Uncategorized
Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 12/12/2019
గోల్డెన్ ట్వీట్‌గా సబ్ కా సాత్.. సబ్‌కా వికాస్
2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ ‘సబ్ కా సాత్.. సబ్‌కా వికాస్’ గోల్డెన్ ట్వీట్ ఆఫ్ 2019గా నిలిచింది.
ఈ విషయాన్ని ట్విటర్ డిసెంబర్ 1న అధికారికంగా ప్రకటించింది. భారత్‌లో అత్యంత ఎక్కువ సార్లు (1.17 లక్షలు) రీట్వీట్, అత్యంత ఎక్కువ లైక్ (4.2 లక్షలు)లు సాధించిన ట్వీట్ ఇదేనని తెలిపింది. ఈ ట్వీట్‌లో మోదీ ‘సబ్‌కా సాథ్ + సబ్‌కా వికాస్ + సబ్‌కా విశ్వాస్ = విజయీ భారత్. మళ్లీ గెలిచాం అందరం కలిసి దృడమైన సమగ్రమైన భారతావనిని నిర్మిద్దాం’ అని పేర్కొన్నారు.
మోదీ ట్వీట్ తర్వాత ధోనీ పుట్టిన రోజు సందర్భంగా విరాట్ కోహ్లి పోస్ట్ చేసిన ట్వీట్ రెండో స్థానంలో నిలిచింది. ఈ ట్వీట్ 45 వేల సార్లు రీట్వీట్ కాగా, 4.12లక్షల లైక్‌లను అందుకుంది. ఇక ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా క్రీడా విభాగంలో అత్యధికమంది లైక్, రీట్వీట్ చేసింది కోహ్లి ట్వీట్ కావడం విశేషం. 2019లో ‘లోక్‌సభ ఎలక్షన్‌స 2019’, ‘చంద్రయాన్-2’, ‘సీడబ్ల్యూసీ-19’, ‘పుల్వామా’, ‘ఆర్టికల్-370’ అనే హాష్‌టాగ్‌లపై ఎక్కువ ట్వీట్లు నమోదైనట్లు ట్విటర్ తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వంతో స్విట్జర్లాండ్ ఒప్పందం
హైదరాబాద్‌లో జరగనున్న ‘బయో ఆసియా 2020’ సదస్సు నిర్వహణలో భాగస్వామ్యం వహించేందుకు స్విట్జర్లాండ్ ముందుకొచ్చింది. దీనికి సంబంధించి డిసెంబర్ 10న తెలంగాణ ప్రభుత్వంతో స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ భాగస్వామ్య ఒప్పందంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు సమక్షంలో స్విట్జర్లాండ్ కాన్సులేట్ జనరల్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకాలు చేశారు. స్విట్జర్లాండ్ డిప్యూటీ కాన్సుల్ జనరల్ సిల్వానా రెంగ్లి ఫ్రే, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ ఒప్పందం సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సుమారు వంద దేశాల నుంచి లైఫ్ సెన్సైస్ దిగ్గజాలను ఆకర్షించడంలో బయో ఆసియా 2020 సదస్సు కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సదస్సు నిర్వహణలో స్విట్జర్లాండ్ భాగస్వామ్యం ద్వారా అక్కడి కంపెనీలు, ప్రభుత్వంతో బహుముఖ సంబంధాలు ఏర్పడతాయని వ్యాఖ్యానించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం
ఎప్పుడు : డిసెంబర్ 10
ఎవరు : స్విట్జర్లాండ్ ప్రభుత్వం
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : బయో ఆసియా 2020 సదస్సు నిర్వహణలో భాగస్వామ్యం వహించేందుకు
అభిజిత్ బెనర్జీకి ఆర్థిక శాస్త్ర నోబెల్ ప్రదానం
భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీకి స్వీడన్ రాజు కార్ల్-16 గుస్తాఫ్ 2019 ఏడాదికి ఆర్థిక శాస్త్ర నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు.
స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో డిసెంబర్ 10న పురస్కార ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బెనర్జీ భార్య ఎస్తేర్ డఫ్లో సైతం ఈ విభాగంలోనే నోబెల్‌ను అందుకున్నారు. అవార్డు ప్రదాన కార్యక్రమంలో దంపతులిద్దరూ భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్నారు.
2019 ఏడాదికి గానూ ఆర్థిక నోబెల్ పురస్కారాన్ని ముగ్గురికి ప్రకటించారు. అభిజిత్, ఆయన భార్య ఎస్తర్ డఫ్లో, మరో అమెరికన్ ఆర్థికవేత్త మైకేల్ క్రెమెర్‌లను సంయుక్తంగా ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించడానికి వినూత్న కోణంలో పరిశోధనలు చేసి ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పుల్ని తెచ్చినందుకు ఈ ముగ్గిరికి ఆర్థిక నోబెల్ దక్కింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అభిజిత్ బెనర్జీకి ఆర్థిక శాస్త్ర నోబెల్ ప్రదానం
ఎప్పుడు : డిసెంబర్ 10
ఎవరు : స్వీడన్ రాజు కార్ల్-16 గుస్తాఫ్
ఎక్కడ : స్టాక్‌హోమ్, స్వీడన్