Current Affairs

Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 14/12/2019

అయోధ్య భూవివాదంపై రివ్యూ పిటిషన్ల కొట్టివేత

అయోధ్యలోని రామ జన్మభూమి – బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సుప్రీంకోర్టు నవంబర్ 9న వెలువరించిన చారిత్రక తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లన్నిటినీ డిసెంబర్ 12న సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Current Affairs

తీర్పు సమీక్ష కోరుతూ దాఖలైన మొత్తం 19 పిటిషన్లకు ఎలాంటి విచారణార్హత లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ఈ ధర్మాసనం స్పష్టం చేసింది.

మొత్తం 19 పిటిషన్లలో 10 పిటిషన్లు వాస్తవ కక్షిదారులవి కాగా, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, దాని మద్దతుతో వేసినవి 8, హక్కుల కార్యకర్తలు 40 మంది కలిసి వేసిన మరో పిటిషన్ ఉన్నాయి. వీటితోపాటు అఖిల భారత హిందూ మహాసభ వేసిన పిటిషన్, నిర్మోహి అఖాడా వేసిన రివ్యూ పిటిషన్ కూడా తిరస్కరణకు గురయ్యాయి.

ఆఖరి చాన్స్ ‘క్యూరేటివ్’
అన్ని రివ్యూ పిటిషన్లు సుప్రీంకోర్టు తిరస్కరణకు గురికావడంతో కక్షిదారులకు ఇక ఒకే ఒక్క అవకాశం మిగిలి ఉంది. అదే క్యూరేటివ్ పిటిషన్. తీర్పులో ఏవైనా లోపాలున్నాయని అత్యున్నత న్యాయస్థానం భావించిన పక్షంలో వాటిని సవరించేందుకు క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరిస్తుంది. పునస్సమీక్షకు తగిన ఆధారాలున్నాయని న్యాయస్థానం భావించినా, విచారణ చేపట్టేందుకు అవకాశం ఉంటుంది.

వరంగల్ జౌళి పార్కులో యంగ్వన్ పరిశ్రమ

వరంగల్‌లోని మెగా జౌళి పార్కులో రూ. 900 కోట్ల పెట్టుబడులతో యంగ్వన్ కార్పొరేషన్ పరిశ్రమను స్థాపించనుంది.

Current Affairs

ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో డిసెంబర్ 11న అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ పరిశ్రమకు 290 ఎకరాల భూకేటాయింపు పత్రాలను మంత్రులు ఆ సంస్థ ప్రతినిధులకు అందజేశారు. వరంగల్‌లో ఏర్పాటు చేసే పరిశ్రమ ద్వారా 12 వేల మందికి ఉపాధి కల్పిస్తామని యంగ్వన్ తెలిపింది.
 క్విక్ రివ్యూ   :
 ఏమిటి
 : రూ. 900 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమ స్థాపన
 ఎప్పుడు  : డిసెంబర్ 11
 ఎవరు  : యంగ్వన్ కార్పొరేషన్
 ఎక్కడ  : వరంగల్‌లోని మెగా జౌళి పార్కు

డబ్ల్యూటీఏ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా బార్టీ

డబ్ల్యూటీఏ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్-2019గా ఆస్ట్రేలియాకి చెందిన యాష్లే బార్టీ ఎంపికైంది. ఈ విషయాన్ని ప్రపంచ మహిళల టెన్నిస్ సమాఖ్య(డబ్ల్యూటీఏ) డిసెంబర్ 12న ప్రకటించింది.

Current Affairs

 2019 ఏడాదిలో మొత్తం నాలుగు టైటిల్స్ నెగ్గిన బార్టీ, ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచి కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ దక్కించుకుంది. అనంతరం టెన్నిస్ ముగింపు సీజన్ టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లోనూ విజయకేతనం ఎగురవేసింది. తద్వారా మహిళల విభాగంలో నెం.1గా అవతరించింది. ప్రస్తుతం బార్టీ ఖాతాలో 7851 పాయింట్లు ఉన్నాయి. రెండో ర్యాంకులో ఉన్న కరోలినా ప్లిస్కోవా(చెక్ రిపబ్లక్) ఖాతాలో 5940 పాయింట్లు ఉన్నాయి.
 
 కోచ్ ఆఫ్ ది ఇయర్‌గా టైజర్

 డబ్ల్యూటీఏ కోచ్ ఆఫ్ ది ఇయర్-2019గా యాష్లే బార్టీ కోచ్ క్రెయిగ్ టైజర్ ఎంపికయ్యాడు. అలాగే న్యూకమర్ ఆఫ్ ది ఇయర్-2019గా కెనడా టీనేజర్, యూఎస్ ఓపెన్ చాంపి యన్ బియాంకా ఆండ్రీస్కూ ఎంపికైంది. మోస్ట్ ఇంప్రూవ్‌‌డ ప్లేయర్‌గా సోషియా కెనిన్(అమెరికా), కమ్ బ్యాక్ ప్లేయర్‌గా బెలిందా బెనిసిచ్ (స్విట్జర్లాండ్), అత్యుత్తమ డబుల్స్ జంటగా టిమియా బాబోస్- క్రిస్టినా మాల్దె నోవిచ్ ఎంపికయ్యారు.

 క్విక్ రివ్యూ   :
 ఏమిటి :
 డబ్ల్యూటీఏ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్-2019గా ఎంపిక
 ఎప్పుడు  : డిసెంబర్ 12
 ఎవరు  : యాష్లే బార్టీ

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close