Current Affairs

Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 19/12/2019

పాక్ మాజీ సైనికాధ్యక్షుడు ముషారఫ్‌కు మరణశిక్ష

సైనికాధ్యక్షుడిగా ఉంటూ సైనికపాలన విధించిన పాకిస్తాన్ మాజీ సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు పాకిస్తాన్ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది.

Current Affairs

రాజ్యాంగాన్ని తాత్కాలికంగా రద్దు చేసి, సైనిక పాలన విధించి తీవ్ర దేశద్రోహానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై కోర్టు మరణశిక్ష విధించింది. 1999లో తిరుగుబాటు ద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకొని, అధ్యక్షుడి స్థానాన్ని చేజిక్కించుకొని, నిరంకుశంగా పరిపాలించిన ముషారఫ్ దేశద్రోహ నేరానికి పాల్పడ్డారని కోర్టు అభిప్రాయపడింది. 2014లో ముషారఫ్‌పై ఈ కేసు నమోదైంది.

పెష్వార్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వక్వార్ అహ్మద్ సేథ్ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల స్పెషల్ కోర్టు పాకిస్తాన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి నందుకుగాను, రాజ్యాంగంలోని ఆర్టికల్ 6 ప్రకారం పర్వేజ్ ముషారఫ్‌ను దోషిగా ఉగ్రవాద నిరోధక ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. నవంబర్ 19న రిజర్వులో ఉంచిన తీర్పుని సింధ్ హైకోర్టు (ఎస్‌హెచ్‌సీ) జస్టిస్ నజర్ అక్బర్, లాహోర్ హై కోర్టు జస్టిస్ షాహీద్ కరీమ్‌ల బెంచ్ డిసెంబర్ 17న వెల్లడించింది.

2007లో ముషారఫ్ దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించి, సైనిక పాలన విధించారు. అత్యవసర పరిస్థితి విధించడంతో దేశంలో పౌరుల హక్కులు హరణకు గురయ్యాయి, మానవ హక్కులకు అర్థం లేకుండా పోయింది. సుప్రీంకోర్టు జడ్జీలనూ గృహ నిర్బంధంలో ఉంచారు. 2007 నవంబర్ నుంచి 2008 ఫిబ్రవరి వరకు పాకిస్తాన్‌లో అత్యవసర పరిస్థితి కారణంగా ఎటువంటి ప్రజాస్వామిక పాలనకు అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. 2008 సార్వత్రిక ఎన్నికల్లో ముషారఫ్ పాకిస్తాన్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత ముషారఫ్ విదేశాలకు పారిపోయాడు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 పాకిస్తాన్ మాజీ సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు మరణశిక్ష
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : పాకిస్తాన్ ప్రత్యేక కోర్టు
ఎందుకు : దేశద్రోహ నేరానికి పాల్పడ్డారని

జాతీయ బ్రాడ్ బ్యాండ్ మిషన్ ప్రారంభం

దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి 2022 కల్లా నాణ్యమైన బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం అందించేందుకు ఉద్దేశించిన ‘జాతీయ బ్రాడ్ బ్యాండ్ మిషన్’ ప్రారంభమైంది.

Current Affairs

న్యూఢిల్లీలో డిసెంబర్ 17న జరిగిన కార్యక్రమంలో కేంద్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ మిషన్‌ను ప్రారంభించారు. భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ఈ మిషన్ సాధనంగా ఉపయోగపడుతుందని మంత్రి రవిశంకర్ అభిప్రాయపడ్డారు.

జాతీయ బ్రాడ్ బ్యాండ్ మిషన్ లక్ష్యాలు

  • డిజిటల్ వ్యవస్థను మరింత వృద్ధి చేసేందుకు వీలుగా సమాచార వ్యవస్థ మౌలిక వసతులను త్వరితగతిన అభివృద్ధి చేయడం.
  • దేశవ్యాప్తంగా 30 లక్షల కిలోమీటర్ల పొడవున ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల ఏర్పాటు.
  • ప్రస్తుతం ప్రతి వెయి్యమంది జనాభాకు 0.42గా ఉన్న టవర్ల సాంద్రతను 2024 కల్లా ఒకటికి పెంచడం.
  • మొబైల్, అంతర్జాల సేవల నాణ్యతను గుణాత్మకంగా మెరుగుపరచడం.
  • దేశవ్యాప్తంగా ఆప్టికల్ ఫైబర్, టవర్ నెట్‌వర్క్‌ను గుర్తిస్తూ డిజిటల్ ఫైబర్ మ్యాప్‌ను రూపొందించడం.
  • భాగస్వామ్య సంస్థల ద్వారా రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టడం.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 జాతీయ బ్రాడ్ బ్యాండ్ మిషన్ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : కేంద్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి 2022 కల్లా నాణ్యమైన బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం అందించేందుకు

చైనాలో రెండో విమాన వాహకనౌక ప్రారంభం

దేశీయ పరిజ్ఞానంతో చైనా రూపొందించిన రెండో విమాన వాహకనౌక ‘షాన్దాంగ్’ సేవలు ప్రారంభమయ్యాయి.

Current Affairs

డిసెంబర్ 17న నిర్వహించిన కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ షాన్దాంగ్‌ను చైనా నౌకాదళానికి అప్పగించారు. దక్షిణ చైనా సముద్రతీరంలో ఈ విమాన వాహకనౌకను మోహరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 విమాన వాహకనౌక ‘షాన్దాంగ్’ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : చైనా ప్రభుత్వం
ఎక్కడ : చైనా

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close