Current Affairs

Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ 22/01/2020

నిర్భయ దోషి ముఖేష్ క్షమాభిక్ష తిరస్కరణ

2012 నాటి నిర్భయ అత్యాచార కేసు దోషి ముఖేష్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జనవరి 17న తిరస్కరించారు.

Current Affairs

ఢిల్లీ ప్రభుత్వం ద్వారా అందిన ఈ పిటిషన్‌ను కేంద్ర హోంశాఖ జనవరి 17న రాష్ట్రపతి భవనానికి పంపింది. ఆ వెంటనే రాష్ట్రపతి కోవింద్ పిటిషన్‌ను పరిశీలించడంతోపాటు తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఫిబ్రవరి 1న ఉరి శిక్ష అమలు…
ముఖేష్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించిన అనంతరం ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు నలుగురు దోషులపై మరోసారి డెత్‌వారెంట్లు జారీ చేసింది. దోషులను 2020, ఫిబ్రవరి 1న ఉదయం ఆరుగంటలకు ఉరి తీయాలని డెత్ వారెంట్లు జారీ చేసింది. ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం జనవరి 22నే నిర్భయ దోషులకు ఉరిపడాల్సి ఉంది. అయితే ముఖేష్ సింగ్ అనే దోషి తనను క్షమించాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతికి పిటిషన్ సమర్పించారు.

భారత మాజీ క్రికెటర్ నాదకర్ణి కన్నుమూత

భారత మాజీ క్రికెటర్ రమేశ్ చంద్ర (బాపు) నాదకర్ణి జనవరి 17న కన్ను మూశారు.

Current Affairs

ఆయన వయసు 86 సంవత్సరాలు. లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాపు 1955-1968 మధ్య కాలంలో 41 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. 29.07 సగటుతో 88 వికెట్లు పడగొట్టారు. బ్యాట్స్‌మన్‌గా కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చిన ఆయన 25.70 సగటుతో 1414 పరుగులు చేశారు. 191 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల కెరీర్‌లో సరిగ్గా 500 వికెట్లు పడగొట్టడం విశేషం.

డెంగ్యూ వైరస్ నిరోధక దోమల సృష్టి

ప్రాణాంతక డెంగ్యూ వైరస్ నిరోధక దోమలను శాస్త్రవేత్తలు సృష్టించారు.

Current Affairs

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, వాండర్‌బిల్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం డెంగ్యూ వైరస్‌ను నిరోధించే ప్రతిరక్షకాన్ని(యాంటీబాడీ) గుర్తించారు. డెంగ్యూని వ్యాప్తి చేసే ఆడ ఈడిస్ ఈజిప్టి దోమల్లో నాలుగు రకాల డెంగ్యూని నిరోధించే లక్షణాలతో ఈ ‘కార్గో’ యాంటీబాడీని అభివృద్ధి చేశారు. ‘ఈ యాంటీబాటీ దోమల్లో డెంగ్యూ వైరస్ వృద్ధి చెందకుండా చూస్తుంది. దాంతో ఆ వైరస్ మనుషుల్లోకి ట్రాన్స్ ఫర్ కాదు’ అని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అసోసియేట్ ప్రొఫెసర్ ఒమర్ అక్బరి వివరించారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close