Blog

స్పేస్‌ఎక్స్ చరిత్రాత్మక ప్రయోగం.. విజయవంతంగా నింగిలోకి రాకెట్

[ad_1]

అమెరికాలోని ప్రయివేట్ అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్ సంస్థ.. నాసాకు చెందిన ఇద్దరు వ్యోమగాములను విజయవంతంగా అంతరిక్షంలోని పంపింది. ద్వారా కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి శనివారం సాయంత్రం నాసా వ్యోమగాములు రాబర్ట్ బెహ్ంకెన్, డగ్లస్ హర్లీలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరి వెళ్లారు. ల్యాంచింగ్ ప్యాడ్ నుంచి రెండు-దశలలో ఫాల్కన్ 9 రాకెట్‌ ఇంజిన్‌ను మండించి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపారు. 19 గంటల ప్రయాణం తర్వాత ఈ రాకెట్ ఐఎస్ఎస్‌ను చేరుకుంటుంది.

రాకెట్ మొదటి బూస్టర్ దశలో విజయవంతంగా విడిపోయి అట్లాంటిక్ తీరం వద్ద నిటారుగా పయనించింది. రెండవ దశలోనూ రాకెట్ సజావుగా వేరుపడి, క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌లోని వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళుతూ భూమికి 250 మైళ్ల (450 కిలోమీటర్లు) ఎత్తులోని కక్ష్యలో తిరుగుతుంది. 2011లో అమెరికా స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ ముగిసిన తొమ్మిదేళ్ల తర్వాత ఈ ప్రయోగాన్ని చేపట్టారు.

వాస్తవానికి ఈ ప్రయోగం కిందటి బుధవారం షెడ్యూల్ చేశారు. కానీ వాతావరణ పరిస్థితుల అనుకూలించకపోవడంతో శనివారం మధ్యాహ్నం 3.00 గంటల వరకు అనిశ్చితి కొనసాగింది. అయితే, చివరకు సాయంత్రం వాతావరణం అనుకూలించడంతో రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు. కెన్నడీ అంతరిక్ష కేంద్రంలో ప్రయోగాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్షంగా తిలకించారు. ఈ సందర్భంగా ఆయన శాస్త్రవేత్తలను అభినందించారు. ‘ఇది నిజంగా ప్రత్యేకమైంది’ అని అభివర్ణించారు. ‘నిజమైన ప్రతిభ, నిజమైన మేధావి, మిమ్మల్ని ఎవరూ ఇష్టపడకుండా ఉండదరు’ అని ట్రంప్ అన్నారు.

భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడిపైకి మానవుల్ని పంపడమే లక్ష్యంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ ఎక్స్‌ చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకి మరో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. మానవ అంతరిక్ష యాత్రకు రూపొందిస్తున్న భారీ రాకెట్‌ స్టార్‌షిప్‌ (నమూనా) ప్రయోగం మరోసారి విఫలమైంది. ప్రయోగం విఫలం కావడం ఇది నాలుగోసారి. శుక్రవారం టెక్సాస్‌లోని ల్యాంచింగ్ ప్యాడ్ నుంచి రాకెట్‌ను ప్రయోగించేందుకు ఇంజిన్‌ను మండించగా.. అది నేలపై ఉండగానే పేలిపోయింది.

[ad_2]

Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close