Current Affairs

Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 10/01/2020

ఆస్ట్రేలియాలో పదివేల ఒంటెల కాల్చివేత

ఆస్ట్రేలియాని విపరీత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.

Current Affairs

దేశ దక్షిణ ప్రాంతంలో కరువు కరాళనృత్యం చేస్తోంది. కరువు నెలకొన్న ప్రాంతంలో ఒంటెల సంఖ్య అధికంగా ఉంది. ఇవి అధికంగా నీరు తాగుతున్నాయి. దీని కారణంగా కరువు ప్రాంతంలో తీవ్ర నీటి కోరత నెలకొంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు పదివేల ఒంటెలను కాల్చేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. శిక్షణ పొందిన షూటర్లతో హెలికాప్టర్ల నుంచి కాల్చడం ద్వారా ఒంటెల సామూహిక హనన కార్యక్రమం చేపట్టనుంది. నీళ్లకోసం వెంపర్లాడుతున్న ఒంటెలు గుంపులుగా మానవ ఆవాసాల వద్దకు వచ్చేస్తున్నాయని, ఫలితంగా అక్కడి గిరిజన తెగల ప్రజలకు ముప్పు ఏర్పడుతోందని ప్రభుత్వం చెబుతోంది.

ప్రస్తుతం ఆస్ట్రేలియాను కార్చిచ్చు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్చిచ్చు కారణంగా కంగారూలు, కోలాలు, అడవి గొర్రెలు, వివిధ రకాల పక్షులు లక్షలాదిగా ప్రాణాలు కోల్పోయాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 పదివేల ఒంటెల కాల్చివేత
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : ఆస్ట్రేలియా ప్రభుత్వం
ఎక్కడ : దక్షిణ ఆస్ట్రేలియా
ఎందుకు : కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు

మాదిరి ప్రశ్నలు

1. ఆస్ట్రేలియా జాతీయ జంతువు ఏది?
1. కోలా
2. అడవి గొర్రె
3. కంగారూ
4. కర్‌బక్ హార్స్

2. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సీఈపీ-ఆర్‌సెప్) సదస్సు-2019 సందర్భంగా ఏ దేశం ఆర్‌సెప్ ఒప్పందంలో భాగస్వామిగా చేరలేమని ప్రకటించింది.
1. చైనా
2. మయన్మార్
3. వియత్నాం
4. భారత్

ఇరాన్‌లో కూలిన ఉక్రెయిన్ పౌర విమానం

అగ్రరాజ్యం అమెరికాతో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ఇరాన్‌లో ఓ విమానం కుప్పకూలింది.

Current Affairs

ఉక్రెయిన్ ఎయిర్‌లైన్స్ కి చెందిన పౌర విమానం బోయింగ్ 737 టెహ్రాన్ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన రెండు నిమిషాలకే కూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 176 మంది మృతి చెందారు. ఈ విమానం టెహ్రాన్ నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు వెళ్లాల్సి ఉండగా ఈ ఘటన జరిగింది. విమాన ప్రమాదంలో మృతి చెందినవారిలో ఇరాన్‌కి చెందినవారు 82 మంది, కెనడా దేశస్తులు 63 మంది ఉన్నారు.

కూలిపోయిందా? కూల్చేశారా?
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఈ విమానాన్ని కూల్చివేశారన్న ప్రచారం సాగుతోంది. ఇరాన్ దేశానికి చెందిన క్షిపణి పొరపాటున విమానాన్ని కూల్చేసిందని ప్రచారం మొదలైంది.

శాంతికి భారత్ కృషి చేయాలి : ఇరాన్

ఇరాన్-అమెరికాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్ తీసుకునే ఎలాంటి శాంతి చర్యలనైనా ఇరాన్ స్వాగతిస్తుందని భారత్‌లో ఆ దేశ రాయబారి అలీ చెగెనీ పేర్కొన్నారు.

Current Affairs

ఇరాన్-అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగబోవని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. సులేమానీకి నివాళులర్పించేందుకు ఇరాన్ ఎంబసీలో జనవరి 9న ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో చెగెనీ ఈ మేరకు మాట్లాడారు.

ఇరాక్ వెళ్లకండి : భారత్
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరాక్ వెళ్లాలనుకునే పర్యాటకులకు భారత్ జనవరి 9న పర్యాటక సూచన జారీ చేసింది. ‘అంతగా అవసరం లేని ప్రయాణమైతే రద్దు చేసుకోండి’ అని ఇరాక్ వెళ్లే భారత ప్రయాణీకులకు భారత విదేశాంగ శాఖ సూచించింది. ఇరాక్‌లోని భారతీయులు సైతం జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్రయాణాలు అస్సలు చేయవద్దని సూచించింది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close