Current Affairs
Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 03/12/2019
ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ విజేతగా కర్ణాటక
సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టి20 ట్రోఫీని డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక సొంతం చేసుకుంది.
గుజరాత్‌లోని సూరత్‌లో డిసెంబర్ 1న జరిగిన ఫైనల్లో కర్ణాటక జట్టు ఒక పరుగు తేడాతో తమిళనాడును ఓడించింది. ముందుగా కర్ణాటక 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. అనంతరం తమిళనాడు జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు చేసింది. ఈ టోర్నిలో కర్ణాటక జట్టుకు మనీశ్ పాండే కెప్టెన్‌గా వ్యవహరించాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టి20 ట్రోఫీ విజేత
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : కర్ణాటక జట్టు
ఎక్కడ : సూరత్, గుజరాత్
ది సెలైంట్ వాయిస్ చిత్రానికి జాతీయ అవార్డు
ప్రతి చెరువుకు ఓ స్వరం ఉందనే సందేశాన్నిస్తూ చెరువుల పరిరక్షణపై అవగాహనతో తెరకెక్కిన ‘ది సెలైంట్ వాయిస్’అనే లఘు చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది.
హైదరాబాద్‌కు చెందిన ఐటీ ప్రొఫెషనల్ సునీల్ సత్యవోలు దర్శకుడిగా, అన్షుల్ సిన్హా నిర్మాతగా ఈ చిత్రాన్ని తీశారు. సీఎంఎస్ ఫిలిం ఫెస్టివల్‌లో ది సెలైంట్ వాయిస్‌కు రెండో స్థానం దక్కింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అదనపు కార్యదర్శి రవి అగర్వాల్ చేతుల మీదుగా సునీల్, అన్షుల్ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చెరువుల పరిరక్షణపై సమాజంలో జవాబుదారీతనాన్ని తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు.
అబుదాబి గ్రాండ్‌ప్రి విజేత హామిల్టన్
ఫార్ములావన్ సీజన్‌లో చివరిదైన 21వ రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు.
డిసెంబర్ 1న జరిగిన ఈ రేసులో 34 ఏళ్ల హామిల్టన్ 55 ల్యాప్‌లను గంటా 34 నిమిషాల 05.715 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. దీంతో హామిల్టన్ ఈ సీజన్‌లో 11వ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నట్లయింది. సీజన్‌లో రెండు రేసులు మిగిలి ఉండగానే ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఖాయం చేసుకున్న హామిల్టన్ మొత్తం 413 పాయింట్లు సాధించాడు. బొటాస్ (మెర్సిడెస్-326 పాయింట్లు) రెండో స్థానంలో … వెర్‌స్టాపెన్ (278 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచారు.
- 2019 ఏడాది ఫార్ములావన్ సీజన్‌లో మొత్తం 21 రేసులు జరిగాయి. అయితే ఐదుగురు డ్రైవర్లు మాత్రమే కనీసం ఒక్కో టైటిల్ సాధించగలిగారు. హామిల్టన్ 11 టైటిల్స్ నెగ్గాడు. బొటాస్ 4 టైటిల్స్, వెర్‌స్టాపెన్ 3 టైటిల్స్, లెక్‌లెర్క్ 2 టైటిల్స్, వెటెల్ ఒక టైటిల్ గెలిచారు.
- ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్‌లో పాల్గొన్న 10 జట్లలో మూడు జట్లు మాత్రమే టైటిల్స్ సాధించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అబుదాబి గ్రాండ్‌ప్రి విజేత
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్