Current Affairs

Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 02/12/2019

అఫ్గానిస్తాన్‌లో డొనాల్డ్ ట్రంప్ పర్యటన

థ్యాంక్స్ గివింగ్ రోజును పురస్కరించుకొని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నవంబర్ 28న అఫ్గానిస్థాన్‌లో ఆకస్మికంగా పర్యటించారు.

Current Affairs

అఫ్గాన్‌లోని బగ్రామ్ వైమానిక క్షేత్రంలో అమెరికా సైనికులను కలుసుకున్నారు. అనంతరం ట్రంప్ మాట్లాడుతూ… ‘తాలిబన్లు ఒప్పందం కుదుర్చుకోవాలని అనుకుంటున్నారు. మేం వారితో సమావేశమవుతున్నాం. కాల్పులను విరమించాలని చెబుతున్నాం. గతంలో అందుకు వారు అంగీకరించలేదు. ఇప్పుడు మాత్రం సరేనంటున్నారు. కాబట్టి సానుకూల ఫలితం ఉంటుందనుకుంటున్నా’’ అని చెప్పారు. అఫ్గాన్‌లో చోటుచేసుకున్న ఆత్మాహుతి దాడిలో అమెరికా సైనికుడు ఒకరు మృత్యువాతపడటంతో తాలిబన్లతో శాంతి చర్చలను రద్దు చేస్తున్నట్లు 2019, సెప్టెంబరు 8న ట్రంప్ ప్రకటించారు.

అఫ్గాన్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీతో ట్రంప్ భేటీ అయ్యారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 అఫ్గానిస్థాన్‌లో పర్యటన
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

తెలంగాణ ప్రభుత్వంతో స్కైవర్త్ కంపెనీ ఒప్పందం

తెలంగాణ ప్రభుత్వంతో చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ స్కైవర్త్ ఒప్పందం కుదుర్చుకుంది.

Current Affairs

ఈ మేరకు తెలంగాణ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావుతో స్కైవర్త్ గ్రూప్ చైర్మన్ లై వీడ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం నవంబర్ 29న హైదరాబాద్‌లో భేటీ అయింది. తాజా ఒప్పందం ప్రకారం… స్కెవర్త్ కంపెనీ మొదటి దశలో రూ. 700 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ కేంద్రంగా 50 ఎకరాల విస్తీర్ణంలో ఉత్పాదక ప్లాంటును ఏర్పాటు చేయనుంది. స్కైవర్త్ పెట్టుబడులతో రాష్ట్రంలో 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త ఫీచర్లను అందించే స్కైవర్త్ బ్రాండ్… ఎల్‌ఈడీ టీవీలను ఇప్పటికే ఉత్పత్తి చేస్తోంది. కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఎలక్ట్రానిక్ వాహనాల్లో ఉపయోగించే లిథియం బ్యాటరీలు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లను తయారు చేయాలని స్కైవర్త్ నిర్ణయించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ స్కైవర్త్
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : హైదరాబాద్ కేంద్రంగా 50 ఎకరాల విస్తీర్ణంలో ఉత్పాదక ప్లాంటును నెలకొల్పేందుకు

4.5 శాతంగా దేశ వృద్ధి రేటు : ఎన్‌ఎస్‌ఓ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-2020) రెండవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు కేవలం 4.5 శాతంగా నమోదయ్యింది.

Current Affairs

జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) నవంబర్ 29న విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. గడచిన ఆరు సంవత్సరాల్లో వృద్ధి వేగం ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. 2012-13 జనవరి-మార్చి త్రైమాసికంలో 4.3 శాతం వృద్ధి నమోదయ్యింది.

Current Affairs

కట్టుతప్పిన ద్రవ్యలోటు…
ద్రవ్యలోటు విషయానికొస్తే, 2019-20 ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ పరిమాణం రూ.7.03 లక్షల కోట్లుగా ఉండాలన్నది (జీడీపీలో 3.3 శాతం) బడ్జెట్ లక్ష్యం. కానీ అక్టోబర్ ముగిసే నాటికే ఈ మొత్తం రూ.7,20,445 కోట్లకు చేరింది. అంటే బడ్జెట్ అంచనాల్లో 102.4 శాతానికి చేరిందన్నమాట. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ నవంబర్ 29న ఈ గణాంకాలను విడుదల చేసింది.

వియత్నాంకు వేగవంతమైన వృద్ధి హోదా
ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశం హోదాను గత ఆర్థిక సంవత్సరం (5 శాతం) వరకూ భారత్ పొందుతోంది. అయితే ప్రస్తుత జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి 7.3 శాతం వృద్ధి రేటుతో వియత్నాం మొదటిస్థానంలో ఉంది. చైనా వృద్ధి రేటు 6 శాతంగా (27 సంవత్సరాల కనిష్టం) ఉంది. తరువాత వరుసలో ఈజిఫ్ట్ (5.6 శాతం), ఇండోనేషియా (5 శాతం)లు ఉన్నాయి. దీనితో క్యూ2కు సంబంధించి ‘వేగవంతమైన వృద్ధి’ హోదాను వియత్నాం దక్కించుకున్నట్లు అయి్యంది. కాగా అమెరికా వృద్ధి రేటు ఈ కాలంలో 2.1 శాతం.

Current Affairs

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close