Current Affairs

Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 27/12/2019

గ్యాస్ వివాదాలపై నిపుణుల కమిటీ

చమురు, గ్యాస్ రంగాల్లో పెట్టుబడులపై వివాదాలు ప్రతికూల ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై కేంద్రప్రభుత్వం దృష్టి సారించింది.

Current Affairs

సుదీర్ఘ న్యాయపోరు సమస్యలు లేకుండా నిర్దిష్ట కాలవ్యవధిలోగా ఇంధనాల అన్వేషణ, ఉత్పత్తి సంబంధ వివాదాల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమించింది. ఇందులో చమురు శాఖ మాజీ కార్యదర్శి జీసీ చతుర్వేది, ఆయిల్ ఇండియా మాజీ సీఎండీ బికాష్ సి బోరా, హిందాల్కో ఇండస్ట్రీస్ ఎండీ సతీష్ పాయ్ సభ్యులుగా ఉంటారని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 25న తెలిపింది. కమిటీ కాల వ్యవధి మూడేళ్ల పాటు ఉంటుందని పేర్కొంది.మధ్యవర్తిత్వం ద్వారా భాగస్వాముల మధ్య లేదా కాంట్రాక్టరు.. ప్రభుత్వం మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడంపై ఈ కమిటీ దృష్టి పెడుతుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 చమురు, గ్యాస్ రంగాల్లో పెట్టుబడులపై వివాదాలపై కమిటీ ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 25
ఎవరు : కేంద్రప్రభుత్వం

పులివెందులలో 24 అభివృద్ధి పనులకు శంకుస్థాపన

పులివెందులకు అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కళాశాలలను మంజూరు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

Current Affairs

వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రూ.1,329 కోట్లతో చేపట్టిన 24 అభివృద్ధి పనులకు డిసెంబర్ 25న ఆయన పులివెందుల ధ్యాన్‌చంద్ క్రీడా మైదానంలో శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పులివెందులలో తొలివిడతగా ఈ పనులకు శ్రీకారం చుట్టామని, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. గండికోట ప్రాజెక్టు దిగువన ముద్దనూరు మండలం ఆరవేటిపల్లె, దేనేపల్లె వద్ద 20 టీఎంసీల సామర్థ్యంతో కొత్తగా రిజర్వాయర్ నిర్మిస్తామన్నారు. ముద్దనూరు – కొడికొండ చెక్‌పోస్టు (పులివెందుల-బెంగుళూరు) రోడ్డును విస్తరిస్తామని పేర్కొన్నారు.

సుపరిపాలనలో తమిళనాడుకు అగ్రస్థానం

జాతీయ సుపరిపాలన దినోత్సవం(డిసెంబర్ 25) సందర్భంగా కేంద్రప్రభుత్వం ‘జాతీయ సుపరిపాలన సూచీ(జీజీఐ)’ని విడుదల చేసింది.

Current Affairs

న్యూఢిల్లీలో డిసెంబర్ 25న జరిగిన కార్యక్రమంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి, పీఎంవో సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సూచీని విడుదల చేశారు. ఈ సూచీకి సంబంధించి దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను పెద్ద, చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా వర్గీకరించారు. అందులో పెద్ద రాష్ట్రాలు 18, చిన్న రాష్ట్రాలు 11 (జమ్మూకశ్మీర్ ఇందులోనే ఉంది), ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలున్నాయి. ఎంపిక చేసుకున్న పది పాలనాంశాలకు ఒక్కో దానికి ఒక్కో మార్కు కింద మొత్తం పది మార్కులకు ర్యాంకింగ్ ఇచ్చారు. పెద్ద రాష్ట్రాల విభాగంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి.

18 పెద్ద రాష్ట్రాల విభాగంలో….

ర్యాంకురాష్ట్రం
1తమిళనాడు
2మహారాష్ట్ర
3కర్ణాటక
4చత్తీస్‌ఘడ్
5ఆంధ్రప్రదేశ్
6గుజరాత్
11తెలంగాణ
16గోవా
17ఉత్తరప్రదేశ్
18జార్ఖండ్

11 చిన్న రాష్ట్రాల విభాగంలో…

ర్యాంకురాష్ట్రం
1హిమాచల్‌ప్రదేశ్
2ఉత్తరాఖండ్
3తిపుర
4మిజోరం
5సిక్కిం
9మేఘాలయ
10నాగాలాండ్
11అరుణాచల్ ప్రదేశ్

7 కేంద్రపాలిత ప్రాంతాల విభాగంలో…

ర్యాంకుకేంద్రపాలిత ప్రాంతం
1చంఢిఘర్
2డామన్ అండ్ డయ్యూ
3పుదుచ్చేరి
4అండమాన్ అండ్ నికోబార్ దీవులు
5లక్షద్వీప్
6న్యూఢిల్లీ
7దాద్రానగర్ హవేలీ

ఏపీ, తెలంగాణ…

  • జాతీయ సుపరిపాలన సూచీలో ఆంధ్రప్రదేశ్ 5.05 మార్కులతో 5, తెలంగాణ 4.83 మార్కులతో 11వ స్థానాల్లో నిలిచాయి.
  • వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ 0.48 స్కోర్‌తో ఆరు, 0.29 స్కోర్‌తో తెలంగాణ 17వ స్థానాల్లో నిలిచాయి.
  • పరిశ్రమలు, వాణిజ్యంలో 0.94 స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్ రెండు, 0.93 స్కోర్‌తో తెలంగాణ మూడో స్థానం పొందాయి.
  • మానవ వనరుల అభివృద్ధిలో 0.58 స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్ తొమ్మిది, 0.55 స్కోర్‌తో తెలంగాణ 11వ స్థానాల్లో నిలిచాయి.
  • ప్రజారోగ్యం విషయంలో 0.63 స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్ ఏడు, 0.63 స్కోర్‌తో తెలంగాణ ఎనిమిది స్థానాలు సాధించాయి.
  • మౌలిక వసతులు, సదుపాయాల్లో 0.70 స్కోర్‌తో తెలంగాణ ఆరు, 0.66 స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్ ఎనిమిది స్థానాల్లో నిలిచాయి.
  • ఆర్థిక పాలనలో 0.63 స్కోర్‌తో తెలంగాణ మూడు, 0.55 స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్ ఏడు స్థానాలు సాధించాయి.
  • సామాజిక సంక్షేమం, అభివృద్ధి విషయంలో 0.57 స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్ మూడు, 0.46 స్కోర్‌తో తెలంగాణ ఎనిమిది స్థానాలు అందుకున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close