Telugu song Lyrics

Saana Kastam Song Lyrics in telugu | Acharya | సాన కష్టం …

Saana Kastam Song Lyrics in telugu: సాన కష్టం… అనే పాట ’ఆచార్య’ సినిమాలోని పాట, దీనిని రేవంత్, గీత మాధురి పాడారు, ఈ పాటకి రచయిత భాస్కర భట్ల ఈ పాటకి సంగీతాన్ని ఇచ్చింది మని శర్మ.

saana-kastam-song-lyrics-in-telugu

Saana Kastam Song Details:

పాటసాన కష్టం…
సినిమాఆచార్య
సంగీతంమని శర్మ
రచయిత భాస్కర భట్ల
గానంరేవంత్, గీత మాధురి

Saana Kastam Song Lyrics in telugu:

కల్లోలం కల్లోలం ఊరువాడా కల్లోలం
నేనొస్తే అల్లకల్లోలం
కల్లోలం కల్లోలం కిందా మీద కల్లోలం
నా అందం అల్లకల్లోలం

నా జడ గంటలూ ఊగే కొద్ది
ఓ అరగంటలో పెరిగే రద్దీ
ధగధగలా వయ్యారాన్ని
దాచి పెట్టేదెట్టాగా

శాన కష్టం సాన కష్టం
సాన కష్టం వచ్చిందే మందాకిని
చూసే వాళ్ళ కళ్ళు కాకులెత్తుకుపోని
సాన కష్టం వచ్చిందే మందాకిని
నీ నడుం మడతలోన జనం నలిగేపోనీ

నా కొలతే చూడాలని
ప్రతోడు టైలర్లా అయిపోతాడే
ఓ నిజంగా భలే బాగున్నాదే
నీ మూలంగా ఒక పని దొరికిందే

ఏడేడో నిమరొచ్చని
కుర్రాళ్ళే ఆర్ఎంపిలు అవుతున్నారే
హే ఇదేదో కొంచెం తేడాగుందే
నీ అబద్ధం కూడా అందంగుందే
ఇల్లు దాటితే ఇబ్బందే… ఒంపు సొంపుల్తో

శాన కష్టం, పాపం… సాన కష్టం
సాన కష్టం వచ్చిందే మందాకిని
అంటించకే అందాల అగరొత్తిని
సాన కష్టం వచ్చిందే మందాకిని
నానమ్మతో తీయించేయ్ నర దిష్టిని

ఓ యే ఓ యే ఎంగిలంది అమ్మాయో
ఓ యే ఓ యే ఎంగిలంది అమ్మాయో

హే, నా పైట పిన్నీసుని
అదేంటో విలన్లా చూస్తుంటారే
ఏ లెవెల్లో ఫోజెడుతున్నావే
మా చెవుల్లో పూలెడుతున్నావే

డాబాలే ఎక్కేస్తారే
పెరట్లో మా యమ్మే నలుగెడుతుంటే
నీ కహాని మాకెందుకు చెప్పు
మేం వింటున్నాం అని కొట్టకే డప్పు
గంప గుత్తగా సోకుల్తో ఎట్టా వేగాలో

శాన కష్టం, అరెరే… సాన కష్టం
సాన కష్టం వచ్చిందే మందాకిని
పంచాయితీలెట్టొద్ధే వద్దొద్దనీ
సాన కష్టం వచ్చిందే మందాకిని
అచ్చు బొమ్మాటాడించు యావత్తుని

Saana Kastam video Song in telugu:

మర్రిన్ని పాటలకోసం క్లిక్ చేయండి

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close