Movie News

Pasupuleti Ramarao: సినీ జర్నలిస్ట్ కన్నుమూత.. కుటుంబానికి అండగా ఉంటానన్న చిరంజీవి


సీనియర్ సినిమా జర్నలిస్ట్ పసుపులేటి రామారావు కన్నుమూసారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.

‘‘రామారావు అనారోగ్యంతో బాధపడుతున్నారరని, నడవలేకపోతున్నారని తెలిసి సన్‌షైన్ హాస్పిటల్ డాక్టర్ గురవారెడ్డి దగ్గరికి పంపించాను. మోకాళ్ల ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నారు. తన అక్కకు బాగోలదేని, ఆమె కోలుకున్నాక ఆపరేషన్ చేయించుకుంటానని అన్నారు. నేనంటే అతనికి ఎంతో అభిమానం, అతనన్నా నాకు అంతే అభిమానం. లేకలేక పుట్టిన తన కుమారుడికి మా ముగ్గురు అన్నదమ్ముల పేర్లు కలిసి వచ్చేలా కళ్యాణ్ నాగ చిరంజీవి అని పెట్టాడు. నీతికి నిజాయతీకి నిబద్ధతకూ మరో రూపంలా చూస్తుంటాను. అతనిక కుటుంబానికి నేను అన్ని రకాలుగా అండగా ఉంటాను. వాళ్ల కుటుంబం బాగోగులను చూసుకుంటాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని తెలిపారు.

READ ALSO:

చిరంజీవితో పాటు చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు. ‘సీనియర్ జర్నలిస్ట్ రామారావు గారు లేని లోటు ఎవ్వరూ తీర్చలేదు. నాకు తెలిసిన కొద్ది మంది జర్నలిస్ట్‌లో రామారావు బాగా దగ్గర వ్యక్తి. ఆయనతో నా సంభాషణలన్నీ జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి’’ అని వరుణ్ తేజ్ తెలిపారు. ‘‘ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి’’ అని నాని సంతాపం తెలిపారు. వీరితో పాటు కళ్యాణ్‌రామ్, హరీశ్ శంకర్, సాయి ధరమ్ తేజ్ తదితరులు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close