Current Affairs
Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 24/12/2019
సరిహద్దు వివాదంపై భారత్, చైనా చర్చలు
దశాబ్దాలుగా నలుగుతున్న సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలను వేగవంతం చేయాలని భారత్, చైనాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.
త్వరగా ఈ సమస్యను పరిష్కరించుకుని పురోగతే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించాయి. సరిహద్దు వివాదంపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మధ్య 22వ దఫా చర్చలు ఢిల్లీలో డిసెంబర్ 21న జరిగాయి.
ఈ భేటీ విషయమై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ… ‘భారత్-చైనా వ్యూహాత్మక సంబంధాల కోణంలో సరిహద్దు సమస్యను చూడాలని, సరిహద్దుల్లో శాంతి నెలకొల్పాలని ఇరు వర్గాలు అంగీకారానికి వచ్చాయి. భారత్-చైనాల సంబంధాల్లో సుస్థిర, సమతులాభివృద్ధి ఈ ప్రాంతంతోపాటు ప్రపంచ శాంతి, అభివృద్ధికి సానుకూలంగా మారుతుందనే అభిప్రాయాన్ని ఈ ప్రత్యేక ప్రతినిధుల భేటీ వ్యక్తం చేసింది’అని తెలిపింది.
చైనాలో 23వ దఫా భేటీ
సరిహద్దు వివాదంపై చర్చించేందుకు వాంగ్, దోవల్‌ను రెండు దేశాలు ప్రత్యేక ప్రతినిధులుగా నియమించాయి. 2020 ఏడాది చైనాలో 23వ దఫా భేటీ కావాలని కూడా ఇద్దరు ప్రతినిధులు నిర్ణయించారు. భారత్-చైనాల మధ్య 3,488 కిలోమీటర్ల వాస్తవ నియంత్రణ రేఖపై వివాదం నలుగుతోంది. అరుణాచల్ ప్రదేశ్‌తోపాటు టిబెట్ దక్షిణ ప్రాంతం కూడా తనదేనని చైనా వాదిస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సరిహద్దు వివాదంపై భారత్, చైనా చర్చలు
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : చెనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
ఎక్కడ : న్యూఢిల్లీ
క్యూబా ప్రధానమంత్రిగా మాన్యుయల్ మర్రేరో
క్యూబాలో 40 ఏళ్ల అనంతరం ప్రధానమంత్రి పదవిని పునరుద్ధరించారు.
2004 నుంచి పర్యాటక శాఖ మంత్రిగా పనిచేస్తున్న మాన్యుయల్ మర్రేరో క్రజ్ డిసెంబర్ 21న ఈ పదవిని చేపట్టారు. 1959-1976 మధ్యకాలంలో ఈ పదవిలో విప్లవ నాయకుడు ఫిడెల్ స్ట్రో ఉండేవారు. దేశంలో అధ్యక్ష తరహా పాలన వచ్చి, క్యాస్ట్రో అధ్యక్షుడయిన తరువాత ప్రధాని పదవిని రద్దు చేశారు. ప్రస్తుతం క్యూబా అధ్యక్షుడిగా మిగ్యుల్ డియాజ్-కానెల్ ఉన్నారు. క్యూబా రాజధాని నగరం పేరు హవానా.
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్యూబా ప్రధానమంత్రిగా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : మాన్యుయల్ మర్రేరో క్రజ్
వెయిట్ లిఫ్టింగ్‌లో లాల్‌రినుంగా 27 రికార్డులు
ఖతర్ రాజధాని దోహాలో జరుగుతున్న ఖతర్ కప్ అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ టోర్నమెంట్‌లో యూత్ ఒలింపిక్స్ చాంపియన్, భారత యువతార జెరెమీ లాల్‌రినుంగా రజత పతకం సాధించాడు.
పురుషుల 67 కేజీల విభాగంలో పోటీపడిన మిజోరం లిఫ్టర్ లాల్‌రినుంగా మొత్తం 306 (స్నాచ్‌లో 140 కేజీల+క్లీన్ అండ్ జెర్క్‌లో 166 కేజీలు) కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 17 ఏళ్ల లాల్‌రినుంగా తన పేరిటే ఉన్న ఐదు సీనియర్ జాతీయ రికార్డులను, ఐదు జాతీయ జూనియర్ రికార్డులను, ఐదు జాతీయ యూత్ రికార్డులను, మూడు యూత్ వరల్డ్ రికార్డులను, మూడు ఆసియా యూత్ రికార్డులను, ఆరు కామన్వెల్త్ రికార్డులను బద్దలు కొట్టాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఖతర్ కప్ అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ టోర్నమెంట్‌లో రజతం
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : జెరెమీ లాల్‌రినుంగా
ఎక్కడ : దోహా, ఖతర్