Current Affairs
Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 16/12/2019
» ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ‘వర్డ్ ఆఫ్ ద ఇయర్ – 2018’గా దేన్ని ప్రకటించింది?
జ: టాక్సిక్
» 2019 జనవరి 1న జైర్ బొల్సొనారో ఏ దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు?
జ: బ్రెజిల్
» 2019 జనవరిలో తైవాన్ ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు?
జ: సు త్సెంగ్ చాంగ్
» హిందూ మత ప్రసిద్ధ క్షేత్రం ‘పంజ్ తీరథ్’ను జాతీయ వారసత్వ ప్రాంతంగా ప్రకటించిన దేశమేది?
జ: పాకిస్థాన్
» ప్రపంచంలోనే అతిపెద్ద విమానాల ఉత్పత్తిదారుగా వరుసగా ఏడోసారి నిలిచిన సంస్థ ఏది?
జ: బోయింగ్
» ఫుట్‌బాల్ క్రీడకు సంబంధించి ‘ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ – 2019’ను నిర్వహించిన దేశం ఏది?
జ: ఈజిప్ట్
» ఏ దేశానికి చెందిన జీఐపీసీ (గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్) ‘ఫెయిర్ వాల్యూ ఫర్ ఇన్నోవేషన్’ పేరిట సరికొత్త వాణిజ్య విధానాన్ని 2019 జనవరిలో ఆవిష్కరించింది?
జ: అమెరికా
» 2019 జనవరిలో ఫెలిక్స్ త్సిసెకెడి ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు?
జ: కాంగో
» భారత సైన్యానికి ఉండే ‘జనరల్’ హోదాను పొందిన నేపాల్ సైన్యాధిపతి ఎవరు?
జ: జనరల్ పూర్ణచంద్ర థాపా
» ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి మధ్యశ్రేణి అణ్వస్త్ర దేశాల ఒడంబడిక (ఐఎన్‌ఎఫ్) నుంచి 2019 ఫిబ్రవరిలో ఏ దేశం వైదొలిగింది?
1) అమెరికా 2) రష్యా 3) ఫ్రాన్స్ 4) అమెరికా, రష్యా
జ: 4 (అమెరికా, రష్యా)
» తమ న్యాయస్థానాల్లో హిందీని తృతీయ అధికార భాషగా అమలు చేయనున్నట్లు 2019 ఫిబ్రవరిలో ఏ దేశ న్యాయశాఖ ప్రకటించింది?
జ: యూఏఈ
» సౌదీ అరేబియా ఏ దేశంలో తొలిసారి తమ దేశ రాయబారిగా మహిళను (రాకుమారి రీమా బింత్ బందర్) నియమించింది?
జ: అమెరికా
» 2019 ఫిబ్రవరి 24న ఏ దేశంలో కొత్తగా నిర్మించిన ఛాబహార్ నౌకాశ్రయం ద్వారా అఫ్గానిస్థాన్ నుంచి భారత్‌కు ఎగుమతులు ప్రారంభమయ్యాయి?
జ: ఇరాన్
» అణ్వాయుధాల తగ్గింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య 2019 ఫిబ్రవరి 27, 28 తేదీల్లో ఎక్కడ చర్చలు జరిగాయి?
జ: హనోయి
» 2019 ఫిబ్రవరిలో మహ్మద్ బుహారి ఏ దేశాధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికయ్యారు?
జ: నైజీరియా
» 2019 ఫిబ్రవరిలో నయిబ్ బుకేలే ఏ దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు?
జ: ఎల్ సాల్వడార్
» నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)లో నూతన సభ్యదేశంగా మాసిడోనియా చేరింది. మాసిడోనియా నాటోలో ఎన్నో సభ్య దేశం?
జ: 30
» ‘అమన్-2019’ పేరిట అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాలను ఎక్కడ నిర్వహించారు?
జ: కరాచీ
» అమెరికా అటార్నీ జనరల్‌గా ఎవరు రెండోసారి నియమితులయ్యారు?
జ: విలియం బార్
» అంతర్జాతీయ సౌర కూటమిలో 73వ సభ్య దేశంగా చేరింది?
జ: సౌదీ అరేబియా
» కృత్రిమ మేధతో పనిచేసే మొదటి మహిళా న్యూస్‌రీడర్‌ను ఏ దేశం రూపొందించింది?
జ: చైనా
» 16వ రష్యా-ఇండియా-చైనా (RIC) విదేశాంగ మంత్రుల సమావేశాన్ని 2019 ఫిబ్రవరిలో ఎక్కడ నిర్వహించారు?
జ: వూజెన్
» ప్రపంచ కార్పొరేట్ సామాజిక బాధ్యత సదస్సు (WCSRC) 2019ని ఫిబ్రవరిలో ఎక్కడ నిర్వహించారు?
జ: ముంబయి
» కిందివాటిలో ఏ దేశం ఆర్‌టీజీఎస్ డాలర్ పేరిట నూతన కరెన్సీని అమల్లోకి తెచ్చింది?
1) ఇరాన్ 2) దక్షిణ కొరియా 3) జింబాబ్వే 4) సోమాలియా
జ: 3 (జింబాబ్వే)
» థాయ్‌లాండ్ ఏ దేశంతో కలిసి ‘కోబ్రా గోల్డ్’ పేరిట సైనిక విన్యాసాలను నిర్వహించింది?
జ: అమెరికా
» పర్యావరణ పరిశోధనల కోసం భారత ప్రభుత్వం ఏ దేశంలోని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుంది?
జ: కెనడా