Current Affairs
Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 04/01/2020
ఇయర్ ఆఫ్ ఏఐగా 2020 : మంత్రి కేటీఆర్
ఐటీ రంగంలో కృత్రిమ మేధస్సు వాటా భవిష్యత్‌లో రూ.1,284.2 లక్షల కోట్లకు చేరే అవకాశమున్న నేపథ్యంలో, అవకాశాలను అంది పుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు.
రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో జనవరి 2న హైదరాబాద్‌లో జరిగిన ఏఐ-2020 లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ.. 2020ని ‘ఇయర్ ఆఫ్ ఏఐ’గా ప్రకటించారు. రాష్ట్రంలో ఏఐ సాంకేతికత వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు.
కేటీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు…
- నాస్కామ్ నివేదిక ప్రకారం దేశంలో ప్రస్తుతం 2 బిలియన్ డాలర్లుగా ఉన్న ఏఐ రంగం వాటా 2025 నాటికి 16 బిలియన్ డాలర్లకు చేరడంతో పాటు, 2021 నాటికి 8 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖ తరఫున 2020ని ‘ఇయర్ ఆఫ్ ది ఏఐ’గా ప్రకటిస్తున్నాం.
- ఐఐటీ హైదరాబాద్ తరహాలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు, ఇతర విద్యా సంస్థల్లోనూ ఏఐని బోధిస్తాం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇయర్ ఆఫ్ ఏఐగా 2020
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : తెలంగాణ రాష్ట్రంలో ఏఐ సాంకేతికత వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు
మాదిరి ప్రశ్నలు
1. ఇటీవల విడుదలైన ప్రపంచంలోనే ‘ఫాస్టెస్ట్ కంప్యూటర్స్ టాప్-500’ జాబితాలో చోటు దక్కించుకున్న భారత సూపర్ కంప్యూటర్?
1. ప్రత్యూష
2. సమిట్
3. సియోర్రా
4. విహంగా
- సమాధానం : 1
2. దేశంలోకి చొరబడిన శత్రుదేశాల డ్రోన్లను బంధించేందుకు ఐఐటీ-కాన్పూర్ విద్యార్థులు రూపొందించిన సరికొత్త డ్రోన్ పేరు?
1. రీపర్
2. లహరి
3. విహరి
4. ప్రహరీ
- సమాధానం : 4
మాజీ డీజీపీ హెచ్‌జే దొర ఆటోబయోగ్రఫీ ఆవిష్కరణ
మాజీ డీజీపీ హెచ్.జె. దొర ఆటోబయోగ్రఫీ ‘జర్నీ థ్రూ టర్బులెంట్ టైమ్స్’ పుస్తకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు.
దొర తన సర్వీసు కాలంలో ఎదుర్కొన్న క్లిష్టమైన సందర్భాలను వివరిస్తూ ఇతర పోలీసు అధికారులకు స్ఫూర్తినిచ్చేలా ఈ పుస్తకం రాశారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో జనవరి 2న జరిగిన పుస్తకావిష్కరణలో కేసీఆర్ మాట్లాడుతూ… సమాజంలో నేర ప్రవృత్తి పెరగకుండా నైతిక విలువలు పెంపొందించే విధంగా విద్యావిధానం ఉండాలని అభిలషించారు. మంచి సమాజాన్ని నిర్మించే క్రమంలో జీయర్ స్వామి లాంటి ధార్మికవేత్తలు, మాజీ డీజీపీల సలహాలతో పాఠ్యాంశాలను రూపొందిస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే విద్యాసంస్థల్లో నైతిక విలువలు పెంపొందించే బోధనలు ప్రారంభిస్తామని ప్రకటించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మాజీ డీజీపీ హెచ్‌జే దొర ఆటోబయోగ్రఫీ ఆవిష్కరణ
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు
ఎక్కడ : ప్రగతి భవన్, హైదరాబాద్
మాదిరి ప్రశ్నలు
1. ఇటీవల ఆవిష్కరించిన అసృ్పశ్యుని యుద్ధగాథ పుస్తకాన్ని ఎవరు రచించారు?
1. డాక్టర్ కత్తి పద్మారావు
2. ప్రొఫెసర్ కె.ఎస్.చలం
3. కొలకలూరి ఇనాక్
4. బండి సత్యనారయణ
- View Answer
- సమాధానం : 1
2. క్రింది వాటిలో కాళోజి నారయణ రావు రచన కానిది?
1. నా గొడవ
2. జీవన గీత
3. అనకథలు
4. శప్తభూమి
- View Answer
- సమాధానం : 4
జనవరి 1న శిశు జననాల్లో భారత్‌కు అగ్రస్థానం
2020 జనవరి 1న శిశు జననాల్లో భారత్ అగ్రస్థానంలో, చైనా రెండో స్థానంలో నిలిచాయి.
జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా 3,92,078 మంది పిల్లలు పుడితే వారిలో భారత్‌లోనే 67,385 మంది పుట్టినట్టు ఐక్యరాజ్యసమితికి చెందిన శిశు సంరక్షణ సంస్థ యూనిసెఫ్ జనవరి 2న వెల్లడించింది. మొత్తంగా జన్మించిన 3,92,078 శిశువుల్లో సగం మంది కేవలం ఎనిమిది దేశాల్లోనే జన్మించారని పేర్కొంది.
విరీ చైల్డ్ అలైవ్ ఉద్యమం…
ప్రతీ ఏడాది జనవరి 1న చిన్నారుల జననాన్ని యూనిసెఫ్ ఒక వేడుకగా నిర్వహిస్తుంది. విరీ చైల్డ్ అలైవ్ పేరుతో ఒక ఉద్యమాన్ని నిర్వహిస్తోంది. బిడ్డల్ని సంరక్షించడంలో నర్సులకి శిక్షణ ఇవ్వడానికి వెంటనే పెట్టుబడులు పెట్టడం, తల్లీ బిడ్డలకి సరైన పోషకాహారం, మందులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది.
2020, జనవరి 1న…
తొలి శిశువు జన్మించిన దేశం: ఫిజి
ఆఖరి శిశువు జన్మించిన దేశం: అమెరికా
ఏ దేశంలో ఎంతమంది పుట్టారు
దేశం | శిశు జననాల సంఖ్య |
భారత్ | 67,385 |
చైనా | 46,299 |
నైజీరియా | 26,039 |
పాకిస్తాన్ | 16,787 |
ఇండోనేసియా | 13,020 |
అమెరికా | 10,452 |
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో | 10,247 |
ఇథియోపియా | 8,493 |
మరో ఏడేళ్లలో చైనాని దాటేస్తాం
2019 నాటికి చైనా జనాభా 143 కోట్లయితే, భారత్ జనాభా 137 కోట్లుగా ఉంది. ప్రపంచ జనాభాలో చైనా వాటా 19శాతమైతే, భారత్ వాటా 18శాతంగా ఉంది. 2027 నాటికి జనాభాలో చైనాని భారత్ దాటేస్తుందని యూనిసెఫ్ అంచనా వేస్తోంది. ఈ శతాబ్దం చివరినాటికి భారత్ 150 కోట్లతో మొదటి స్థానంలో ఉంటే, చైనా110 కోట్లతో రెండో స్థానంలో, నైజీరియా 73 కోట్లతో మూడో స్థానంలో ఉండే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇక ఆ తర్వాత స్థానాల్లో అమెరికా, పాకిస్తాన్‌లు ఉంటాయని చెప్పింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 780 కోట్లుగా ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020, జనవరి 1న శిశు జననాల్లో భారత్‌కు అగ్రస్థానం
ఎవరు : ఐక్యరాజ్యసమితికి చెందిన శిశు సంరక్షణ సంస్థ యూనిసెఫ్
ఎక్కడ : ప్రపంచంలో