Current Affairs

Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 09/01/2020

సీఏఐటీ సమావేశంలో నిర్మలా సీతారామన్

అఖిల భారత వర్తక సమాఖ్య (సీఏఐటీ) జనవరి 7న ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు.

Current Affairs

పన్నుల వ్యవస్థను సులభతరంగా మార్చేందుకు, నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి వేధింపుల్లేకుండా చేసేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. జీఎస్‌టీ రిటర్నుల దాఖలును మరింత మెరుగ్గా మార్చే దిశగా సూచనలను స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

మై టైమ్ ఎట్ సెబీ పుస్తకం విడుదల
మాజీ ఐఏఎఫ్ ఆఫీసర్, సెబీ మాజీ చైర్మన్ యు.కె. సిన్హా రచించిన ‘గోయింగ్ పబ్లిక్: మై టైమ్ ఎట్ సెబీ’ పుస్తకం విడుదలైంది. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ ఇండియా ప్రచురించింది. నియంత్రణ సంస్థలు సొంత ఆదాయ వనరులను కలిగి ఉండాలని, ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లపై ఆధారపడ కూడదని సిన్హా తన పుస్తకంలో పేర్కొన్నారు. ఒక స్వతంత్ర నియంత్రణ సంస్థ కార్యకలాపాలకు ఆర్థిక స్వాతంత్య్రం ప్రాథమిక అవసరమని వివరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 అఖిల భారత వర్తక సమాఖ్య (సీఏఐటీ) సమావేశం
ఎప్పుడు : జనవరి 7
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : న్యూఢిల్లీ

కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో-2020 ప్రారంభం

అమెరికాలోని లాస్ వెగాస్‌లో జనవరి 7న ‘2020 కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)’ ప్రారంభమైంది.

Current Affairs

పలు దిగ్గజ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సంస్థలు తమ కొంగొత్త ఉత్పత్తులను సీఈఎస్‌లో ప్రదర్శనకు ఉంచాయి.

శాంసంగ్ డిజిటల్ అవతార్
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ సీఈఎస్‌లో కృత్రిమ మేథతో (ఏఐ)తో పనిచేసే ‘డిజిటల్ మనిషి’(డిజిటల్ అవతార్)ని ఆవిష్కరించింది. నియోన్ అనే ఈ టెక్నాలజీతో డిజిటల్ అవతార్‌లను సృష్టించవచ్చని, డిస్‌ప్లేలు లేదా వీడియో గేమ్స్‌లో ఉపయోగించవచ్చని శాంసంగ్ తెలిపింది. డిజిటల్ అవతార్ మనుషుల్లాగే సంభాషించడం, భావాలను వ్యక్తపర్చడం వంటివి చేయగలదని పేర్కొంది.

ఏవీటీఆర్ కాన్సెప్ట్ కారు
హాలీవుడ్ సినిమా అవతార్ ప్రేరణతో రూపొందించిన ఏవీటీఆర్ కాన్సెప్ట్ కారును మెర్సిడెస్ బెంజ్ ఆవిష్కరించింది. ఈ అటానమస్ వాహనంలో స్టీరింగ్ వీల్, పెడల్స్ వంటివి ఉండవు. సెంటర్ కన్సోల్ ఆధారంగా ఇది పనిచేస్తుంది.

ఎయిర్ ట్యాక్సీలను ఎస్-ఏ1
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ కొత్తగా రూపొందిస్తున్న ఎయిర్ ట్యాక్సీలను ఎస్-ఏ1 పేరిట ఆవిష్కరించింది. విద్యుత్‌తో నడిచే ఈ ఎయిర్ ట్యాక్సీ గరిష్టంగా గంటకూ 290 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు. సుమారు 100 కి.మీ. దూరంలో, అరగంట ప్రయాణం ఉండే ప్రాంతాలకు నడిపే ట్యాక్సీ సర్వీసుల కోసం వీటిని వినియోగించేందుకు హ్యుందాయ్‌తో ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ ఒప్పందం కుదుర్చుకుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 2020 కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్) ప్రారంభం
ఎప్పుడు : జనవరి 7
ఎక్కడ : లాస్ వెగాస్, అమెరికా
ఎందుకు : ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సంస్థల నూతన ఉత్పత్తుల ప్రదర్శనకు

డీఎఫ్‌ఆర్‌ఎల్‌లో వ్యోమగాముల ఆహారం తయారు

ఇస్రో 2020 ఏడాది ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గగన్‌యాన్ ప్రయోగంలో అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాముల కోసం మైసూరుకు చెందిన డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (డీఎఫ్‌ఆర్‌ఎల్) పలు రకాల ఆహార పదార్థాలను సిద్ధం చేయనుంది.

Current Affairs

ఇస్రో, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వంటకాలు తయారు చేయనుంది. ఇడ్లీ సాంబార్, ఎగ్ రోల్స్, వెజ్ రోల్స్, వెజ్ పులావ్‌తో పాటు మాంసాహారాన్ని వండిపెట్టనుంది. 32 ఆహార పదార్థాల జాబితాను ఇస్రోకు పంపించింది. ఈ ఆహారాలు కొన్ని నెలల పాటు పాడవకుండా, తాజాగా, పోషకాలతో ఉంటాయని డీఎప్‌ఆర్‌ఎల్ తెలిపింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 భారత వ్యోమగాముల కోసం ఆహారం తయారు
ఎప్పుడు : జనవరి 7
ఎవరు : డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (డీఎఫ్‌ఆర్‌ఎల్)

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close