General Knowledge

Telugu General Knowledge | తెలుగు జనరల్ కనౌలెడ్జి | 05/12/2019

కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్, లదాఖ్

జమ్మూకశ్మీర్‌ను రెండుగా విభజించి, కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చే ‘జమ్మూ కశ్మీర్ పునర్వ్యస్థీకరణ చట్టం-2019’ భారత తొలి ఉపప్రధాని, తొలి హోం మంత్రి సర్దార్ పటేల్ 144వ జయంతి రోజైన2019, అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చింది.

Current Affairs

ఈ చట్టం ప్రకారం అసెంబ్లీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్, పూర్తి స్థాయి కేంద్రపాలిత ప్రాంతంగా లదాఖ్ అవతరించాయి. దీంతో దేశంలోని రాష్ట్రాల సంఖ్య 29 నుంచి 28కి తగ్గింది. అదే సమయంలో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 7 నుంచి 9కి పెరిగింది.

జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో పాటు ఆ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లదాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ 2019, ఆగస్టు 5వ తేదీన కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ల ప్రమాణం
నూతనంగా అవతరించిన కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌కు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ (ఎల్‌జీ)గా సీనియర్ ఐఏఎస్ అధికారి గిరీశ్ చందర్ ముర్ము, లదాఖ్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి రాధాకృష్ణ మాథుర్ అక్టోబర్ 31న ప్రమాణం స్వీకారం చేశారు. లదాఖ్ రాజధాని లెహ్‌లో జరిగిన కార్యక్రమంలో రాధాకృష్ణ మాథుర్(ఆర్‌కే మాథుర్)తో జమ్మూకశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జస్టిస్ గీతా మిట్టల్ శ్రీనగర్ వెళ్లారు. అక్కడ రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గిరీశ్ చందర్ ముర్ము(జీసీ ముర్ము)తో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. 

  • లదాఖ్ రాజధాని : లెహ్‌
  • జమ్మూకశ్మీర్ రాజధాని : శ్రీ నగర్‌(వేసవి), జమ్మూ (శీతాకాలం)

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బాబ్డే ప్రమాణం స్వీకారం

సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే (63) నవంబర్ 18న ప్రమాణం స్వీకారం చేశారు.

Current Affairs

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు. 2021 ఏప్రిల్ 23 వరకు 17 నెలల పాటు ఈ పదవిలో ఉంటారు. అయోధ్య అంశంలో తీర్పునిచ్చిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ బాబ్డే కూడా ఉన్నారు.

జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే నేపథ్యం ఇలా..
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన న్యాయవాదుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ప్రముఖ సీనియర్ న్యాయవాది అరవింద్ శ్రీనివాస్ బాబ్డే కుమారుడు. తన తర్వాత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ బాబ్డే పేరును చీఫ్ జస్టిస్‌గా గొగోయ్ సిఫారసు చేయడం, రాష్ట్రపతి ఆమోదం తెలుపడం తెలిసిందే. చీఫ్ జస్టిస్‌గా రంజన్ గొగోయ్‌పై సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను కొట్టివేసిన ముగ్గురు సభ్యుల ధర్మాసనంలోనూ బాబ్డే ఉన్నారు. ఆధార్ లేదన్న కారణంగా ఏ ఒక్క పౌరునికీ కనీస సేవలు, ప్రభుత్వ సేవలను తిరస్కరించడానికి వీల్లేదంటూ తీర్పునిచ్చిన ధర్మాసనంలోనూ భాగం పంచుకున్నారు. నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్‌ఎల్‌బీ డిగ్రీలను అందుకున్నారు. మహారాష్ట్ర బార్‌కౌన్సిల్‌లో 1978లో న్యాయవాదిగా నమోదయ్యారు. బోంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. 2000 మార్చి 29న బోంబే హైకోర్టు న్యాయమూర్తిగా, 2012 అక్టోబర్ 16న మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులైన బాబ్డే, 2013 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు జడ్జీగా బాధ్యతలు చేపట్టారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి:
 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బాబ్డే ప్రమాణం స్వీకారం
ఎప్పుడు: నవంబర్ 18, 2019
ఎవరు: జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే
ఎక్కడ: న్యూఢిల్లీ

భారతదేశ ప్రధాన రాజకీయ పార్టీలు- చిహ్నాలు

ప్రపంచంలోని అన్ని దేశాలలో రాజకీయపార్టీలున్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విజయవంతంగా పనిచేయాలంటే రాజకీయ పార్టీలు తప్పనిసరి. అయితే మన రాజ్యాంగంలో రాజకీయ పార్టీల గురించిన ప్రస్తావన లేదు. కానీ ఆర్టికిల్ 19 (1) (సి) ప్రకారం సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వాతంత్య్రం ఉందని చెబుతుంది. ఇదే రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకోవడానికి మూలమని చెప్పవచ్చు. ప్రపంచదేశాలలో ఎక్కడా మనకున్నన్ని రాజకీయ పార్టీలు లేకపోవడం గమనార్హం. కారణం మనది విభిన్న సంస్కృతులు కలిగిన బహుళ సమాజం. సంక్లిష్టత ఎక్కువ. ఫ్రెంచ్, ఇటలీలలో కూడా బహుపార్టీల విధానం ఉన్నప్పటికీ వాటికీ మనకీ చాలా వ్యత్యాసం ఉంది. కుల రాజకీయలు, మత రాజకీయాలు, ప్రాంతీయ రాజకీయలు, నాయకుల ఆకర్షనల రాజకీయాలు… ఇలా చాలా. ఎక్కడో చిట్టచివరి జాబితాలో ప్రజా శ్రేయస్సును కాంక్షించే తత్వం, మొదటి ప్రాధాన్యత పదవులకు ఇవ్వడం మన దేశ రాజకీయాలలో కనిపించే అత్యంత సాధారణ అంశం.

Current Affairs
బహుజన్ సమాజ్ పార్టీ (BSP)ఏనుగు
భారతీయ జనతా పార్టీ (BJP)కమలం
భారత కమ్యూనిస్టు పార్టీ (CPI)కంకి- కొడవలి
భారత కమ్యూనిస్టు పార్టీ (CPM)సుత్తి- కొడవలి
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ (NCP (I))హస్తం
ఆమ్ ఆద్మి పార్టీ (AAP)చీపురు కట్ట
జనతాదళ్చక్రం
జనతా పార్టీనాగలి పట్టిన రైతు
లోక్‌దళ్పొలం దున్నే రైతు
సమాజవాది జనతాదళ్ఎద్దులబండిని తోలే రైతు
అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK)రెండు ఆకులు
ద్రవిడ మున్నెట్ర కజగం (DMK)ఉదయించే సూర్యుడు
తెలుగు దేశం పార్టీ (TDP)సైకిల్
తెలుగు దేశం పార్టీ (NTR TDP)సింహం
అస్సాం గణపరిషత్ (AGP)ఏనుగు
జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM)ధనస్సు- బాణం
మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (MGP)సింహం
నేషనల్ కాన్ఫరెన్స్నాగలి
జమ్మూ- కాశ్మీర్ పాంథర్స్ పార్టీ (JKPP)సైకిల్
జమ్మూ- కాశ్మీర్పీపుల్ కాన్ఫరెన్స్సింహం
కేరళ కాంగ్రెస్గుఱ్ఱం
కేరళ కాంగ్రెస్ (M)రెండు ఆకులు
రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (RSP)పార- బొగ్గు కార్మికుడు
ముస్లిం లీగ్నిచ్చెన
పీసెంట్స్ ఆండ్ వర్రర్ పార్టీ ఆఫ్ ఇండియా (PWP)బండి
శివసేనధనస్సు- బాణం
మణిపూర్ పీపుల్స్ పార్టీసైకిల్
కుకీ నేషనల్ అసెంబ్లీరెండు ఆకులు
ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్రెండు ఆకులు
మిజో నేషనల్ ఫ్రంట్పులి
నాగాలాండ్ పీపుల్స్ కౌన్సిల్కోడిపుంజు
నాగాలాండ్ పీపుల్స్ పార్టీఏనుగు
శిరోమణి అకాళీ దళ్ (SAD)త్రాసు
సిక్కిం సంగ్రామ్ పరిషత్ఏనుగు
త్రిపుర ఉపజాతి జుబా సమితిరెండు ఆకులు
అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్సింహం
అరుణాచల్ పీపుల్స్ పార్టీదంపతులు
తెలంగాణా రాష్ట్ర సమితికారు
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(YSR CONGRESS PARTY)సీలింగ్ ఫ్యాన్
ఆల్ ఇండియా యునెటైడ్ డెమోక్రటిక్ ఫ్రంట్తాళం బుర్ర- తాళం చెవి
అరుణాచల్ కాంగ్రెస్కలిసిన రెండు కత్తులు
ఉత్తరాఖండ్ క్రాంతి దళ్కుర్చీ
యునెటైడ్ డెమోక్రటిక్ పార్టీరెండు ఆకులు
యునెటైడ్ గోవన్స్ డెమోక్రటిక్ పార్టీసైకిల్
సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్గొడుగు
రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీపార- జెండ
రాష్ట్రీయ జనతా పార్టీహరికేన్ దీపం
పట్టలి మక్కల్ కట్చిమామిడి పండు
జనతాదళ్ (సెక్యులన్)గడ్డి నెత్తిన పెట్టుకున్న మహిళా రైతు
జనతాదళ్ (యునెటైడ్)బాణం
ఇండియన్ నేషనల్ లోక్‌దళ్కళ్ళద్దాలు
బిజు జనతా దళ్శంఖం
లోక్‌జన్‌శక్తి పార్టీబంగ్లా

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close