Current Affairs

Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 30/11/2019

అంతర్జాతీయం :

¤ శ్రీలంక దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స సోదరుడు మహింద రాజపక్స (74) ఆ దేశ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 2020లో ఎన్నికలు జరిగే వరకు ఆపద్ధర్మ ప్రభుత్వానికి మహింద నేతృత్వం వహిస్తారు.
¤ నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో అంతర్జాతీయ బాలల శాంతి పురస్కారాలను ప్రదానం చేశారు. స్వీడన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌కు, కామెరూన్‌కు చెందిన శాంతి కార్యకర్త దివినా మాలౌమ్‌ అనే 15 ఏళ్ల బాలిక ఈ పురస్కారాలను అందుకున్నారు. 
¤ కెనడా ప్రధానిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన జస్టిన్‌ ట్రూడో తన మంత్రివర్గంలో నలుగురు భారత సంతతి వ్యక్తులకు స్థానం కల్పించారు. అనితా ఆనంద్‌ (50), బర్దీష్‌ ఛగ్గర్‌ (39), నవదీప్‌ భైన్స్‌ (42), హర్జిత్‌ సజ్జన్‌ (49)లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కెనడాలో మంత్రిపదవి చేపట్టిన తొలి హిందూ మహిళ అనిత. మిగిలిన ముగ్గురూ సిక్కులు.

జాతీయం :

¤  దాద్రా-నాగర్‌ హవేలీ, దమణ్‌ దీవ్‌ కేంద్రపాలిత ప్రాంతాల విలీనానికి ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఇకపై ఈ రెండింటినీ కలిపి ‘‘దాద్రా-నాగర్‌ హవేలీ- దమణ్‌ దీవ్‌” కేంద్ర పాలిత ప్రాంతంగా వ్యవహరిస్తారు.
¤  ‘నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ ఆస్ట్రేలియా’కు చేరిన అపురూపమైన మూడు పురాతన భారతీయ కళాఖండాలు తిరిగి స్వదేశానికి చేరనున్నాయి. జనవరిలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌మారిసన్‌ భారత్‌ పర్యటనలో వాటిని అందజేయనున్నారు. 6-8 శతాబ్దాల మధ్యకాలానికి చెందిన భారీ నటరాజు, 15వ శతాబ్దం నాటి రెండు ద్వారపాలకుల విగ్రహాలు ఆస్ట్రేలియాకు తరలిపోయాయి.
¤  స్మార్ట్‌ సిటీ పథకంలో భాగంగా అమరావతికి ఇప్పటి వరకు కేటాయించిన రూ.496 కోట్లలో రూ.472.9 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. విశాఖపట్నం, తిరుపతి, కాకినాడలకు రూ.299 కోట్లు, రూ.196 కోట్లు, రూ.392 కోట్లు విడుదల చేసినట్లు ఆయన చెప్పారు.
 » ఏపీలో 31,404 మంది వెట్టి కార్మికులను గుర్తించి, విముక్తి కలిగించినట్లు కేంద్ర కార్మిక మంత్రి సంతోష్‌కుమార్‌ గంగ్వార్‌ రాజ్యసభలో తెలిపారు. 
 » దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల వినియోగంలో ఏపీ తొలి పది రాష్ట్రాల్లో ఉందని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత సహాయ మంత్రి రతన్‌లాల్‌ కటారియా రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
¤  స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ) సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఇకపై ప్రధానమంత్రి, ఆయన కుటుంబ సభ్యులకు ఎస్పీజీ కమాండోల రక్షణ ఉంటుంది. మాజీ ప్రధానులు, వారితోపాటు ఒకే ఇంట్లో నివాసం ఉండే కుటుంబసభ్యులకు ఆ ప్రధాని పదవీకాలం ముగిసిన అయిదేళ్ల వరకు ఈ రక్షణ కల్పిస్తారు.

రాష్ట్రీయం

రాష్ట్రీయం (ఆంధ్రప్రదేశ్‌)

¤ కాపు, బలిజ, తెలగ, ఒంటరి, ఉపకులాలకు చెందిన, ఆర్థికంగా వెనుకబడిన మహిళల జీవన ప్రమాణాలు పెంచి, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైఎస్సార్‌ కాపు నేస్తం పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద 45-60 ఏళ్ల మధ్య వయసు మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున అయిదేళ్లలో రూ.75 వేలు అందిస్తారు. ఈ పథకం నిర్వహణకు ఏటా రూ.900 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ ఏడాది రూ.1,101 కోట్లు కేటాయించనున్నారు.
¤ వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకానికి రెండో విడత కింద దరఖాస్తు చేసుకున్న 65,054 డ్రైవర్లలో 62,637 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసినట్లు రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు.
¤ ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పట్టణ) పథకం కింద కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 2.58 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. ఒక్కో ఇంటికి కేంద్రం రూ.1.50 లక్షలు రాయితీ అందిస్తుంది. ఇందుకోసం రూ.3,879 కోట్లు ఖర్చవుతుంది. వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం కింద రాష్ట్రంలోని 28 పురపాలికల్లో 57,629 ఇళ్లు, 15 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని 122 నియోజకవర్గాల్లో 2,01,019 ఇళ్లు కేంద్రం మంజూరు చేసింది.

ఆర్థిక రంగం :

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) మార్కెట్‌ విలువ రూ.10 లక్షల కోట్లకు చేరుకుంది. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో ఒక సంస్థ విలువ ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ :

¤ చైనా పరిశోధకులు భూమికి 15 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న భారీ కృష్ణబిలాన్ని (బ్లాక్‌హోల్‌) కనుక్కున్నారు. ఎల్‌బీ1గా పిలుస్తున్న ఈ కృష్ణబిల ద్రవ్యరాశి సూర్యుడి ద్రవ్యరాశి కంటే 70 రెట్లు అధికం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close