Current Affairs

Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 31/12/2019

హైపవర్ కమిటీ కన్వీనర్‌గా సీఎస్ నీలం సాహ్ని

ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులను.. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) ఇచ్చే నివేదికను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 29న హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది.

Current Affairs

ఈ హైపవర్ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మొత్తం పదిమంది మంత్రులు, సీఎం ముఖ్య సలహాదారు, ఐదుగురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది.

హైపవర్ కమిటీ సభ్యులు
బుగ్గన రాజేంద్రనాథ్, పిల్లి సుభాష్‌చంద్ర బోస్, బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, ఆదిమూలపు సురేష్, సుచరిత, కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, పేర్ని నాని, కొడాలి నాని, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, డీజీపీ సవాంగ్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్యామలరావు, న్యాయ శాఖ కార్యదర్శులు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 హైపవర్ కమిటీ కన్వీనర్‌గా ఏపీ సీఎస్ నీలం సాహ్ని
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : జీఎన్ రావు కమిటీ చేసిన సిఫార్సులను.. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) ఇచ్చే నివేదికను అధ్యయనం చేసేందుకు

విశాఖలో 1285 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో రూ.1285.32 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు డిసెంబర్ 28న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

Current Affairs

ముందుగా కైలాసగిరిపై వీఎంఆర్‌డీఏ చేపట్టే రూ.379.82 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జీవీఎంసీ చేపట్టనున్న రూ.905.50 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. మరోవైపు విశాఖ ఆర్‌కే బీచ్‌లో ఏర్పాటు చేసిన విశాఖ ఉత్సవ్-2019ను సీఎం జగన్ ప్రారంభించారు. తర్వాత తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్‌జైన్ దంపతులకు సీఎం ఆత్మీయ సత్కారం చేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 రూ.1285.32 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్

నాసా ది మార్స్ 2020 మిషన్ ఆవిష్కరణ

అరుణగ్రహంపైకి జీవం ఉనికిని తెలుసుకునేందుకు 2020 ఏడాది పంపనున్న ‘ది మార్స్ 2020 మిషన్’అంతరిక్ష నౌక (రోవర్)ను నాసా(అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ) శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.

Current Affairs

అమెరికాలోని లాస్‌ఏంజెల్స్ పాసడీనాలో ఉన్న జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీలో ఈ నౌకను రూపొందించారు. దీన్ని గత వారమే విజయవంతంగా పరీక్షించారు. తాజాగా దీన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ రోవర్ 2020 జూలైలో ఫ్లోరిడాలోని కేప్ కెనవరెల్ నుంచి అంతరిక్షంలోకి దూసుకుపోయి 2021 ఫిబ్రవరిలో అరుణగ్రహం(మార్స్)పై దిగనుంది.

ఈ రోవర్‌లో 23 కెమెరాలు, మార్స్‌పై గాలి శబ్దాలు వినేందుకు రెండు రిసీవర్లు, రసాయనిక చర్యలు విశ్లేషించేందుకు లేజర్లను వాడారు. క్యూరియాసిటీ రోవర్ మాదిరిగానే 6 చక్రాలు అమర్చారు. కారు పరిమాణంలో ఈ రోవర్ రాళ్ల మాదిరిగా ఉండే ఉపరితలంపై కూడా సులువుగా ప్రయాణిస్తుంది. ఒక్క రోజులో పూర్తిస్థాయిలో 200 గజాల స్థలాన్ని ఇది పరిశోధించనుంది. అరుణగ్రహంపై రోవర్ దిగేందుకు ఎంపిక చేసిన స్థలంపై ఒకప్పుడు సరస్సు ఉండేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 350 కోట్ల ఏళ్ల ఇది నదీ వ్యవస్థతో అనుసంధానమై ఉండొచ్చని భావిస్తున్నట్లు వివరించారు. ఈ రోవర్ ప్రయోగం తర్వాత ప్రతిష్టాత్మకమైన అరుణగ్రహంపైకి మానవసహిత అంతరిక్ష నౌకను పంపనున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 ది మార్స్ 2020 మిషన్ అంతరిక్ష నౌక (రోవర్) ఆవిష్కరణ
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : నాసా(అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ)
ఎక్కడ : జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ, పాసడీనా, లాస్‌ఏంజెల్స్, అమెరికా
ఎందుకు : అరుణగ్రహంపైకి జీవం ఉనికిని తెలుసుకునేందుకు

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close