NewsTech NewsTelugu News

పెట్రోల్ @ రూ.100+

  • ఏపీలో రూ.100 దాటేసింది
  • షాకిస్తున్న పెట్రోల్
  • డీజిల్ దూకుడు
  • ఈరోజు రేట్లు ఇలా

పెట్రోల్ ధర పెరుగుతూనే వస్తోంది. డీజిల్ ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఈరోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ రేటు 66 పైసలు, డీజిల్ రేటు 88 పైసలు చొప్పున పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో గురువారం పెట్రోల్ ధర రూ.97.36కు, డీజిల్ ధర రూ.92.24కు చేరింది. రాజస్థాన్‌లోని గంగా నగర్‌లో పెట్రోల్ రేటు లీటరుకు రూ.105కు చేరింది.

అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 24 పైసలు పెరుగుదలతో రూ.99.78కు చేరింది. డీజిల్‌ ధర 31 పైసలు పెరుగుదలతో రూ.94.08కు ఎగసింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 24 పైసలు పెరుగుదలతో రూ.100.05కు చేరింది. డీజిల్ ధర 31 పైసలు పెరుగుదలతో రూ.94.34కు ఎగసింది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.52 శాతం తగ్గుదలతో 68.37 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.53 శాతం క్షీణతతో 65.86 డాలర్లకు తగ్గింది.

ఇకపోతే సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close