Current Affairs

Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 11/12/2019

రష్యాపై నాలుగేళ్ల నిషేధం విధించిన వాడా

వ్యవస్థీకృత డోపింగ్ కారణంగా… ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) రష్యాపై నాలుగేళ్ల పాటు నిషేధం విధించింది. స్విట్జర్లాండ్‌లోని లాసాన్నెలో డిసెంబర్ 9న జరిగిన సమావేశంలో వాడా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నది.

Current Affairs

ఈ చర్యతో రష్యా క్రీడా సమాజం తీవ్రంగా నష్టపోనుంది. 2020 పారాలింపిక్స్, 2022 యూత్ ఒలింపిక్స్, 2022లో బీజింగ్ ఆతిథ్యమివ్వనున్న వింటర్ ఒలింపిక్స్‌లో రష్యా జట్లేవీ బరిలోకి దిగవు. వచ్చే నాలుగేళ్లలో ఆ దేశం అంతర్జాతీయ క్రీడా పోటీల ఆతిథ్యానికి కూడా పనికిరాదు. అరుుతే 2020లో సెరుుంట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగే యురో చాంపియన్ షిప్‌లో రష్యా పాల్గొనవచ్చు. నిషేధంపై అప్పిల్ చేసుకునేందుకు రష్యాకు 21 రోజుల నిర్ణరుుంచారు.

స్వతంత్ర హోదాలో…
డోపింగ్ మచ్చలేని రష్యా క్రీడాకారులకు ‘వాడా’ కాస్త వెసులుబాటు ఇచ్చింది. వారు స్వతంత్ర హోదాలో (అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ పతాకం కింద) పాల్గొనవచ్చని తెలిపింది. స్వతంత్ర హోదాలో పాల్గొనే రష్యా అథ్లెట్లు పతకాలు గెలిచినా అవి రష్యా ఖాతాలోకి రావు. 2018లో జరిగిన వింటర్ ఒలింపిక్స్‌లో సుమారు 168 మంది రష్యా అథ్లెట్లు తటస్థ జెండాపై పోటీలో దిగారు. 2015 నుంచి అథ్లెటిక్స్‌లో రష్యా ప్లేయర్లపై నిషేధం ఉన్నది.

టాప్-5లో…
రష్యా తొలిసారిగా ఒలింపిక్స్ బరిలో దిగింది 1996లో! అట్లాంటా (అమెరికా) ఆతిథ్యమిచ్చిన సమ్మర్ ఒలింపిక్స్ నుంచి గత ‘రియో’లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ వరకు రష్యా పతకాల పట్టికలో ‘టాప్-5’లోనే నిలిచింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
 రష్యాపై నాలుగేళ్ల నిషేధం
ఎప్పుడు : డిసెంబర్ 9
ఎవరు : ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా)
ఎందుకు : వ్యవస్థీకృత డోపింగ్ కారణంగా

డోపింగ్ నిరోధక వ్యవస్థ ప్రచారకర్తగా సునీల్ శెట్టి

జాతీయ డోపింగ్ నిరోధక వ్యవస్థ (నాడా) ప్రచారకర్తగా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ప్రచారకర్తగా వ్యవహరించనున్నాడు.

Current Affairs

‘క్రీడల్లో డోపింగ్‌ను దూరం చేసే చర్యల్లో భాగంగా సునీల్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేశాం. అంతేకాకుండా తాజా అథ్లెట్లు వివిధ టోర్నీల్లో బిజీగా ఉండడంతో ప్రచారానికి తగిన సమయం కేటారుుంచలేరు’ అని నాడా డిసెంబర్ 9న తెలిపింది. 2019 ఏడాది జాతీయ డోపింగ్ నిరోధక లేబొరేటరీపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో అథ్లెట్ల డోప్ నమూనాలను నాడా భారత్ వెలుపల పరీక్షిస్తోంది. 2019 ఏడాదే 150 మందికి పైగా అథ్లెట్లు డోపింగ్‌లో దొరికిపోరుున సంగతి తెలిసిందే. అందులో బాడీబిల్డర్లు 1/3 వంతు ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి
 : జాతీయ డోపింగ్ నిరోధక వ్యవస్థ (నాడా) ప్రచారకర్తగా ఎంపిక
ఎప్పుడు : డిసెంబర్ 9
ఎవరు : బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి
ఎందుకు : క్రీడల్లో డోపింగ్‌ను దూరం చేసే చర్యల్లో భాగంగా

దేశంలో అత్యంత ధనిక రియల్టర్‌గా లోధా

దేశంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో అత్యంత ధనికుడిగా మాక్రోటెక్ డెవలపర్స్ (గతంలో లోధా డెవలపర్స్) అధినేత మంగళ్ ప్రభాత్ లోధా నిలిచారు. డిసెంబర్ 9న విడుదలైన ‘హురున్- గ్రోహే ఇండియా ద రియల్ ఎస్టేట్ రిచ్ లిస్ట్- 2019’ నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

Current Affairs

ఈ నివేదికలో రూ.31,960 కోట్ల సంపదతో లోధా అగ్రస్థానంలో ఉండగా… రూ. 25,080 కోట్లతో డీఎల్‌ఎఫ్ అధినేత రాజీవ్ సింగ్ రెండోస్థానంలో ఉన్నారు.

రియల్ ఎస్టేట్ రిచ్ లిస్ట్- 2019 విశేషాలు

  • గతేడాదితో పోలిస్తే లోధా కుటుంబ సంపద 18 శాతం వృద్ధి చెందింది. 100 మందితో కూడిన ఈ జాబితాలో మిగతా 99 మంది రియల్టీ టైకూన్స్ సంపదలో లోధా కుటుంబ సంపద వాటా 12 శాతంగా ఉంది.
  • దేశంలో అగ్రస్థానంలో ఉన్న 100 మంది రియల్టీ టైకూన్స్ సంపద విలువ రూ.2,77,080 కోట్లుగా అంచనా. గతేడాదితో పోలిస్తే ఇది 17 శాతం వృద్ధి చెందింది. ఈ వంద మంది జాబితాలో 37 మంది ముంబైవాసులే. ఢిల్లీలో 19 మంది, బెంగళూరులో 19 మంది ఉన్నారు.
  • ఈ పారిశ్రామికవేత్తల సగటు వయసు 59 ఏళ్లు. ఆరుగురు మాత్రం 40 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారు. ముగ్గురు 80 ఏళ్లు పైబడిన వారు.
  • ఈ జాబితాలో తొలిసారి 8 మంది మహిళలకు స్థానం దక్కింది. గోద్రెజ్ ప్రాపర్టీస్ స్మిత వీ స్రిశ్న మహిళల్లో టాప్‌లో ఉండగా.. మొత్తం జాబితాలో 14వ స్థానంలో నిలిచారు. ఈమె సంపద రూ.3,560 కోట్లు.

యంగ్ టైకూన్స్
దేశంలోనే యువ ధనిక రియల్టీ టైకూన్స్గా హైదరాబాద్‌లోని మై హోమ్ గ్రూప్‌నకు చెందిన జూపల్లి రామురావు, జూపల్లి శ్యామ్‌రావు చోటు దక్కించుకున్నారు. వీళ్ల వయస్సు 33 ఏళ్లు. వీరి సంపద విలువ రూ.740 కోట్లు. ఈస్ట్ ఇండియా హోటల్స్‌కు చెందిన పృథ్వీరాజ్ సింగ్ ఒబెరాయ్… వృద్ధ రియల్టీ టైకూన్‌గా నిలిచారు. ఈయన వయస్సు 90 ఏళ్లు. ఈయన సంపద రూ.3,670 కోట్లు.

ర్యాంకు కంపెనీ పేరు సంపద (రూ.కోట్లలో)
1 మాక్రోటెక్‌ డెవలపర్స్‌ ఎంపీ లోధా 31,960
2 డీఎల్‌ఎఫ్‌ రాజీవ్‌ సింగ్‌ 25,080
       
3 ఎంబసీ గ్రూప్‌ జితేంద్ర విర్వాణీ 24,750
4 హిరానందానీ గ్రూప్‌ నిరంజ‌న్ హిరానందానీ 17,030
5 కె రహేజా గ్రూప్‌ చంద్రు రహేజా 15,480
6 ఒబెరాయ్‌ రియ‌ల్టీ వికాస్‌ ఒబెరాయ్‌ 13,910
7 బాగ్మనీ డెవలపర్స్‌ రాజా బాగ్మనీ 9,960
8 హిరానందానీ సింగపూర్‌ సురేంద్ర హిరానందానీ 9,720
9 రున్వాల్‌ డెవలపర్స్‌ సుభాష్‌ రున్వాల్‌ 7,100
10 పిరమల్‌ రియల్టీ అజయ్‌ పిరమల్‌ 6,560

క్విక్ రివ్యూ :
ఏమిటి
 : దేశంలో అత్యంత ధనిక రియల్టర్‌గా మంగళ్ ప్రభాత్ లోధా
ఎప్పుడు : డిసెంబర్ 9
ఎవరు : హురున్- గ్రోహే ఇండియా ద రియల్ ఎస్టేట్ రిచ్ లిస్ట్- 2019
ఎక్కడ : దేశంలో

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close