Current Affairs

కరెంటు అఫైర్స్ క్విజ్ | Telugu Current Affairs 2

Telugu Current Affairs 2

» ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి మధ్యశ్రేణి అణ్వస్త్ర దేశాల ఒడంబడిక (ఐఎన్‌ఎఫ్‌) నుంచి 2019 ఫిబ్రవరిలో ఏ దేశం వైదొలిగింది?
       1) అమెరికా          2) రష్యా            3) ఫ్రాన్స్‌          4) అమెరికా, రష్యా
జ: 4 (అమెరికా, రష్యా)
» తమ న్యాయస్థానాల్లో హిందీని తృతీయ అధికార భాషగా అమలు చేయనున్నట్లు 2019 ఫిబ్రవరిలో ఏ దేశ న్యాయశాఖ ప్రకటించింది?
జ: యూఏఈ 
» సౌదీ అరేబియా ఏ దేశంలో తొలిసారి తమ దేశ రాయబారిగా మహిళను (రాకుమారి రీమా బింత్‌ బందర్‌) నియమించింది?
జ: అమెరికా 
» 2019 ఫిబ్రవరి 24న ఏ దేశంలో కొత్తగా నిర్మించిన ఛాబహార్‌ నౌకాశ్రయం ద్వారా అఫ్గానిస్థాన్‌ నుంచి భారత్‌కు ఎగుమతులు ప్రారంభమయ్యాయి?
జ: ఇరాన్‌ 
» అణ్వాయుధాల తగ్గింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ల మధ్య 2019 ఫిబ్రవరి 27, 28 తేదీల్లో ఎక్కడ చర్చలు జరిగాయి?
జ: హనోయి 
» 2019 ఫిబ్రవరిలో మహ్మద్‌ బుహారి ఏ దేశాధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికయ్యారు?
జ: నైజీరియా 
» 2019 ఫిబ్రవరిలో నయిబ్‌ బుకేలే ఏ దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు?
జ: ఎల్‌ సాల్వడార్‌ 
» నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌ (నాటో)లో నూతన సభ్యదేశంగా మాసిడోనియా చేరింది. మాసిడోనియా నాటోలో ఎన్నో సభ్య దేశం?
జ: 30 
» ‘అమన్‌-2019’ పేరిట అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాలను ఎక్కడ నిర్వహించారు?
జ: కరాచీ 
» అమెరికా అటార్నీ జనరల్‌గా ఎవరు రెండోసారి నియమితులయ్యారు?
జ: విలియం బార్‌ 
» అంతర్జాతీయ సౌర కూటమిలో 73వ సభ్య దేశంగా చేరింది?
జ: సౌదీ అరేబియా 
» కృత్రిమ మేధతో పనిచేసే మొదటి మహిళా న్యూస్‌రీడర్‌ను ఏ దేశం రూపొందించింది?
జ: చైనా
» 16వ రష్యా-ఇండియా-చైనా (RIC) విదేశాంగ మంత్రుల సమావేశాన్ని 2019 ఫిబ్రవరిలో ఎక్కడ నిర్వహించారు?
జ: వూజెన్‌ 
» ప్రపంచ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత సదస్సు (WCSRC) 2019ని ఫిబ్రవరిలో ఎక్కడ నిర్వహించారు?
జ: ముంబయి 
» కిందివాటిలో ఏ దేశం ఆర్‌టీజీఎస్‌ డాలర్‌ పేరిట నూతన కరెన్సీని అమల్లోకి తెచ్చింది?
      1) ఇరాన్‌         2) దక్షిణ కొరియా           3) జింబాబ్వే       4) సోమాలియా
జ: 3 (జింబాబ్వే)
» థాయ్‌లాండ్‌ ఏ దేశంతో కలిసి ‘కోబ్రా గోల్డ్‌’ పేరిట సైనిక విన్యాసాలను నిర్వహించింది?
జ: అమెరికా 
» పర్యావరణ పరిశోధనల కోసం భారత ప్రభుత్వం ఏ దేశంలోని బ్రిటిష్‌ కొలంబియా విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుంది?
జ: కెనడా

ఇవి కూడా చదవండి:

Latest Telugu Current Affairs

Telugu GK

Govt jobs in Telugu

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close