Current Affairs
Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 30/12/2019
ప్రపంచ ప్రఖ్యాత టీనేజర్‌గా మలాలా : ఐరాస
ప్రపంచ ప్రఖ్యాత టీనేజర్‌గా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, పాకిస్థాన్‌కు చెందిన మలాలా యూసఫ్‌జాయ్ నిలిచింది.
21వ శతాబ్దపు రెండో దశకంలో ఫేమస్ టీనేజర్‌గా మలాలా నిలిచినట్లు ఐక్యరాజ్యసమితి(ఐరాస) డిసెంబర్ 26న ప్రకటించింది. 2010-2019 మధ్య మలాలాకు వచ్చిన గుర్తింపు ఆధారంగా ఐరాస ఈ విషయాన్ని వెల్లడించింది. పాక్‌లో బాలికల విద్య కోసం మలాలా చేసిన పోరాటాన్ని ఐరాస గుర్తుచేసింది. చిన్నప్పటి నుంచే మలాలా బాలికల విద్య గురించి మాట్లాడిందని, తాలిబన్ల అకృత్యాలపై పోరాడిందని పేర్కొంది.
డెకేడ్ ఇన్ రివ్యూ
ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ‘డెకేడ్ ఇన్ రివ్యూ’ అనే నివేదికను ఐరాస రూపొందించింది. దీనిలో 2010లో భయంకర విధ్వసాన్ని సృష్టించిన హైతీ భూకంపం, 2011లో మొదలై ఇప్పటివరకు కొనసాగుతున్న సిరియా అంతర్యుద్ధం, బాలికల విద్య కోసం 2012లో మలాలా కృషి వంటి సంఘటనలను ప్రధానాంశాలుగా ప్రకటించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐరాస ప్రపంచ ప్రఖ్యాత టీనేజర్‌గా ఎంపిక
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : ఐక్యరాజ్యసమితి(ఐరాస)
సుపరిపాలనలో తమిళనాడుకు అగ్రస్థానం
జాతీయ సుపరిపాలన దినోత్సవం(డిసెంబర్ 25) సందర్భంగా కేంద్రప్రభుత్వం ‘జాతీయ సుపరిపాలన సూచీ(జీజీఐ)’ని విడుదల చేసింది.
న్యూఢిల్లీలో డిసెంబర్ 25న జరిగిన కార్యక్రమంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి, పీఎంవో సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సూచీని విడుదల చేశారు. ఈ సూచీకి సంబంధించి దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను పెద్ద, చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా వర్గీకరించారు. అందులో పెద్ద రాష్ట్రాలు 18, చిన్న రాష్ట్రాలు 11 (జమ్మూకశ్మీర్ ఇందులోనే ఉంది), ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలున్నాయి. ఎంపిక చేసుకున్న పది పాలనాంశాలకు ఒక్కో దానికి ఒక్కో మార్కు కింద మొత్తం పది మార్కులకు ర్యాంకింగ్ ఇచ్చారు. పెద్ద రాష్ట్రాల విభాగంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి.
18 పెద్ద రాష్ట్రాల విభాగంలో….
ర్యాంకు | రాష్ట్రం |
1 | తమిళనాడు |
2 | మహారాష్ట్ర |
3 | కర్ణాటక |
4 | చత్తీస్‌ఘడ్ |
5 | ఆంధ్రప్రదేశ్ |
6 | గుజరాత్ |
11 | తెలంగాణ |
16 | గోవా |
17 | ఉత్తరప్రదేశ్ |
18 | జార్ఖండ్ |
11 చిన్న రాష్ట్రాల విభాగంలో…
ర్యాంకు | రాష్ట్రం |
1 | హిమాచల్‌ప్రదేశ్ |
2 | ఉత్తరాఖండ్ |
3 | తిపుర |
4 | మిజోరం |
5 | సిక్కిం |
9 | మేఘాలయ |
10 | నాగాలాండ్ |
11 | అరుణాచల్ ప్రదేశ్ |
7 కేంద్రపాలిత ప్రాంతాల విభాగంలో…
ర్యాంకు | కేంద్రపాలిత ప్రాంతం |
1 | పుదుచ్చేరి |
2 | చంఢిఘర్ |
3 | న్యూఢిల్లీ |
4 | డామన్ అండ్ డయ్యూ |
5 | అండమాన్ అండ్ నికోబార్ దీవులు |
6 | దాద్రానగర్ హవేలీ |
7 | లక్షద్వీప్ |
ఏపీ, తెలంగాణ…
- జాతీయ సుపరిపాలన సూచీలో ఆంధ్రప్రదేశ్ 5.05 మార్కులతో 5, తెలంగాణ 4.83 మార్కులతో 11వ స్థానాల్లో నిలిచాయి.
- వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ 0.48 స్కోర్‌తో ఆరు, 0.29 స్కోర్‌తో తెలంగాణ 17వ స్థానాల్లో నిలిచాయి.
- పరిశ్రమలు, వాణిజ్యంలో 0.94 స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్ రెండు, 0.93 స్కోర్‌తో తెలంగాణ మూడో స్థానం పొందాయి.
- మానవ వనరుల అభివృద్ధిలో 0.58 స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్ తొమ్మిది, 0.55 స్కోర్‌తో తెలంగాణ 11వ స్థానాల్లో నిలిచాయి.
- ప్రజారోగ్యం విషయంలో 0.63 స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్ ఏడు, 0.63 స్కోర్‌తో తెలంగాణ ఎనిమిది స్థానాలు సాధించాయి.
- మౌలిక వసతులు, సదుపాయాల్లో 0.70 స్కోర్‌తో తెలంగాణ ఆరు, 0.66 స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్ ఎనిమిది స్థానాల్లో నిలిచాయి.
- ఆర్థిక పాలనలో 0.63 స్కోర్‌తో తెలంగాణ మూడు, 0.55 స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్ ఏడు స్థానాలు సాధించాయి.
- సామాజిక సంక్షేమం, అభివృద్ధి విషయంలో 0.57 స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్ మూడు, 0.46 స్కోర్‌తో తెలంగాణ ఎనిమిది స్థానాలు అందుకున్నాయి.