Tech News
OPPO A12 : ఇండియాలో దూసుకొస్తున్న ఒప్పో… అదిరిపోయే ఫీచర్లతో బడ్జెట్ ఫోన్…
OPPO A12 Mobile : ప్రపంచ స్మార్ట్ మొబైళ్ల కంపెనీ ఒప్పో… A సిరీస్ స్మార్ట్ ఫోన్ OPPO A12 ఇండియాలో లాంచ్ చేసింది. జూన్ 10 నుంచి అమ్మకాలు ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ మీకు ఎన్నో గొప్ప ఆఫర్లను తెచ్చిపెడుతోంది. అందువల్ల ఒప్పో A12 స్పెషల్ ఫీచర్లేంటో తెలుసుకుందాం. ఇది బడ్జెట్ ఫోన్‌గా చెబుతున్నారు కాబట్టి… ఎక్కువ మంది దీన్ని ఎంపిక చేసుకునేందుకు వీలుంది. పైగా… ప్రత్యేక ఆఫర్లు కూడా ఈ బ్రాండెడ్ హ్యాండ్ సెట్‌ను ఎంపిక చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్‌గా మారబోతున్నాయి.
డిజైన్ అండ్ డిస్‌ప్లే :
6.22 అంగుళాల వాటర్ డ్రాప్ ఐ ప్రొటెక్షన్ స్క్రీన్‌తో ఈ మొబైల్ తయారైంది. ఫోన్ బాడీ రేషియోలో 89 శాతం స్క్రీన్ ఉంటుంది. ఫోన్ డిస్‌ప్లేలో బ్లూలైట్ ఫిల్టర్ వాడారు. దీని వల్ల ఇది కళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది. కంటి చూపును కాపాడుతుంది. ఈ మొబైల్ మందం 8.33 మిల్లీమీటర్లు మాత్రమే. బరువు 165 గ్రాములుంది. సింగిల్ హ్యాండ్‌తో వాడేందుకు వీలుగా ఉంది. దీన్లో అత్యంత ఆకర్షణీయమైన అంశం దీని డిజైన్. దీనికి త్రీడీ డైమండ్ బ్లేజ్ డిజైన్ ఉపయోగించారు. ఇది బ్లూ, బ్లాక్ కలర్స్‌లో బ్రిలియంట్ కలర్ కాంబినేషన్లతో లభిస్తోంది.
OPPO A12
స్టోరేజ్ అండ్ బ్యాటరీ :
ఇందులో అతి పెద్ద 4230mAh బ్యాటరీని ఉపయోగించారు. దీని వల్ల మీకు నచ్చిన వీడియోలను కంటిన్యూగా 8 గంటలపాటూ చూడొచ్చు. అంతేకాదు గంటల తరబడి మ్యూజిక్ వినొచ్చు, గేమ్స్ ఆడొచ్చు, మీ ప్రియమైన వారితో ఎక్కువ సేపు మాట్లాడవచ్చు. ఇక ర్యామ్, రోమ్ విషయానికొస్తే… ఇందులో మెమరీ కాంబినేషన్స్ ఉన్నాయి. ఒకటి 3జీబీ ర్యామ్ + 32 జీబీ స్పేస్ అయితే… మరొకటి 4జీబీ ర్యామ్ + 64 జీబీ స్పేస్‌తో లభిస్తోంది. మీ మెమరబుల్ మూమెంట్స్, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇంకా పెంచడానికి ఇందులో మూడు కార్డ్ స్లాట్స్ ఉన్నాయి. మీరు ఫోన్ మెమరీని 256జీబీ వరకూ పెంచుకోవచ్చు.
కెమెరా :
ఇందులో డ్యూయల్ కెమెరాలున్నాయి. ప్రైమరీ కెమెరా 13ఎంపీతో ఉండగా… మొరకటి 2ఎంపీతో ఉంది. ఇక సెల్ఫీ కెమెరా 5ఎంపీతో తయారైంది. ఇందులో 6x జూమ్, బరస్ట్ మోడ్ ఉండటం మరో ప్రత్యేకత. ఇందులో అదిరిపోయే కలర్ మోడ్ వల్ల మీరు ఎక్సలెంట్ పిక్చర్లు తీయవచ్చు. పెద్దగా లైట్ లేని సమయంలో కూడా పిక్సల్ గ్రేడ్ కలర్ మ్యాపింగ్ ఆల్గారిథం ద్వారా మీరు చక్కటి ఫొటోలు తీయగలరు. ఈ కెమెరాకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉంది. ఇది ఫొటోలు తీసేటప్పుడు పర్ఫెక్ట్ నేచురల్ షాట్స్ తీయగలదు.
అదిరిపోయే సెక్యూరిటీ :
యూజర్లకు గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ కల్పించేందుకు ఈ ఫోన్‌లో సెక్యూరిటీ అదిరిపోయింది. బ్యాక్ ప్యానెల్‌పై ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అంతే కాదు… ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేషియల్ అన్‌లాక్ కూడా కల్పించారు. తద్వారా మీరు ఫోన్‌ను అత్యంత వేగంగా అన్‌లాక్ చేయగలరు.
ధర విషయానికొస్తే… 3జీబీ + 32జీబీ మొబైల్… రూ.9990కి లభిస్తోంది. అలాగే 4జీబీ + 64జీబీ హ్యాండ్ సెట్ రూ.11490కి లభిస్తోంది. మీరు ఈ ఫోన్‌తో చాలా ఆఫర్లు కూడా పొందగలరు. మీరు జూన్ 21లోపు దీన్ని కొంటే… మీకు 6 నెలల అదనపు గ్యారెంటీ కూడా ఉంటుంది
ఈ మొబైల్‌ని బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ EMI, ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డ్ EMI ద్వారా కొంటే… 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అదే సమయంలో… క్రెడిట్ కార్డ్ EMI, డెబిట్ కార్డ్ EMIలపై 6 నెలలపాటూ అదనపు ఛార్జీలు ఉండవు. బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, IDFC ఫస్ట్ బ్యాంక్, హోమ్ క్రెడిట్, HDB ఫైనాన్షియల్ సర్వీసెస్, ICICI బ్యాంక్ నుంచి మీకు ఆఫర్లు కూడా లభిస్తున్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే… బడ్జెట్‌లో మనీకి తగిన ఫీచర్లతో ఈ ఫోన్లు లభిస్తున్నాయి. మార్కెట్లలో ప్రస్తుతం ఉన్న ఫోన్లలో ఇవి బెస్ట్‌గా నిలుస్తున్నాయి అందుకు కారణం వీటిలోని బెస్ట్ ఫీచర్లే.