Current Affairs

Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 08/01/2020

ఫార్మర్స్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం

బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న 107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా ఫార్మర్స్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభమైంది.

Current Affairs

భారత వ్యవసాయ పరిశోధనల సమాఖ్య (ఐసీఏఆర్) డెరైక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర జనవరి 6న ఫార్మర్స్ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభించారు. ఈ సమావేశంలో మహాపాత్ర ప్రసంగిస్తూ… రైతులు తమ సొంత ఖర్చులతో చేపట్టిన పరిశోధనలు, ఆవిష్కరణలను శాస్త్రీయంగా ప్రామాణీకరించేందుకు, కొత్త కొత్త ఆవిష్కరణలను అందరికీ చేరువ చేసేందుకు ఢిల్లీలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీంతోపాటు ఆవిష్కరణల ప్రోత్సాహానికి ఫార్మర్స్ ఇన్నోవేషన్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. వ్యవసాయంలో యువత పాత్ర పెంచేందుకు ఐసీఏఆర్ ‘ఆర్య’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని వివరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 ఫార్మర్స్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : ఐసీఏఆర్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక

మాదిరి ప్రశ్నలు

1. ప్రస్తుతం భారత వ్యవసాయ పరిశోధనల సమాఖ్య (ఐసీఏఆర్) డెరైక్టర్ జనరల్‌గా ఎవరు ఉన్నారు?
1. డాక్టర్ అరబిందోమిత్ర
2. డాక్టర్ జి సతీశ్ రెడ్డి
3. డాక్టర్ సుభాష్ పాలేకర్
4. డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర

2. వ్యవసాయంలో యువత పాత్ర పెంచేందుకు భారత వ్యవసాయ పరిశోధనల సమాఖ్య (ఐసీఏఆర్) ఏ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది?
1. కర్షక
2. శౌర్య
3. ఆర్య
4. వైవిధ్య

చిత్రదుర్గ జిల్లాలో గగన్‌యాన్ శిక్షణ కేంద్రం

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చెళ్లెకెరెలో గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం అదనపు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) జనవరి 6న తెలిపింది.

Current Affairs

‘హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్’గా పిలిచే ఈ కేంద్రం నుంచి గగన్‌యాన్‌కు సంబంధించిన కార్యక్రమాలతోపాటు వ్యోమగాములకు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. గగన్‌యాన్ ద్వారా 2022 నాటికి ముగ్గురు భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనున్నారు.

భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే 2022 నాటికి లేదా అంతకంటే ముందే సొంత సాంకేతిక పరిజ్ఞానంతో భారతీయుడిని అంతరిక్షంలోకి పంపుతామని 2018, ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.

గగన్‌యాన్- ముఖ్యాంశాలు

  • నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో ఈ ప్రయోగం చేపట్టనుంది.
  • ప్రయోగంలో సాంకేతిక సాయం కోసం రష్యా, ఫ్రాన్స్ లతో భారత్ ఒప్పందాలు కుదుర్చుకుంది.
  • సంస్కృత పదం వ్యోమ్(అంటే అంతరిక్షం అని అర్థం) ఆధారంగా అంతరిక్షంలోకి వెళ్లే భారతీయులను ‘వ్యోమ్‌నాట్స్’ అని వ్యవహరిస్తారు.
  • జీఎస్‌ఎల్వీ మార్క్-3 రాకెట్ ద్వారా గగన్‌యాన్ ప్రయోగం చేపట్టనున్నారు.
  • ఈ ప్రయోగం విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనాల తర్వాత సొంత పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి మానవుడిని విజయవంతంగా పంపిన నాలుగో దేశంగా భారత్ నిలవనుంది.
  • ఈ ప్రాజెక్టు కోసం రూ.10,000 కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 గన్‌యాన్ ప్రాజెక్టు కోసం అదనపు శిక్షణ కేంద్రం ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చెళ్లెకెరెలో
ఎక్కడ : చెళ్లెకెరె, చిత్రదుర్గ జిల్లా, కర్ణాటక
ఎందుకు : గగన్‌యాన్‌కు సంబంధించిన కార్యక్రమాల నిర్వహణ కోసం

మాదిరి ప్రశ్నలు
1. అంతరిక్షంలోకి వెళ్లే భారతీయులను ఏ పేరుతో పిలుస్తారు?1. కాస్మోనాట్స్
2. టైకోనాట్స్
3. వ్యోమ్‌నాట్స్
4. అవైటర్

2. గగన్‌యాన్ ప్రయోగంలో సాంకేతిక సాయం కోసం ఏ దేశాలతో భారత్ ఒప్పందాలు కుదుర్చుకుంది.
1. రష్యా, ఫ్రాన్స్
2. రష్యా, అమెరికా
3. అమెరికా, ఫ్రాన్స్
4. చైనా, అమెరికా

2020 ఏడాదిలోనే టీ హబ్ 2 : మంత్రి కేటీఆర్

2020 సంవత్సరంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ హబ్ 2, దేశంలోనే అతిపెద్ద ప్రోటో టైపింగ్ సెంటర్ టీ-వర్క్స్‌ని ప్రారంభించనున్నామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు.

Current Affairs

హైదరాబాద్‌లో జనవరి 6న జరిగిన టీ హబ్ నాలుగో వార్షికోత్సవ సంబరాల్లో మంత్రి ఈ మేరకు తెలిపారు. టెక్నాలజీ రంగంలో 2020 తెలంగాణకు అత్యంత ప్రాధాన్యం కలిగిన సంవత్సరమని ఆయన పేర్కొన్నారు. ఇన్నోవేషన్ ద్వారా అనేక సవాళ్లకు సమాధానాలు లభిస్తాయని, తెలంగాణ స్టార్టప్ కంపెనీలు ఈ దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

మాదిరి ప్రశ్నలు

1. రైతులకు పెట్టుబడి సాయం చేసేందుకు చేపట్టిన రైతుబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు ప్రారంభించారు.
1. 2019, మే 10
2. 2018, మే 10
3. 2019, సెప్టెంబర్ 10
4. 2019, ఫిబ్రవరి 10

2. అటవీశాస్త్ర పరిజ్ఞానంలో విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దడంతోపాటు విద్యాప్రమాణాలను పెంపునకు… ఏ వర్సిటీతో తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌సీఆర్‌ఐ) ఇటీవల పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.
1. ఆబర్న్ యూనివర్సిటీ
2. లోవా స్టేట్ యూనివర్సిటీ
3. జెంట్ యూనివర్సిటీ
4. ఆగ్రో పారిస్ టెక్ యూనివర్సిటీ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close