Current Affairs

Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 08/12/2019

జాతీయస్థాయిలో ఉత్తమ 10 పోలీస్ స్టేషన్లు ఇవే..

ఉత్తమ పోలీసింగ్ విధానాలతో ప్రజలకు మెరుగైన సేవలను అందించడం ద్వారా జాతీయస్థాయిలో 10 పోలీస్ స్టేషన్ల (పీఎస్)లో తెలంగాణలోని కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల పోలీస్ స్టేషన్ ఒకటిగా నిలిచింది.

Current Affairs

టాప్-10 ర్యాంకులను కేంద్ర హోంశాఖ డిసెంబర్ 6న విడుదల చేసింది. తొలి ర్యాంకు అండమాన్ నికోబార్ దీవుల్లోని అబెర్‌దీన్ పోలీస్‌స్టేషన్ కై వసం చేసుకోగా.. చొప్పదండి పోలీస్ స్టేషన్ 8వ ర్యాంకు సొంతంచేసుకుంది. పోలీసు స్టేషన్లను ప్రజాస్పందన ఆధారంగా, పోలీసు సిబ్బంది పనితీరు ఆధారంగా గ్రేడింగ్ చేయడానికి ర్యాంకులు కేటాయించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచన మేరకు కేంద్ర హోంశాఖ ఈ సర్వే నిర్వహించింది. డేటా విశ్లేషణ, ప్రత్యక్ష పరిశీలన, ప్రజల అభిప్రాయాల ద్వారా దేశంలోని 15,579 పోలీస్ స్టేషన్లలో టాప్-10 పోలీస్ స్టేషన్లను గుర్తించారు. ర్యాంకింగ్ ప్రక్రియకు ముందు ప్రతి రాష్ట్రంలో ఉత్తమంగా పనిచేసే పోలీసు స్టేషన్లను ఎంపిక చేశారు. ఆస్తి నేరం, మహిళలపై నేరాలు, బలహీన వర్గాలపై నేరాల్లో పరిశోధనను పనితీరుకు ప్రాతిపదికగా ఎంచుకున్నారు.

ర్యాంకుపోలీస్ స్టేషన్రాష్ట్రం
1అబెర్‌దీన్అండమాన్ నికోబార్ దీవులు
2బాలాసినోర్గుజరాత్
3ఏజేకే బుర్హాన్‌పూర్మధ్యప్రదేశ్
4ఏడబ్ల్యూపీఎస్ థేనితమిళనాడు
5ఎనినిఅరుణాచల్‌ప్రదేశ్
6బాబాహరిదాస్‌నగర్ఢిల్లీ
7బాకనీరాజస్తాన్
8చొప్పదండితెలంగాణ
9బొకోలింగోవా
10బర్గావామధ్యప్రదేశ్

క్విక్ రివ్వూ:
ఏమిటి:
 జాతీయస్థాయిలో ఉత్తమ 10 పోలీస్ స్టేషన్లు ఎంపిక
ఎప్పుడు: డిసెంబర్ 6, 2019
ఎక్కడ: న్యూఢిల్లీ
ఎందుకు: ఉత్తమ పోలీసింగ్ విధానాలతో ప్రజలకు మెరుగైన సేవలను అందించినందుకు

ఎన్‌ఎస్‌ఈ చైర్మన్‌గా గిరీష్ చంద్ర చతుర్వేది

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ చైర్మన్‌గా గిరీష్ చంద్ర చతుర్వేది నియమితులయ్యారు.

Current Affairs

మునుపటి చైర్మన్ అశోక్ చావ్లా రాజీనామా తరువాత ఈ ఏడాది జనవరి నుంచి ఈ పోస్ట్ ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే కాగా, డిసెంబర్ 6న చతుర్వేది చైర్మన్ బాధ్యతలను స్వీకరించారని ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది. ఇందుకు సెబీ అనుమతి లభించినట్లు ప్రకటించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శిగా సేవలందించిన ఈయన నియామకాన్ని స్వాగతిస్తున్నట్లు ఎక్స్ఛేంజ్ బోర్డ్ వెల్లడించింది.

క్విక్ రివ్వూ:
ఏమిటి:
 ఎన్‌ఎస్‌ఈ చైర్మన్‌గా గిరీష్ చంద్ర చతుర్వేది
ఎవరు: గిరీష్ చంద్ర
ఎప్పుడు: డిసెంబర్ 6, 2019
ఎక్కడ: న్యూఢిల్లీ

నెఫ్ట్ లావాదేవీలు ఇక 24/7 :ఆర్‌బీఐ

నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్‌‌స ట్రాన్స్ ఫర్ (నెఫ్ట్/ఎన్‌ఈఎఫ్‌టీ) వ్యవస్థ మరింత సౌలభ్యంగా మారనుంది.

Current Affairs

రోజులో 24 గంటలు, వారంలో అన్ని రోజులూ (ఆదివారం, అన్ని సెలవుదినాల్లోనూ) నెఫ్ట్ లావాదేవీలను అనుమతించనున్నట్టు ఆర్‌బీఐ డిసెంబర్ 6న ప్రకటించింది. డిసెంబర్ 16 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. డిసెంబర్ 16న (డిసెంబర్ 15 అర్ధరాత్రి) 00.30 గంటలకు మొదటి నెఫ్ట్ సెటిల్‌మెంట్ జరుగుతుంది. లావాదేవీలు సాఫీగా సాగిపోయేందుకు వీలుగా బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద తమ కరెంటు ఖాతాల్లో తగినంత నిధుల లభ్యత ఉండేలా చూసుకోవాలని, అవసరమైన ఏర్పాట్లను కూడా చేసుకోవాలని కేంద్ర బ్యాంకు కోరింది. రెండు గంటల్లోపు లావాదేవీ మొత్తం స్వీకర్త ఖాతాలో జమ చేయడం లేదా పంపిన వ్యక్తిన ఖాతాకు వెనక్కి జమ చేయడం ఇక ముందూ కొనసాగనుంది. నెఫ్ట్ లావాదేవీల ప్రోత్సాహానికి గాను వీటిపై చార్జీలను ఆర్‌బీఐ లోగడే ఎత్తివేసింది. నెఫ్ట్ లావాదేవీలను గంటకోసారి ఒక బ్యాంచ్ కింద క్లియర్ చేస్తుండడం ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం.

క్విక్ రివ్వూ:
ఏమిటి:
 నెఫ్ట్ లావాదేవీలు ఇక 24/7
ఎప్పుడు: డిసెంబర్ 16 నుంచి
ఎందుకు: లావాదేవీలు సాఫీగా సాగిపోయేందుకు

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close