Current Affairs

Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 25/12/2019

ఐసీటీ జాతీయ అవార్డులు ప్రదానం

విద్యార్థుల అభ్యాసాన్ని ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీస్‌ (ఐసీటీ) ద్వారా మెరుగుపరిచిన ఉపాధ్యాయులకు కేంద్ర మానవ వనరుల అభివద్ధి శాఖ సహాయ మంత్రి సంజయ్‌ శ్యామ్‌రావు ధోత్రే జాతీయ అవార్డులు ప్రదానం చేశారు.

Current Affairs

ఢిల్లీలో డిసెంబర్‌ 23న జరిగిన కార్యక్రమంలో 2017 సంవత్సరానికి 43 మంది టీచర్లకు ఈ అవార్డులు అందజేశారు. ఈ పురస్కారంకింద ఒక ల్యాప్‌టాప్, వెండి పతకం, ఐసీటీ కిట్, ప్రశంసాపత్రం అందజేశారు.

తెలంగాణ నుంచి ఇద్దరికి..
తెలంగాణ నుంచి లాలాగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల–2 ఉపాధ్యాయురాలు చిలుకా ఉమారాణికి, నవాబ్‌పేట ప్రభుత్వ ప్రాథమికోన్న త పాఠశాల ఉపాధ్యాయుడు దేవనపల్లి నాగరాజుకు ఐసీటీ పురస్కారం లభించింది.

ఏపీ నుంచి నరసింహారెడ్డికి.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి మున్సిపల్‌ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు టి.వజ్ర నరసింహారెడ్డికి ఈ పురస్కారం లభించింది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి :
 2017 ఐసీటీ జాతీయ అవార్డులు ప్రదానం
ఎప్పుడు : డిసెంబర్‌ 23
ఎవరు : కేంద్ర మానవ వనరుల అభివద్ధి శాఖ సహాయ మంత్రి సంజయ్‌ శ్యామ్‌రావు ధోత్రే
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : విద్యార్థుల అభ్యాసాన్ని ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీస్‌ (ఐసీటీ) ద్వారా మెరుగుపరిచిన ఉపాధ్యాయులకు

విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా ష్రింగ్లా

భారత విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా హ‌ర్ష్ వర్ధన్‌ ష్రింగ్లా నియమితులయ్యారు.

Current Affairs

ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నేతత్వంలోని కేబినెట్‌ నియామక కమిటీ డిసెంబర్‌ 23న ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది. ష్రింగ్లా ప్రస్తుతం అమెరికాలో భారత రాయబారిగా ఉన్నారు. 1984 ఐఎఫ్‌ఎస్‌ అధికారుల బ్యాచ్‌కు చెందిన ఆయన 2020, జనవరి 29న నూతన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం విదేశాంగ కార్యదర్శిగా ఉన్న విజయ్‌ కేశవ్‌ గోఖలే పదవీ కాలం 2020, జనవరి 28న ముగియనుంది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి :
 భారత విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా నియామకం
ఎప్పుడు : డిసెంబర్‌ 23
ఎవరు : హార్స్ వర్ధన్‌ ష్రింగ్లా

కుందూ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన

రూ.2,300 కోట్లతో చేపట్టిన రాజోలి ప్రాజెక్టు, జొలదరాశి ప్రాజెక్టు, కుందూ – బ్రహ్మంసాగర్‌ ఎత్తిపోతల పథకాలతోపాటు మరికొన్ని అభివద్ధి పనులకు వైఎస్సార్‌ జిల్లా దువ్వూరు మండలం నేలటూరు వద్ద ఆంధ్రప్రదేశ్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్‌ 23న శంకుస్థాపన చేశారు.

Current Affairs

ఏటా గోదావరి నుంచి మూడు వేల టీఎంసీల వరద జలాలు సముద్రం పాలవుతున్నాయని, వరద వచ్చిన 40 – 50 రోజుల్లోపే ఆ నీటిని ఒడిసి పట్టేందుకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఈ సందర్భంగా సీఎం జగన్‌ చెప్పారు. గోదావరి నీటిని బల్లేపల్లె నుంచి బనకచర్ల వరకు.. పెన్నా బేసిన్‌కు తరలించేందుకు శ్రీకారం చుట్టామన్నారు.

మరోవైపు కడప రిమ్స్‌లో రూ.107 కోట్లతో క్యాన్సర్‌ కేర్‌ సెంటర్, రూ.175 కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్, రూ.40.81 కోట్లతో మానసిక చికిత్సాలయం, ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే కడప – రాయచోటి రోడ్డులో రూ.82.73 కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని ప్రారంభించారు.

ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులివీ..

  • కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల సరిహద్దులో కుందూనదిపై రూ.1357 కోట్లతో 2.95 టీఎంసీల సామర్థ్యంతో రాజోలి ప్రాజెక్టు. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల వద్ద రూ.312 కోట్లతో 0.8 టీఎంసీల సామర్థ్యంతో జొలదరాశి ప్రాజెక్టు.
  • దువ్వూరు మండలం జొన్నవరం వద్ద రూ.564 కోట్లతో కుందూ నది నుంచి తెలుగంగ ఎస్‌ఆర్‌–1 ద్వారా బ్రహ్మంసాగర్‌కు నీటిని అందించే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు వల్ల తెలుగుగంగ కింద 91వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతోపాటు మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల్లోని తాగునీటి అవసరాలు తీరతాయి.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి :
 కుందూ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన
ఎప్పుడు : డిసెంబర్‌ 23
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : నేలటూరు, దువ్వూరు మండలం, వైఎస్సార్‌ జిల్లా

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close