Current Affairs

Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 11/01/2020

హర్ గోవింద్ ఖొరానా పరిశోధక విభాగం ఏర్పాటు

ప్రఖ్యాత భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త హర్ గోవింద్ ఖొరానా పేరుతో పాకిస్తాన్‌లో పరిశోధక విభాగం ఏర్పాటుకానుంది.

Current Affairs

ఖొరానా పేరిట ప్రత్యేక పరిశోధక విభాగాన్ని(రీసెర్చ్ చైర్) ఏర్పాటు చేయనున్నట్లు లాహోర్‌లోని గవర్నమెంట్ కాలేజ్ యూనివర్సిటీ(జీసీయూ) జనవరి 9న ప్రకటించింది. ఖొరానా 1922లో అవిభక్త భారత్‌లోని రాయ్‌పుర్ గ్రామం (ప్రస్తుతం పాక్‌లో ఉంది)లో జన్మించారు. 1968లో వైద్యరంగంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 హర్ గోవింద్ ఖొరానా పేరుతో ప్రత్యేక పరిశోధక విభాగం ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : లాహోర్ గవర్నమెంట్ కాలేజ్ యూనివర్సిటీ(జీసీయూ)
ఎక్కడ : జీసీయూ, లాహోర్, పాకిస్తాన్

మాదిరి ప్రశ్నలు

1. ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం 2019 ఏడాదికి గాను ఎవరు అందుకున్నారు?
1. సర్ పీటర్ రాట్‌క్లిఫ్
2. అబీ అహ్మద్ అలీ
3. విలియం కేలిన్
4. గ్రెగ్ సెమెంజా

2. సాహితీ రంగంలో 2019 సంవత్సరానికి గాను నోబెల్ పురస్కారం ఎవరిని వరించింది?
1. పీటర్ హండ్కే
2. థామస్ మన్
3. జాన్ గ్లాస్‌వొర్తి
4. నదినే గార్డిమర్

జగనన్న అమ్మఒడి పథకం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు ఉద్దేశించిన ‘జగనన్న అమ్మఒడి’ పథకం ప్రారంభమైంది.

Current Affairs

చిత్తూరులో జనవరి 9న నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రైవేటు జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఈ పథకం వర్తిస్తుంది.

అమ్మఒడి ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ… రాష్ట్రంలో అమ్మఒడి పథకం ద్వారా చదువుల విప్లవానికి శ్రీకారం చుట్టామని అన్నారు. పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని చెప్పారు. 14 ఏళ్ల లోపు పిల్లలకు విద్య ప్రాథమిక హక్కు అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ఏ పేర్కొన్నప్పటికీ, పేదరికం కారణంగా చాలా మందికి పిల్లలను చదివించే పరిస్థితి లేదన్నారు. ఇలాంటి పేదింటి తల్లులు, పిల్లలకు అండగా ఉండేందుకే అమ్మఒడిని తీసుకొచ్చామన్నారు.

ముఖ్యమంత్రి ప్రసంగం-ముఖ్యాంశాలు

  • అమ్మఒడి పథకం కింద దాదాపు 42,12,186 లక్షల మంది తల్లులు, 81,72,224 లక్షల మంది పిల్లలకు మేలు చేకూరుతుంది.
  • ఈ పథకానికి రూ.6,456 కోట్లు కేటాయించాం.
  • ఈ పథకంలో విద్యార్థికి 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి. ఈ ఏడాది మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి 75 శాతం హాజరు తప్పనిసరి.
  • రాబోయే జూన్‌లో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి చేశాం.
  • విద్యార్థులకు మంచి చదువుతోపాటు పౌష్టికాహారం కూడా ముఖ్యమే. అందుకే మధ్యాహ్న భోజనం మెనూలో మార్పు తేవాలని సంకల్పించాం. సంక్రాంతి సెలవుల తర్వాత నుంచి కొత్త మెనూ అమలు చేస్తాం.
  • మెనూ మార్పు ద్వారా దాదాపు రూ.200 కోట్లు అదనపు భారం పడుతుంది.
  • రాష్ట్రంలో చదువుల విప్లవం కోసం 45 వేల పాఠశాలు, 471 జూనియర్ కళాశాలలు, 3,287 హాస్టళ్లు, 148 డిగ్రీ కళాశాలల్లో నాడు-నేడు ద్వారా మార్పు తెస్తాం.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 జగనన్న అమ్మఒడి పథకం ప్రారంభం
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : చిత్తూరు, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌లో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు

మాదిరి ప్రశ్నలు

1. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1. 2019, ఆగస్టు 15
2. 2019, అక్టోబర్ 2
3. 2019, అక్టోబర్ 15
4. 2019, సెప్టెంబర్ 8

2. కేంద్రప్రభుత్వం 2019, డిసెంబర్ 25న విడుదల చేసిన ‘జాతీయ సుపరిపాలన సూచీ(జీజీఐ)’లో 18 పెద్ద రాష్ట్రాల విభాగంలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. తమిళనాడు
4. కర్ణాటక

జమ్మూకశ్మీర్‌లో 15 దేశాల రాయబారులు

కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ సహా భారత్‌లోని 15 దేశాల రాయబారులు జనవరి 9న పర్యటించారు.

Current Affairs

బంగ్లాదేశ్, వియత్నాం, నార్వే, మాల్దీవ్‌‌స, దక్షిణ కొరియా, మొరాకొ, నైజీరియా తదితర దేశాల రాయబారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితిని క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కొందరు రాజకీయ నేతలు, సైన్యాధికారులు, పౌరసమాజ ప్రతినిధులతో వారు సమావేశమయ్యారు. వారికి లెఫ్ట్‌నెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ కశ్మీర్ పరిస్థితులను వివరించారు.

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లదాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడం తెల్సిందే.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 భారత్‌లోని 15 దేశాల రాయబారులుపర్యటన
ఎప్పుడు : జనవరి 9
ఎక్కడ : జమ్మూకశ్మీర్
ఎందుకు : జమ్మూకశ్మీర్‌లో పరిస్థితిని క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించేందుకు

మాదిరి ప్రశ్నలు

1. కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ తొలి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
1. కేజేఎస్ ధిల్లాన్
2. గిరిశ్ చంద్ర ముర్ము
3. వికాస్ స్వరూప్
4. శ్రీనివాస్ సిన్హా

2. ప్రసుతం లధాఖ్ గవర్నర్‌గా ఎవరు ఉన్నారు?
1. జలంధర్ జోషి
2. రామకృష్ణ మాథుర్
3. రాధాకృష్ణ మాథుర్
4. వినీత్ జోషి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close