General Knowledge

Telugu General Knowledge | తెలుగు జనరల్ కనౌలెడ్జి | 09/12/2019

జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి దేని సూచనల మేరకు ఏర్పడింది?

  • జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి దేని సూచనల మేరకు ఏర్పడింది?
    – 11వ ఆర్థిక సంఘం
  • ఇండియాలో విపత్తు కార్యనిర్వహణ చట్టం రూపొందించిన సంవత్సరం?
    – 2005, మే 30
  • మొదటి విపత్తు నిర్వహణ కాంగ్రెస్‌ జరిగిన తేదీ?
    – నవంబర్‌ 29, 2006.
  • నేషనల్‌ సివిల్‌ డిఫెన్స్‌ కాలేజ్‌ ఎక్కడ ఉంది?
    – నాగ్‌పూర్‌
  • ‘సిదర్‌’ అనే తుపాన్‌ ఏ దేశాన్ని తాకింది?
    – బంగ్లాదేశ్‌
  • భారతదేశ మొత్తం భూభాగంలో వరదలు సంభవించే అవకాశం ఉన్న భూమి శాతం?
    – 12%
  • అమెచ్యూర్‌ రేడియోకి మరో పేరు?
    – హామ్‌ రేడియో
  • అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం ఎక్కడ ఉంది?
    – హోనోలులు
  • ‘సునామీ’ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?
    – జపాన్‌ భాష
  • ఏ మంత్రిత్వ శాఖ విపత్తు కార్యకలాపాలను నిర్వహిస్తుంది?
    – హోం మంత్రిత్వ శాఖ
  • నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఎక్కడ ఉంది?
    – న్యూఢిల్లీ
  • 1945, ఆగస్టు 9న ఫ్యాట్‌మాన్‌ అనే అణ్వాయుధాన్ని ఏ నగరం మీద ప్రయోగించారు?
    – నాగసాకి
  • W.H.O నివేదిక ప్రకారం ఏ వాయువు అధికంగా వాతావరణ కాలుష్యానికి కారణమవుతోంది?
    – కార్బన్‌ మోనాక్సైడ్‌
  • భారతదేశంలో అతి పెద్ద గని విపత్తు జరిగిన సంవత్సరం?
    –1975, డిసెంబర్‌ 27
  • 2013, ఫిబ్రవరి 21న ఏ నగరంలో జంట బాంబు పేలుళ్లు జరిగాయి?
    –హైదరాబాద్‌
  • భారత పార్లమెంట్‌పై తీవ్రవాద దాడి జరిగిన సంవత్సరం?
    – 2001, డిసెంబర్‌ 13
  • తమిళనాడులోని కుంభకోణం పాఠశాలలో విద్యార్థుల మరణానికి కారణమైన విపత్తు?
    – అగ్ని ప్రమాదం
  • రోడ్డు ప్రమాదాల్లో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?
    – మహారాష్ట్ర
  • భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన వల్ల విడుదలైన విష వాయువు?
    – మిథైల్‌ ఐసోసైనైడ్‌
  • చెర్నోబిల్‌ దుర్ఘటన జరిగిన దేశం?
    – ఉక్రెయిన్‌
  • 2014, జూలై 30న కొండచరియలు విరిగిపడి శిథిలమైన గ్రామం?
    –మాలిన్, మహారాష్ట్ర
  • భూపాతాల విపత్తులకు సంబంధించి నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించే మంత్రిత్వ శాఖ?
    – గనుల మంత్రిత్వ శాఖ
  • విపత్తుల వల్ల భారతదేశ స్థూల జాతీయోత్పత్తికి ఎంత శాతం మేర నష్టం వాటిల్లుతోంది?
    – 2%
  • ‘కరువు యాజమాన్యం కాదు.. కావాల్సింది –రుతుపవన యాజమాన్యం’ అని అన్నదెవరు?
    – ఎం.ఎస్‌. స్వామినాథన్‌
  • అంతర్జాతీయ జల వనరుల దశాబ్దం?
    – 2005–2015
  • ఎడారి ప్రాంత అభివృద్ధి పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
    –1977–78
  • తీవ్ర కరువు అంటే?
    – సాధారణ వర్షపాతం 50% కంటే తక్కువ ఉండడం
  • అత్యధిక తీవ్రమైన కరువుగా పేర్కొనదగినది?
    – జల సంబంధ కరువు
  • 2009, అక్టోబర్‌లో ఏ నదికి ఆకస్మిక వరదలు వచ్చాయి?
    – కృష్ణానది
  • 2015లో తుపాన్, వరదల వల్ల చెన్నై నగరంలో ఎంతమంది మరణించారు?
    – 347
  • సెంట్రల్‌ ఫ్లడ్‌ కంట్రోల్‌ బోర్డ్‌ సిఫార్సులతో వరద ప్రాంతాల్లో అవాసాలను నిషేధిస్తూ చట్టం చేసిన రాష్ట్రం?
    – మణిపూర్‌
  • నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ ఎక్కడ ఉంది?
    – చెన్నై
  • జాతీయ జల వనరుల సంఘాన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం?
    – 1962
  • ఇండియన్‌ మెటీరియోలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌ (IMD) ఎక్కడ ఉంది?
    – న్యూఢిల్లీ
  • ఒడిశా దుఖఃదాయిని అని దేన్ని పిలుస్తారు?
    – బ్రాహ్మణి నది
  • జాతీయ చక్రవాత ముప్పు నియంత్రణ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన రాష్ట్రాలు?
    – ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌
  • 2014, అక్టోబర్‌లో రూ.10,000 కోట్ల నష్టాన్ని కలిగించిన తుపాన్‌?
    –హుద్‌–హుద్‌
  • లైలా తుపాన్‌ సంభవించిన సంవత్సరం?
    – 2010, మే 20
  • తుపాన్లను ఇండోనేషియాలో ఏమంటారు?
    – భగ్నాస్‌
  • ప్రపంచంలో అతి పెద్ద తుపానుగా ప్రసిద్ధి చెందింది?
    – ‘టిప్‌’ అనే చక్రవాతం
  • విపత్తుల అత్యవసర ఎఫ్‌.ఎం. రేడియోను ప్రారంభించిన రాష్ట్రం?
    –తమిళనాడు
  • చరిత్రలో సుదీర్ఘ కాలం (31 రోజులు) చక్రవాతం సంభవించిన తుపాన్‌?
    – టైపూన్‌ జాన్‌
  • తొలిసారి సైక్లోన్‌ అనే పదాన్ని ఉపయోగించింది?
    – హెన్రీ పెడింగ్‌టన్‌
  • 2016, ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 1 వరకు డిజాస్టర్‌ రిస్క్‌ కాన్ఫరెన్స్‌ను ఏ నగరంలో నిర్వహించారు?
    – దావోస్‌
  • భారతదేశంలో తొలిసారి ఏ ప్రాంతంలో సునామీ సంభవించింది?
    – కచ్‌ ప్రాంతం, 326 ఆ.ఇ
  • ఏ సముద్రంలో 2004, డిసెంబర్‌లో సునామీ వచ్చింది?
    – హిందూ మహాసముద్రం
  • ప్రపంచంలో గులకరాళ్ల సునామీగా ప్రసిద్ధి చెందింది?
    – లిటుయాబే – అలస్కా
  • సునామీలు ఎక్కువగా (25.4% మేర) ఏ ప్రాంతం వద్ద వస్తాయి
    – ఓషియానియా ప్రాంతం
  • పసిఫిక్‌ సునామీ మ్యూజియం ఎక్కడ ఉంది?
    – హిలో ప్రాంతం, హవాయి దీవులు
  • సునామీలను గుర్తించే ప్రాంతీయ సునామీ ఏజెన్సీ (INCOIS ఎక్కడ ఉంది?
    – హైదరాబాద్‌
  • నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ అంటార్కిటికా అండ్‌ ఓషియానిక్‌ రీసెర్చ్‌ అనే సునామీ సంస్థ ఎక్కడ ఉంది?
    – గోవా, డోనాపౌలా
  • సునామీలు తీర ప్రాంతంలో గరిష్ట ఎత్తుకు చేరుకోవడాన్ని ఏమంటారు?
    –రన్‌ అప్‌
  • తొలిసారి ఏ చరిత్రకారుడు భూకంపాల వల్లే సునామీలు సంభవిస్తాయని గుర్తించాడు?
    – థుసిడైట్స్‌
  • సునామీలు ఎక్కువగా ఏ సముద్రంలో వస్తాయి?
    – పసిఫిక్‌
  • తెలంగాణలో అతిపెద్ద భూకంపం?
    – భద్రాచలం భూకంపం, 1969
  • జాతీయ భూ భౌతిక సంస్థ ఎక్కడ ఉంది?
    – హైదరాబాద్‌
  • ప్రపంచంలో రిక్టర్‌ స్కేలుపై నమోదైన పెద్ద భూకంపం?
    – చిలీ భూకంపం, 1960
  • స్థితిస్థాపక నిరోధక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది?
    – ఎఫ్‌.హెచ్‌. రీడ్‌
  • మెర్కిలీ స్కేల్‌లో అంకెల్ని ఏ భాషలో గుర్తించారు?
    – రోమన్‌ భాష
  • రిక్టర్‌ స్కేలును రూపొందించింది?
    – చార్లెస్‌ రిక్టర్, 1935
  • సార్క్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ ఎక్కడ ఉంది?
    – న్యూఢిల్లీ
  • ఏ యూనివర్సిటీ విపత్తు నిర్వహణ సర్టిఫికేట్‌ కోర్సును ప్రవేశపెట్టింది?
    –ఇగ్నో
  • సూపర్‌ సైక్లోన్‌ ఏ రాష్ట్రంలో సంభవించింది?
    –ఒడిశా
  • దేశంలోని విపత్తు ప్రతిస్పందన దళాల సంఖ్య?
    – 12
  • అంతర్జాతీయ విపత్తుల కుదింపు దినోత్సవం?
    – అక్టోబర్‌ 13
  • ప్రపంచంలో విపత్తు ముప్పు తీవ్రంగా గల నగరాలు?
    – టోక్యో, మనీలా
  • 1980–2010 మధ్య కాలంలో విపత్తుల వల్ల భారతదేశంలో సంభవించిన మరణాలు?
    – 1,43,039
  • విపత్తులను 5 గ్రూపులుగా విభజించిన కమిటీ?
    – జె.సి.పంత్‌ కమిటీ
  • ఏ భాషా పదం Disaster అనే ఇంగ్లిష్‌ పదానికి మూలం?
    – (Disastre ఫ్రెంచి పదం)
  • జాతీయ విపత్తుల తగ్గింపు దినోత్సవం?
    – అక్టోబర్‌ 29
  • ఏ సంవత్సరంలో పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని తీసుకొచ్చారు?
    – 1986
  • దేశంలో అత్యధిక శబ్ద కాలుష్యం గల నగరాలు?
    – ముంబై, ఢిల్లీ
  • ప్రపంచంలో మొదటి విపత్తు నమోదైన ప్రాంతం?
    – ఏథెన్స్‌
  • జల వనరుల నిర్వహణకు రాజస్థాన్‌ ప్రారంభించిన పథకం?
    – జలతరంగ్‌
  • సముద్ర గర్భంలో సంభవించే భూకంపాన్ని ఏమంటారు?
    – సునామీ
  • ఇండియాలో తీరం వెంట టైడ్‌ గేజ్‌ నెట్‌వర్క్‌ నిర్వహించే సంస్థ?
    – సర్వే ఆఫ్‌ ఇండియా
  • సునామీల వేగం గంటకు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది?
    – 800–1000 కి.మీ.
  • సునామీలను విపత్తుల జాబితాలో చేర్చిన సంవత్సరం?
    – 2004
  • భుజ్‌ భూకంపం ఏ రాష్ట్రంలో సంభవించింది?
    – గుజరాత్‌
  • హిమాలయాల ప్రాంతంలో భూకంపాలను అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసింది?
    – రూర్కీ యూనివర్సిటీ
  • భుజ్‌ భూకంపానికి కారణం?
    – విరూపకారక బలాలు
  • దక్షిణ అమెరికాలో తుపాన్లను ఏమంటారు?
    – టోర్నడోలు
  • చక్రవాతాలు సాధారణంగా ఏయే అక్షాంశాల మధ్య సంభవిస్తాయి?
    – 5ని 20ని
  • ‘నిషా’ తుపాన్‌ సంభవించిన సంవత్సరం?
    – 2008
  • బ్రహ్మపుత్ర నది వల్ల వరదలకు గురయ్యే రాష్ట్రం?
    – అసోం
  • రోజుకు ఎంత నీటిని వినియోగించే వారిని నీటి విలన్‌ అంటారు?
    – 600 లీటర్లకు పైగా
  • బాబా అటామిక్‌ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?
    – ముంబై
  • రిస్క్‌ మ్యాపింగ్‌ దేన్ని సూచిస్తుంది?
    – నీటితో కప్పి ఉండే ప్రాంతాల వివరాలను
  • అపద్భంధు పథకం మొదలైన సంవత్సరం?
    – 1998
  • 2004 సునామీ వల్ల భారతదేశంలోని ఏయే ప్రాంతాల్లో టైడ్‌ గేజ్‌ పరికరాలు దెబ్బతిన్నాయి?
    – చెన్నై, నాగపట్నం, ట్యుటికోరిన్‌
  • సగటున ఒక చక్రవాతం జీవిత కాలం?
    – 6 రోజులు
  • దేశంలో వరదల వల్ల ఏ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది?
    –ఉత్తరప్రదేశ్‌
  • ఏ ప్రణాళిక కాలంలో ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించారు?
    – 11వ ప్రణాళిక
  • చార్‌ధామ్‌ వరదల వల్ల అనేక మంది ప్రాణాలను కోల్పోయిన సంవత్సరం?
    – 2013
  • దాగి ఉన్న మహమ్మారిగా దేన్ని పిలుస్తారు?
    –రోడ్డు ప్రమాదాలు

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close