Current Affairs

Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 28/12/2019

వివేకానంద రాక్ స్వర్ణోత్సవాల్లో రాష్ట్రపతి

తమిళనాడులోని కన్యాకుమారిలో నిర్వహించిన స్వామి వివేకానంద రాక్ స్వర్ణోత్సవాల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొన్నారు.

Current Affairs

ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ… భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటిచెప్పిన ప్రాంతం కన్యాకుమారి అని పేర్కొన్నారు. విశిష్టమైన ఆధ్యాత్మిక విప్లవానికి ఇక్కడి నుంచే స్వామి వివేకానంద నాంది పలికారన్నారు. మాతృదేశం పట్ల ప్రజల్లో ప్రేమ, మతపరమైన విలువలను లోకానికి ఆయన తెలియజేశారని చెప్పారు.

యూపీఐతో ఫాస్టాగ్ రీచార్జ్ : ఎన్‌పీసీఐ
నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఎన్‌ఈటీసీ) ఫాస్టాగ్‌లను భీమ్ యూపీఐ ద్వారా కూడా రీచార్జ్ చేసుకునే వెసులుబాటును కల్పించినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వెల్లడించింది. దీనితో ఫాస్టాగ్ రీచార్జ్ ప్రక్రియ మరింత సులభతరం కాగలదని ఎన్‌పీసీఐ సీవోవో ప్రవీణ రాయ్ తెలిపారు. దేశవ్యాప్తంగా డిసెంబర్ 15 నుంచి ఫాస్టాగ్ విధానం అమల్లోకి వచ్చింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 స్వామి వివేకానంద రాక్ స్వర్ణోత్సవాలు
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : కన్యాకుమారి, తమిళనాడు

సీఏఏపై కాంగ్రెషనల్ రీసెర్చి సర్వీస్ నివేదిక

భారత పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్- ఎన్పీఆర్)పై అమెరికాకు చెందిన కాంగ్రెషనల్ రీసెర్చి సర్వీస్(సీఆర్‌ఎస్) నివేదికను రూపొందించింది.

Current Affairs

ఈ నివేదికను ఆ దేశ కాంగ్రెస్ సభ్యులకు అందజేసింది. సీఆర్‌ఎస్ అనేది అమెరికా కాంగ్రెస్‌కు చెందిన స్వతంత్య్ర అధ్యయన విభాగం. ప్రాముఖ్యత సంతరించుకున్న దేశీయ, అంతర్జాతీయ అంశాలపై అధ్యయనం చేసి ఈ కమిటీ కాంగ్రెస్ సభ్యులకు నివేదికలు సమర్పిస్తుంటుంది. అయితే వీటిని కాంగ్రెస్ అధికారిక నివేదికలుగా మాత్రం పరిగణించదు.

సీఆర్‌ఎస్ నివేదికలోని అంశాలు

  • సీఏఏ చట్టాన్ని, ఎన్పీఆర్‌తో కలిపి అమలు చేయడం వల్ల భారత్‌లోని ముస్లిం వర్గంపై ప్రభావం పడే అవకాశం ఉంది.
  • భారత చరిత్రలో తొలిసారి మతం ఆధారంగా పౌరసత్వం కల్పిస్తున్నారు.
  • 955 నాటి పౌరసత్వ సవరణ చట్టానికి పలు సార్లు సవరణలు చేశారని.. కానీ ఎప్పుడూ మతాన్ని ప్రాతిపదికగా తీసుకోలేదు.
  • తాజా సవరణ భారత రాజ్యాంగంలో అధికరణ 14, 15ని సవాల్ చేసేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సీఏఏపై ప్రభుత్వ వాదనను కూడా సీఆర్‌ఎస్ నివేదికలో పేర్కొంది. బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లో ముస్లింలు ఎలాంటి హింసకు గురికావడం లేదని అందుకే వారికి పౌరసత్వం కల్పించడం లేదన్న సీఏఏ మద్దతుదారుల వాదనని ఉటంకించింది. తాజా చట్టం వల్ల దేశంలోని ఏ ఒక్క పౌరుడూ పౌరసత్వం కోల్పోరన్న ప్రభుత్వ హామీని కూడా నివేదికలో పొందుపరిచారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 భారత పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్- ఎన్పీఆర్)పై నివేదిక
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : కాంగ్రెషనల్ రీసెర్చి సర్వీస్(సీఆర్‌ఎస్)

సరిహద్దుపై కువైట్, సౌదీ అరేబియా ఒప్పందం

ఇరుదేశాల మధ్య సరిహద్దు రేఖ పొడవునా తటస్థ మండలాన్ని ఏర్పాటు చేసేందుకు కువైట్, సౌదీ అరేబియా అంగీకరించాయి.

Current Affairs

ఈ మేరకు కువైట్ రాజధాని కువైట్ సిటీలో డిసెంబర్ 24న జరిగిన కార్యక్రమంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఒప్పందంపై సంతకాలు చేశారు. దీంతోబాటే ఉమ్మడిగా చమురు ఉత్పత్తి పునరుద్ధరించేందుకు ఉద్దేశించిన అవగాహనా ఒప్పందంపైనా సంతకాలు చేశారు. ఈ రెండు ఒప్పందాలను చారిత్రాత్మక విజయంగా ఇరు పక్షాలు ప్రకటించుకున్నాయి.

సరిహద్దుపై కుదిరిన ఒప్పందంలో భాగంగా 5,770 చ. కి.మీ సరిహద్దు రేఖ పొడవునా తటస్థ మండలాన్ని ఏర్పాటు చేస్తారు. నాలుగేళ్ల క్రితం యుద్ధం కారణంగా ఖఫీ, వాఫ్రా చమురు క్షేత్రాల్లో నిలిపివేసిన ఉత్పత్తిని తిరిగి ప్రారంభించనున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 సరిహద్దుపై కువైట్, సౌదీ అరేబియా ఒప్పందం
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎక్కడ : కువైట్ సిటీ, కువైట్
ఎందుకు : ఇరుదేశాల మధ్య సరిహద్దు రేఖ పొడవునా తటస్థ మండలాన్ని ఏర్పాటు చేసేందుకు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close