశ్526
2. కర్ణాటక524
3. ఉత్తరాఖండ్442
4. మహారాష్ట్ర312
5. తమిళనాడు264

పులుల గణన నివేదికలోని అంశాలు…

  • దేశంలోనే అత్యధిక సంఖ్యలో పులులు మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి. ఆ రాష్ట్రంలో 2014లో 308గా ఉన్న పులుల సంఖ్య 2018కి ఏకంగా 526కి పెరిగింది.
  • మహారాష్ట్రలోనూ 2014లో 190 పులులు ఉండగా, 2018లో 312 ఉన్నాయి.
  • 2014 నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 68 పులులు ఉన్నాయి.
  •  2018 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 48 పులులు ఉన్నాయి.
  • తెలంగాణలో ఆమ్రాబాద్, కవ్వాల్‌ల్లో పులుల సంరక్షణ కేంద్రాలుండగా, ఈ రెండింటిలో కలిపి 2014లో 20 పులులు ఉండేవి. 2018 నాటికి ఆ సంఖ్య 26కు పెరిగింది.
  • పులుల సంఖ్య దేశవ్యాప్తంగా పెరిగినప్పటికీ ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం తగ్గింది. ఛత్తీస్‌గఢ్‌లో 2014లో 46 పులులు ఉండగా, 2018కి వాటి సంఖ్య 19కి పడిపోయింది.
  • 2014లో దేశంలో సంరక్షణ ప్రాంతాలు 692 ఉండగా, ప్రస్తుతం 860కి పెరిగింది.
  • ఎం-స్ట్రైప్స్ అనే మొబైల్ యాప్ సాయంతో పులుల సంఖ్యను లెక్కించడం జరిగింది.
  • పులి పిల్లలను లెక్కలోకి తీసుకోకుండా కేవలం ఎదిగిన పులులను మాత్రమే లెక్కించడం జరిగింది.

సర్వే సాగిందిలా…
సర్వే చేసిన అటవీ విస్తీర్ణం – 3,81,400 చదరపు కిలో మీటర్లు.
ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌లు – 27,000
తీసిన ఫొటోలు – 3.48 కోట్లు
పులులు కనిపించిన ఫొటోలు – 77,000
పులుల జాడలను గుర్తించేందుకు సిబ్బంది నడిచిన దూరం – 5,22,996 కిలో మీటర్లు
సమాచారం సేకరించిన అటవీ డివిజన్లు – 491
పులుల గణనలో పాల్గొన్న సిబ్బంది సంఖ్య – 44,000

నాలుగేళ్ల ముందే రెట్టింపు చేశాం
పులులు గణన నివేదిక విడుదల సందర్భంగా మోదీ మాట్లాడుతూ ‘పులుల సంఖ్యను పెంచడంపై 9 ఏళ్ల క్రితం రష్యాలోని సెయింట్‌పీటర్స్‌బర్గ్‌లో అంతర్జాతీయ స్థాయి సమావేశం జరిగింది. 2022 నాటికల్లా పులుల సంఖ్యను రెట్టింపు చేయాలని ఆ సమావేశంలో పాల్గొన్న దేశాలన్నీ లక్ష్యంగా పెట్టుకున్నాయి. గడువు పూర్తవ్వడానికి నాలుగేళ్ల ముందే భారత్‌లో పులుల సంఖ్యను మనం రెట్టింపు చేశాం. సంకల్పంతో మనం దేన్నయినా సాధించవచ్చు అనడానికి ఇదే ఉదాహరణ’ అని వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close