Current Affairs

Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 21/12/2019

జనవరి 26న డామన్, దాద్రానగర్ ఆవిర్భావ దినోత్సవం

కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్న డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ దీవులను విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం 2020 జనవరి 26 నుంచి అమల్లోకి రానుంది.

Current Affairs

ఈ కొత్త కేంద్రపాలిత ప్రాంత ఆవిర్భావ దినోత్సవాన్ని జనవరి 26న నిర్వహించుకోవాలని కేంద్ర హోంశాఖ డిసెంబర్ 17న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విలీనంతో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 9 నుంచి 8కి తగ్గుతుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 జనవరి 26న డామన్, దాద్రానగర్ ఆవిర్భావ దినోత్సవం
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎవరు : కేంద్ర హోంశాఖ
ఎందుకు : డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ విలీన చట్టం 2020 జనవరి 26 నుంచి అమల్లోకి రానున్నందున

57వ నేషనల్ రోలర్ స్పోర్ట్స్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ సాగర తీరంలోని వుడా పార్క్ రింక్‌లో ఏర్పాటు చేసిన 57వ నేషనల్ రోలర్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్‌ను రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ డిసెంబర్ 19న ప్రారంభించారు.

Current Affairs

ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొంటున్న స్కేటర్లను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ క్రమశిక్షణ అనేది క్రీడల ద్వారా వస్తుందన్నారు. జాతీయ సమైక్యతను కాపాడాల్సిన బాధ్యత యువత చేతుల్లోనే ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తొలుత రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

పోలీస్ టెన్నిస్ చాంపియన్‌షిప్
విశాఖ వేదికగా 20వ ఆలిండియా పోలీస్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌ను గవర్నర్ విశ్వభూషణ్ డిసెంబర్ 19 ప్రారంభించారు. దేశంలోని 18 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 57వ నేషనల్ రోలర్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎవరు : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్

15వ ఆర్థిక సంఘం చైర్మన్‌తో ఏపీ సీఎం సమావేశం

15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కె.సింగ్, కార్యదర్శి అరవింద్ మెహతా, సభ్యులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర అధికారులు సమావేశమయ్యారు.

Current Affairs

అమరావతిలో డిసెంబర్ 19న జరిగిన ఈ భేటీలో ఆర్థిక సంఘానికి సీఎం జగన్ రాష్ట్ర పరిస్థితిని వివరించారు. రాష్ట్ర సామాజిక, ఆర్థిక, వ్యవసాయ, పారిశ్రామిక, సేవ, ఆరోగ్య, విద్యా, మౌలిక రంగాలపై అధికారులు సమగ్ర వివరాలు అందించారు. విభజన వల్ల దెబ్బతిన్న రాష్ట్రం అన్ని రంగాల్లో కోలుకోవాలంటే ఉదారంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో నిధులు అందేలా సిఫార్సులు చేయాలని కోరారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కె.సింగ్‌తో సమావేశం
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close