Current Affairs

Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 10/12/2019

విశ్వసుందరిగా జోజిబినీ తుంజీ

విశ్వసుందరి(మిస్ యూనివర్స్)-2019గా దక్షిణాఫ్రికాలోని సోలో పట్టణానికి చెందిన జోజిబినీ తుంజీ ఎంపికయ్యారు. అమెరికాలోని జార్జియా రాజధాని అట్లాంటాలో ఉన్న టైలర్ పెర్రీ స్టూడియోస్‌లో డిసెంబర్ 8న జరిగిన అందాల పోటీల్లో 26 ఏళ్ల తుంజీని విజేతగా ప్రకటించారు.

Current Affairs

అనంతరం మిస్ యూనివర్స్-2018 కాట్రియోనా గ్రే(ఫిలిప్పైన్‌‌స) తుంజీకి విశ్వ సుందరి కిరీటం అలంకరించింది. ఈ సందర్భంగా తుంజీ మాట్లాడుతూ.. ‘నా రంగు, నా జుట్టును చూసి ఎవరూ అందంగా ఉందని అనరు. అలాంటి ప్రపంచంలో నేను పెరిగాను. ఇక అలాంటి వివక్షకు ముగింపు పలికే సమయం ఇదే అని నేను భావిస్తున్నా’ అని ఉద్వేగానికి లోనయ్యారు. లింగ ఆధారిత వివక్ష, హింసకు వ్యతిరేకంగా తుంజీ పోరాటం చేస్తున్నారు.

మొత్తం 90 మంది పాల్గొన్న ఈ అందాల పోటీలకు పాపులర్ టీవీ పర్సనాలిటీ స్టీవ్ హార్వే హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ పోటిల్లో మిస్ యూనివర్స్ మెక్సికో సోఫియా ఆరాగన్, మిస్ యూనివర్స్ ప్యూర్టోరికా మాడిసన్ అండెర్సన్ రన్నరప్‌లుగా నిలిచారు. భారత్‌కు చెందిన వర్తికా సింగ్ టాప్ 20లో కూడా చోటు దక్కించుకోలేకపోయారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి
 : విశ్వసుందరి(మిస్ యూనివర్స్)-2019గా ఎంపిక
ఎప్పుడు : డిసెంబర్ 8
ఎవరు : జోజిబినీ తుంజీ
ఎక్కడ : అట్లాంటా, జార్జియా, అమెరికా

డీజీపీల జాతీయ సదస్సులో ప్రధాని మోదీ

మహారాష్ట్రలోని పుణెలో జరుగుతున్న 54వ డీజీపీ, ఐజీపీల జాతీయ సదస్సులో డిసెంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.

Current Affairs

ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ… పోలీసుల గౌరవాన్ని పెంచేలా అధికారులు కృషి చేయాలని, సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు..ముఖ్యంగా మహిళలు, చిన్నారుల భద్రతపై విశ్వాసం పెంచాలని కోరారు. దేశ అవసరాలకు అనుగుణంగా చట్టాలను మార్చేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

మరోవైపు పుణేలోని రాజ్‌భవన్‌లో డిసెంబర్ 7న జరిగిన ఆర్ముడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అక్కడే ఆయన 2016లో నగ్రోటా ఉగ్రదాడిలో నేలకొరిగిన మేజర్ కునాల్ గోసావి భార్య, కుమార్తెలతో మాట్లాడారు. అనంతరం ఫ్లాగ్ డే కార్యక్రమానికి సంబంధించిన 57 నిమిషాల వీడియోను ప్రధాని ట్విట్టర్‌లో విడుదల చేశారు.

ఉగ్రవాద శక్తులను నిర్వీర్యం చేయాలిసార్క్ వ్యవస్థాపక దినోత్సవం(డిసెంబర్ 8) సందర్భంగా ప్రధాని మోదీ సార్క్ సెక్రటేరియట్‌కు లేఖ రాశారు. ఉగ్రవాదాన్ని సమష్టిగా ఎదుర్కోవడంతోపాటు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. పాకిస్తాన్‌ను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి
 : 54వ డీజీపీ, ఐజీపీల జాతీయ సదస్సు
ఎప్పుడు : డిసెంబర్ 8
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : పుణె, మహారాష్ట్ర

ఎడ్డీ హెర్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయుడు

అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సర్క్యూట్‌లో జూనియర్ గ్రాండ్‌స్లామ్ టోర్నీగా పరిగణించే ఎడ్డీ హెర్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్‌గా మానస్ ధామ్నె చరిత్ర సృష్టించాడు.

Current Affairs

అమెరికాలోని ఫ్లోరిడాలో డిసెంబర్ 8న జరిగిన అండర్-12 బాలుర సింగిల్స్ ఫైనల్లో పుణేకి చెందిన 11 ఏళ్ల మానస్ 3-6, 6-0, 10-6తో ‘సూపర్ టైబ్రేక్’లో మాక్స్‌వెల్ ఎక్స్‌టెడ్ (అమెరికా)పై విజయం సాధించాడు.

మరోవైపు డబుల్స్ విభాగంలో మానస్ రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో మానస్ (భారత్)-ఆరవ్ హడా (నేపాల్) జంట 6-7 (5/7), 2-6తో సె హ్యుక్ చో-మిన్సెక్ మాయెంగ్ (కొరియా) జోడీ చేతిలో ఓడిపోయింది. జూనియర్స్ విభాగంలో ఎడ్డీ హెర్ ఓపెన్, ఆరెంజ్ బౌల్ ఓపెన్ టోర్నీలను గ్రాండ్‌స్లామ్ టోర్నీలుగా భావిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి
 : ఎడ్డీ హెర్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్ టైటిల్ విజేత
ఎప్పుడు : డిసెంబర్ 8
ఎవరు : మానస్ ధామ్నె
ఎక్కడ : ఫ్లోరిడా, అమెరికా

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close