Current Affairs

Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 13/01/2020

ప్రాన్స్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ సంభాషణ

ప్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో సంభాషించారని భారత ప్రధానమంత్రి కార్యాలయం జనవరి 10న తెలిపింది.

Current Affairs

ఈ ఫోన్ కాల్‌లో పలు ద్వైపాక్షిక, జాతీయ, అంతర్జాతీయ అంశాలు చర్చకు వచ్చినట్లు వెల్లడించింది. భారత్-ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడేలా చేసేందుకు కట్టుబడి ఉన్నామని మోదీ చెప్పినట్లు పేర్కొంది. రక్షణ రంగం, పౌర అణుశక్తి, మెరైన్ భద్రత వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం పెంచుకునేందుకు వారు అంగీకరించినట్లు తెలిపింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్‌తో ఫోన్‌లో సంభాషణ
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : ద్వైపాక్షిక, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించేందుకు

మాదిరి ప్రశ్నలు

1. ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1. మార్చి 15
2. జనవరి 11
3. జనవరి 10
4. ఏప్రిల్ 11

2. ఎనిమిది అత్యంత అభివృద్ధి చెందిన దేశాల కూటమి జీ-8లో సభ్యత్వంలో లేని దేశాన్ని గుర్తించండి?
1. ఫ్రాన్స్
2. జర్మనీ
3. ఆస్ట్రియా
4. కెనడా

పౌరసత్వ సవరణ చట్టం 2019 అమలు

పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే ‘పౌరసత్వ సవరణ చట్టం-2019 2020, జనవరి 10న అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని కేంద్రప్రభుత్వం ప్రకటించింది.

Current Affairs

పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మత వివక్ష ఎదుర్కొని భారత్‌కు శరణార్ధులుగా వచ్చిన హిందూ, సిఖ్, జైన్, పార్శీ, క్రిస్టియన్, బౌద్ధ మతస్తులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ చట్టాన్ని రూపొందించారు.

దేశవ్యాప్తంగా ఆందోళనలు
పౌరసత్వ సవరణ బిల్లు-2019కు 2019, డిసెంబర్ 12న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. దాంతో ఈ బిల్లు పౌరసత్వ (సవరణ) చట్టంగా మారింది. అయితే, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉద్యమం కొనసాగుతోంది. మత ప్రాతిపదికన పౌరసత్వాన్ని కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని, ఈ చట్టంలో ముస్లింల పట్ల వివక్ష ఉందని పేర్కొంటూ ఆందోళనలు జరుగుతున్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి
 : పౌరసత్వ సవరణ చట్టం 2019 అమలు
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు

మాదిరి ప్రశ్నలు

1. పౌరసత్వ సవరణ చట్టం 2019 ప్రకారం ఏ దేశాల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పిస్తారు?
1. పాకిస్తాన్, మయన్మార్, మాల్దీవులు
2. బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, మయన్మార్
3. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్
4. పాకిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్

2. ప్రఖ్యాత భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త హర్ గోవింద్ ఖొరానా పేరుతో పరిశోధక విభాగాన్ని(రీసెర్చ్ చైర్) ఏర్పాటు చేయనున్నట్లు 2020, జనవరి 9న ఏ యూనివర్సిటీ ప్రక‌టించింది?
1. మహర్షి దయానంద్ యూనివర్సిటీ(హర్యానా)
2. లాహోర్ గవర్నమెంట్ కాలేజ్ యూనివర్సిటీ(జీసీయూ)
3. యూనివర్శిటీ ఆఫ్ పంజాబ్(లాహోర్)
4. ఆగాఖాన్ యూనివర్శిటీ(కరాచి)

ఖతర్ ఓపెన్ టోర్ని విజేతగా బోపన్న జంట

ఖతర్ ఓపెన్ ఏటీపీ-250 టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)-వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్) ద్వయం విజేతగా నిలిచింది.

Current Affairs

ఖతర్ రాజధాని దోహాలో జనవరి 10న జరిగిన డబుల్స్ ఫైనల్లో బోపన్న-కూలాఫ్ జంట 3-6, 6-2, 10-6తో ‘సూపర్ టైబ్రేక్’లో ల్యూక్ బామ్‌బ్రిడ్‌‌జ (ఇంగ్లండ్)-శాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో) జోడీని ఓడించింది. టైటిల్ నెగ్గిన బోపన్న జంటకు 76,870 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 54 లక్షల 50 వేలు)తోపాటు 250 ఏటీపీ ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఓవరాల్‌గా 39 ఏళ్ల బోపన్నకు కెరీర్‌లో ఇది 19వ డబుల్స్ టైటిల్.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఖతర్ ఓపెన్ ఏటీపీ-250 టోర్ని డబుల్స్ టైటిల్ విజేత
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : రోహన్ బోపన్న (భారత్)-వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)
ఎక్కడ : దోహా, ఖతర్

మాదిరి ప్రశ్నలు

1. ఐపీఎల్ 2020 ప్రారంభ మ్యాచ్ ఏ నగరంలో జరగనుంది?
1. కోల్‌కతా
2. ముంబై
3. బెంగళూరు
4. న్యూఢిల్లీ

2. బ్యాడ్మింటన్ చరిత్రలో ఒకే ఏడాది అత్యధికంగా 11 టైటిల్‌లు గెలిచిన షట్లర్?
1. లిన్‌డాన్
2. శ్రీకాంత్ కిదాంబి
3. గోపీ చంద్
4. కెంటో మొమోటా

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close