Current Affairs

Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 07/01/2020

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో 111 శిశుమరణాలు

గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో 2019, డిసెంబర్ నెలలో 111 మంది శిశువులు మృత్యువాత పడ్డారు.

Current Affairs

దీనితో పాటు అహ్మదాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో 88 మంది శిశువులు మరణించారు. ఈ విషయాన్ని గుజరాత్ ఆరోగ్యశాఖ మంత్రి నితిన్ పటేల్ జనవరి 5న వెల్లడించారు. ప్రజల్లో అవగాహన లేమి, పౌష్ఠికాహారలోపం, చలితీవ్రత ఈ మరణాలకు కారణాలని ఆయన అన్నారు. రెండు దశాబ్దాలతో పోలిస్తే మరణాల సంఖ్య పెరిగిందన్నారు.

శిశుమరణాల గణాంకాలు..
రాజ్‌కోట్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో 2019, డిసెంబర్‌లో 388 మంది శిశువులు చేరగా, వారిలో 111 మంది మరణించారు. అహ్మదాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో 2019, డిసెంబర్‌లో 415 మంది శిశువులు చేరగా, వారిలో 88 మంది మరణించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 2019, డిసెంబర్ నెలలో 111 మంది శిశువులు మృత్యువాత
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : గుజరాత్ ఆరోగ్యశాఖ మంత్రి నితిన్ పటేల్
ఎక్కడ : రాజ్‌కోట్ జిల్లా, గుజరాత్

మాదిరి ప్రశ్నలు

1. పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) రద్దు చేయాలని ఇటీవల ఏ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది.
1. అస్సాం
2. పశ్చిమ బెంగాల్
3. తమిళనాడు
4. కేరళ

2. జాతీయ మౌలిక సదుపాయాల పైపులైన్ (నేషనల్ ఇన్‌ఫ్రాస్టక్చ్రర్ పైప్‌లైన్-ఎన్‌ఐపీ)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ప్రాజెక్టులను ఎన్ని రాష్ట్రాల్లో అమలు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు?
1. 22
2. 18
3. 28
4. 14

ఇరాన్, అమెరికాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు

ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ తమపై దాడికి తెగబడితే.. మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో ప్రతీకారం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ హెచ్చరించారు.

Current Affairs

ఇరాన్‌లో 52 కీలక, వ్యూహాత్మక ప్రాంతాలను గుర్తించామని, తమపై దాడి చేస్తే ఆ 52 ప్రాంతాలను ధ్వంసం చేస్తామని హెచ్చరిస్తూ జనవరి 4న ట్రంప్ ట్వీట్ చేశారు. చాన్నాళ్ల క్రితం 52 మంది అమెరికన్లను ఇరాన్ బందీలుగా చెరపట్టిన ఉదంతాన్ని గుర్తు చేసేలా ఆ సంఖ్యను ట్రంప్ నిర్ధారించారని యూఎస్ రక్షణ వర్గాలు వెల్లడించాయి.

ఇరాక్‌లోని బాగ్దాద్‌లో జనవరి 3న అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ అత్యున్నత సైనికాధికారి, అల్ ఖుద్స్ ఫోర్స్ చీఫ్ మేజర్ జనరల్ సులేమానీ మరణించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిన చేసింది.

ఇది యుద్ధ నేరం : ఇరాన్
ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ‘పశ్చిమాసియాలో అమెరికా ద్వేషపూరిత ఉనికి అంతమయ్యేందుకు ఇదే ప్రారంభం. సాంస్కృతిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామనడం యుద్ధ నేరం కిందకు వస్తుంది. మా మిలటరీ ఉన్నతాధికారిని దొంగదెబ్బ తీసి చంపడం పిరికి చర్య. అది అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘన’ అని ఇరాన్ విదేశాంగ మంత్రి జవాద్ జారిఫ్ ట్వీట్ చేశారు. తమతో యుద్ధం ప్రారంభించే ధైర్యం అమెరికాకు లేదని ఇరాన్ ఆర్మీ చీఫ్ అబ్దుల్ రహీం మౌసావి వ్యాఖ్యానించారు.

ఇరాక్ నుంచి యూఎస్ బలగాలు వెనక్కు
తమ సైనిక స్థావరాల్లో ఉన్న అమెరికా సైనికులను వెనక్కు పంపాలని ఇరాక్ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. ఐఎస్‌పై పోరులో సాయపడేందుకు ఇరాక్‌లో 5,200 మంది అమెరికా సైనికులున్నారు.

కెన్యా బేస్‌పై దాడి
కెన్యా తీరంలోని అమెరికా, కెన్యా సైనికులున్న స్థావరంపై సొమాలియాకు చెందిన అల్ షబాబ్ తీవ్రవాద సంస్థ జనవరి 5న దాడి చేసింది. ఈ దాడిని తిప్పికొట్టి నలుగురిని హతమార్చామని కెన్యా దళాలు తెలిపాయి.

ఇరాన్ విదేశాంగ మంత్రికి జైశంకర్ ఫోన్
యూఎస్, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జనవరి 4న ఇరాన్ విదేశాంగ మంత్రి జవాద్ జారిఫ్‌తో మాట్లాడారు. అమెరికాతో నెలకొన్న ఉద్రిక్తతలపై భారత్ తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు ఆయనకు వివరించారు.

మాదిరి ప్రశ్నలు

1. ప్రస్తుతం ఇరాన్ అధ్యక్షునిగా ఎవరు ఉన్నారు?
1. అబ్దుల్ రహీం మౌసావి
2. జవాద్ జారిఫ్
3. హసన్ రౌహానీ
4. బర్హం సలీహ్

2. ఇరాక్‌లోని బాగ్దాద్‌లో 2019, జనవరి 3న అమెరికా జరిపిన క్షిపణి దాడిలో మరణించిన ఇరాన్ అత్యున్నత సైనికాధికారి, అల్ ఖుద్స్ ఫోర్స్ చీఫ్ మేజర్ జనరల్ ఎవరు?
1. ఇస్మాయిల్ ఖానీ
2. అబ్దుల్ రహీం మౌసావి
3. హషద్ అల్ షాబి
4. ఖాసీం సులేమానీ

ఆస్ట్రేలియా ప్రధాని భారత పర్యటన వాయిదా

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ భారత పర్యటన వాయిదా పడింది. ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు నేపథ్యంలో భారత్ పర్యటనను వాయిదా వేస్తున్నట్లు జనవరి 4న మారిసన్ ప్రకటించారు.

Current Affairs

రానున్న నెలల్లో ఇరు దేశాలకు కుదిరే మరో సమయంలో భేటీ జరుగుందని వెల్లడించారు. 2019, జనవరి 13న నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మారిసన్ భారత్‌కు రావాల్సి ఉంది. భారత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపాల్సి ఉంది. భారత్‌తో భేటీ అనంతరం ఆయన జపాన్ పర్యటనకు కూడా వెళ్లాల్సి ఉండగా, ఆ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు.

23 మంది మృతి
ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకూ 23 మంది పౌరులు మృతి చెందారు. దీని నుంచి పౌరులను కాపాడేందుకు ఆ దేశ ప్రభుత్వం 3 వేల మంది మిలిటరీ రిజర్వ్ బలగాలను రంగంలోకి దించింది. కార్చిచ్చు గురించి ప్రధాని మోదీ జనవరి 3న మారిసన్‌తో మాట్లాడారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 ఆస్ట్రేలియా ప్రధాని భారత పర్యటన వాయిదా
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : స్కాట్ మారిసన్
ఎందుకు : ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు నేపథ్యంలో

మాదిరి ప్రశ్నలు

1. క్రింది వాటిలో ఆస్ట్రేలియా రాజధాని, కరె న్సీ(వరుసగా)ని గుర్తించండి.
1. కాన్‌బెర్రా, ఆస్టేలియన్ డాలర్
2. సిడ్నీ, ఆస్టేలియన్ డాలర్
3. కాన్‌బెర్రా, యూరో
4. సిడ్నీ, యూరో

2. ఆసియాన్-ఇండియా 16వ శిఖరాగ్ర సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు?
1. కౌలాలంపూర్, మలేసియా
2. నొంతబురి(బ్యాంకాక్ సమీపం), థాయ్‌లాండ్
3. న్యాపిటా, మయన్మార్
4. వియన్నా, ఆస్ట్రియా

Tags

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published.

Close