Current Affairs

Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 15/12/2019

విశ్వనాథన్ ఆనంద్ పుస్తకం మైండ్‌మాస్టర్ విడుదల

భారత సూపర్ గ్రాండ్‌మాస్టర్, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ రచించిన ‘మైండ్ మాస్టర్’ పుస్తకం విడుదలైంది. తమిళనాడు రాజధాని చెన్నైలో డిసెంబర్ 13న జరిగిన కార్యక్రమంలో ది హిందు పబ్లిషింగ్ గ్రూప్ చైర్మన్ ఎన్.రామ్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

Current Affairs

ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ… ‘మీరు చెస్ రొమాంటిక్ అయితే ఈ ఆట అందాన్ని ఆస్వాదిస్తారు. ఈ కంప్యూటర్ల యుగంలోనూ చెస్ ఆట అనుభూతే వేరు. కంప్యూటర్లు కూడా అంతే అనంతమైన సాధ్యాల్ని సాకారం చేస్తాయి’ అని అన్నాడు. తన పుస్తకంలో చెస్ గడులతో పాటు కంప్యూటర్‌కూ చోటిచ్చానని పేర్కొన్నాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
 విశ్వనాథన్ ఆనంద్ రచించిన మైండ్ మాస్టర్పుస్తకం విడుదల
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : ది హిందు పబ్లిషింగ్ గ్రూప్ చైర్మన్ ఎన్.రామ్
ఎక్కడ : చెన్నై, తమిళనాడు

థాయ్ మసాజ్‌కు యునెస్కో గుర్తింపు

ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సంప్రదాయక ‘నువాద్ థాయ్’మసాజ్‌కు ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కింది.

Current Affairs

ఈ మేరకు యునెటైడ్ నేషన్స్ ఎకనమిక్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) డిసెంబర్ 13న థాయ్ మసాజ్‌ను వారసత్వ జాబితాలో చేర్చింది. నిజానికి ఈ మసాజ్ మూలాలు భారత్‌లోనే ఉన్నాయి. 2,500 ఏళ్ల క్రితమే ఈ విధానం భారత్ నుంచి థాయ్‌కు వచ్చిందని అక్కడి వారంటున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
 ‘నువాద్ థాయ్’మసాజ్‌కు ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : యునెటైడ్ నేషన్స్ ఎకనమిక్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో)

జపాన్ ప్రధాని భారత పర్యటన రద్దు

జపాన్ ప్రధాని షింజో ఆబే భారత పర్యటన రద్దయింది.

Current Affairs

పౌరసత్వ చట్టంపై ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న హింసాత్మక ఘటనల కారణంగా గువాహటి(అస్సాం)లో ప్రధాని నరేంద్ర మోదీతో 2019, డిసెంబర్ 15 నుంచి జరగాల్సిన భేటీ రద్దయినట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది.

రణరంగంగా జామియా వర్సిటీ
పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో డిసెంబర్ 13న నిరసన ప్రదర్శనలు జరిగాయి. అయితే, గత రెండు రోజులతో పోలిస్తే.. అస్సాం సహా ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు కొంత తగ్గుముఖం పట్టాయి. కానీ ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌ల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీలోని జామియా మిలియా విశ్వవిద్యాలయం రణరంగంగా మారింది.

చదవండి : పౌరసత్వ చట్టం-అంశాలు

క్విక్ రివ్యూ :
ఏమిటి
 : జపాన్ ప్రధాని షింజో ఆబే భారత పర్యటన రద్దు
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎందుకు : పౌరసత్వ చట్టంపై ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న హింసాత్మక ఘటనల కారణంగా

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close